Pakistan – UAE: పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్థానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. సెనేట్ కమిటీకి సమర్పించిన నివేదికలో.. పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేయడానికి యూఏఈ నిరాకరించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియా కూడా పాకిస్థానీ వీసాలపై నిషేధాన్ని పరిశీలిస్తోంది, కానీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అభ్యర్థన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.
డాన్ వార్తాపత్రిక ప్రకారం.. UAE – పాకిస్థాన్ మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు ఉన్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెండు దేశాల మధ్య అనేక వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరాయి. అయినప్పటికీ, UAE పాకిస్థానీయులకు వీసాలు మంజూరు చేయడం లేదని పేర్కొంది. పాకిస్థానీలు ఉపాధి, వ్యాపార ప్రయోజనాల కోసం UAEకి వలస వెళతారు. గ్లోబల్ మీడియా ఇన్‌సైట్ ప్రకారం.. UAEలో పాకిస్థానీ ప్రవాసుల సంఖ్య దాదాపు 1.9 మిలియన్లు అని అంచనా. ఈ పాకిస్థానీలలో ఎక్కువ మంది దుబాయ్, అబుదాబి వంటి UAE నగరాల్లో నివసిస్తున్నారు.
గల్ఫ్ న్యూస్ ప్రకారం.. 2024లో దాదాపు 64 వేల మంది పాకిస్థానీలు వర్క్ వీసాలపై UAEని సందర్శించారు. 2025 ప్రారంభంలో మరో 13 వేల మంది పాకిస్థానీలకు వర్క్ వీసాలు మంజూరు అయ్యాయి, కానీ UAE ఇప్పుడు వీసాలు జారీ చేయడం ఆపివేసింది. అయితే ఇది పాకిస్థాన్‌లో ఉద్రిక్తతను పెంచింది.
UAE వీసాలు ఎందుకు ఇవ్వడం లేదు..
పాకిస్థాన్ సెనేట్ మానవ హక్కుల కమిటీ అధిపతి సమీనా ముంతాజ్ జెహ్రీ డాన్ న్యూస్‌తో మాట్లాడుతూ..”పాకిస్థానీయులు యూఏఈ వెళ్లి నేరాలు చేస్తున్నారు. అందుకే ఈ ముస్లిం దేశం వీసాలు జారీ చేయడం ఆపేసింది. అయితే వీసా నిషేధం ఇంకా విధించలేదు. అలా జరిగితే, నిషేధాన్ని ఎత్తివేయడం చాలా కష్టం” అని అన్నారు. ఈ విషయం 2024లో పాకిస్థాన్ సెనేట్‌లో చర్చించారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ను విడిచి వెళ్తున్న కార్మికుల గురించి UAE నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని పాక్ ప్రభుత్వ కార్మిక మంత్రి పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత, పాక్ పౌరులు దొంగతనం, భిక్షాటన వంటి నేరాలకు పాల్పడుతున్నారు. అలాగే UAE పాకిస్థాన్ ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులో వారి దేశానికి వచ్చిన పాకిస్థానీలు UAE మహిళలను వారి అనుమతి లేకుండా చిత్రీకరించారని పేర్కొంది.
READ ALSO: Bheemavaram Balma: సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. ‘అనగనగా ఒకరాజు’ ఫస్ట్ సాంగ్ విన్నారా !