ఎన్నికల సమయంలో చాలా చిత్రాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్పా చిత్రాన్ని తలపించే విధంగా చొక్కా కింద ప్రత్యేకంగా టైలర్ చేసిన జాకెట్ ధరించి రూ.20 లక్షల నగదు, 25 తలా బంగారంతో ఓ వ్యక్తి పట్టుబడగా.. తాజాగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తుండగా గోపయ్య అనే వృద్ధుడు పట్టుబడ్డాడు.
Also Read: Lakshmi Parvathi: బాలయ్యపై లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్.. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు..!
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగాం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ తో కూడిన ఓ స్కూటర్ ను పోలీసులు ఆపారు. గోపయ్య తీరు అనుమానాస్పదంగా ఉండడంతో స్కూటర్ ను తనిఖీ చేశారు. దీంతో లోపల తెలంగాణలో తయారైన మద్యం సీసాలు బయటపడ్డాయి. ఇలా బండిలోనుంచి ఒక్కొక్కటిగా బయటికి తీయగా మొత్తం 100 క్వార్టర్ బాటిళ్లు లభించాయి. ఈ మద్యాన్ని తెలంగాణలోని కోదాడ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగామకు తరలిస్తున్నట్లు గోపయ్య తెలిపాడు.
Also Read: Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుంది..
మద్యం బాటిళ్లతో పాటు మోటార్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అక్రమ మద్యం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ముసలోడు మామూలోడు కాదు.. పుష్ప 2 సినిమాను ముందే చూపించాడు.
ఎన్టీఆర్ – నందిగామలో ముసలోడు గోపయ్య కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలింపు.
స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు.
నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న… pic.twitter.com/smvpuYL50s
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2024