Union Minister Rammohan Naidu: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన వనరుగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ. ఆర్. దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలిసి విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, రెండు నెలల క్రితం…
Union MInister Rammohan Naidu: ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. కానీ, గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. డేటా సెంటర్‌కి అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్.. ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. స ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వస్థతలో ఏపీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సూర్యభగవానుని పరిసరాల్లో స్వచ్చత కార్యక్రమం చేశాం.. 25 లక్షల మోక్కలు నాటాం..…
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలన్నీ తప్పుడు కథనాలని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు కొట్టిపారేశారు. అంతర్జాతీయ మీడియా సొంత కథనాన్ని ప్రసారం చేస్తున్నాయని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.
భారత దేశంలో ప్రతీ 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది.. ప్రతీ గంటకు 60 అదనపు విమానాలు భారత్‌లో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు..
ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్ - 2 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు..
గత ప్రభుత్యం మాదిరి కక్షసాధింపు చర్యలతో జైళ్ళలో పెట్టాలని మేం ఆలోచించడం లేదు అని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు తెలిపారు. స్వేచ్చ, స్వాతంత్ర్యంతో వ్యవహరించేలా పని చేస్తున్నాం.. అయితే, అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు.
Rammohan Naidu: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రూ. 12 లక్షల వరకూ మధ్య తరగతి ప్రజలకి ఆదాయపు పన్నులో ఊరట ఇవ్వడం శుభ పరిణామం అన్నారు.
బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి చెప్పారని తెలిపారు. వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారమయ్యాయన్నారు. జల్‌జీవన్ మిషన్ ప్రధానికల నిజం కాకుండా గత సర్కార్ చేసిందని విమర్శించారు. జల్‌జీవన్ మిషన్ ను పొడిగించారని చెప్పారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తదితరులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు.
గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.