ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.
ధర్మపురి శ్రీనివాస్ కొడుకు.. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఉదయం రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.