తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో పలు జిల్లా్ల్లో నేషనల్ హైవేలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అయితే.. తెలంగాణలోని మెదక్ జిల్లాలో నేషనల్ హైవే-765డి పరిధిలోని మెదక్-యల్లారెడ్డి రహదారిని 2 లేన్ల రహదారి గా మార్చే ప్రాజెక్టు కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. రెండేళ్ళల్లో మొత్తం 399.01 కోట్ల రూపాయలతో 43.910 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఈ రహదారి నిర్మాణం వల్ల వెనుకబడిన జిల్లాలైన కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ మధ్య సౌకర్యవంతంగా మరింత రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. సరస్వతీ దేవాలయం ఉన్న బాసర పట్టణానికి కూడా ఈ రహదారి మార్గం అనుసంధానం అవుతుందని ఆయన తెలిపారు. అయితే.. దీంతో పాటు ఏపీలో 4లైన్ల నేషనల్ హైవేకు కేంద్రం ఆమోదం తెలిపింది.