నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటించనున్నారు. గురుపూజోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 5 గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్లీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఈ వారంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో తడి వాతావరణం ఎదురుకావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. “ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా లో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకధాటిగా పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడొచ్చు. ఏపీకి దగ్గరలో ఈ అల్పపీడనం ఏర్పడడటం వలన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా చూపుతుందని ” అని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ తెలిపారు. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నంలో రాత్రి 9 గంటల వరకు 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, నైరుతి రుతుపవనాల క్రియాశీల ప్రభావంతో 58 ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదుకాగా 100కి పైగా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
Lights Off Protest: టీఎంసీని వణిస్తున్న “లైట్ దేర్ బి జస్టిస్.. లెట్ దేర్ బీ జస్టిస్ ఉద్యమం”..