Twitter : ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ కారణంగా నిత్యం ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్ శనివారం మరోసారి పెద్ద ప్రకటన జారీచేశారు. వచ్చే నెల నుండి ట్విట్టర్‌లో వార్తలు చదవడానికి వినియోగదారులు తమ జేబులను వదులుకోవలసి ఉంటుంది. వచ్చే నెల నుంచి వార్తలు చదవడానికి వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని మస్క్ ప్రకటించాడు.
Read Also: Telangana new secretariat inauguration: నేడే డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం
ఎలోన్ మస్క్ ప్లాన్ ప్రకారం.. ట్విట్టర్ వినియోగదారులకు వచ్చే నెల నుండి ప్రతి కథనం ఆధారంగా ఛార్జీ విధించబడుతుంది. దీనితో పాటు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వినియోగదారులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేని యూజర్ల ప్రొఫైల్‌ల నుండి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను ట్విట్టర్ తీసివేసింది. ఇప్పుడు మీకు ట్విట్టర్‌లో బ్లూ బ్యాడ్జ్ కావాలంటే.. తొలుత సభ్యత్వాన్ని పొందాలి. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం వెబ్ యూజర్లు రూ.650, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ప్రతి నెలా కంపెనీకి రూ.900 చెల్లించాలి.
Read Also: Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
ఇది ఇలా ఉంటే.. ట్విట్టర్ సిబ్బంది అవగాహనరాహిత్యం వల్ల ఏఎన్ఐ (ఆసియా ప్రీమియర్ న్యూస్ ఏజెన్సీ, ఇండియా న్యూస్) మీడియా సంస్థ ట్విట్లర్ ఖాతా లాక్ అయ్యింది. ఈ విషయాన్ని ANI ఎడిటర్ స్మితా ప్రకాష్ శనివారం తెలిపారు. ‘‘మైక్రోబ్లాగింగ్ సైట్‌ను ఉపయోగించడానికి మీ కనీస వయస్సు సరిపోలడం లేదు.. కాబట్టి, ట్విట్టర్ ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) ఖాతాను లాక్ చేసింది’’ అని ట్విట్టర్ వెల్లడించింది. దీంతో ఆ వార్తా సంస్థకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ ప్రస్తుతం యాక్టివ్‌లో లేదు అనే మెస్సేజ్ వస్తున్నట్టు ఎడిటర్ వివరించారు. అంతేకాకుండా ANI హ్యాండిల్ లాక్ అయినట్టు తెలిపే ట్విట్టర్ ఇ–మెయిల్ చిత్రాన్ని స్మితా ప్రకాష్ ట్వీట్ చేశారు.