ఇండోనేషియాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 4 చేతులు, 3 కాళ్లు, ఒక జననాంగంతో అవిభక్త కవలలు జన్మించారు. ఇండోనేషియాలో ఆ సోదరులు పుట్టినట్లు అమెరికా జర్నల్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ కవలలకు ఓ కాలును తొలగించారు. అయితే కవలల్ని వేరు చేసేందుకు సర్జరీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. చాలా అరుదుగా ఇలా జరుగుతుందని..దాదాపు 20 లక్షల మందిలో ఒకరు ఇలా పుడుతారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అవిభక్త కవలల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగస్ ట్రిపస్ అని పిలుస్తారట. ఇలా జన్మించడానికి కూడా ఓ పేరుంది. అదే స్పైడర్ ట్విన్స్. ఈ కవలల గురించి తాజాగా అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. మరి కొన్న ఆసక్తికర వ్యాఖ్యలు కూడా ప్రచురించారు. వాస్తవానికి ఈ బాలురు 2018లో జన్మించారు. కానీ ఇటీవల విడుదలై జర్నల్ లో వారి గురించి పేర్కొన్నారు. ఇషియోఫాగస్ ట్రిపస్ అవిభక్త కవలల్ని సర్జరీ ద్వారా వేరు చేయడం చాలా కష్టం. ఇలాంటి కవలల్లో దిగువ శరీరా భాగం అతుక్కుని పుడుతారు. వీరిలో మొండాలు వేరుగా ఉంటాయి.
READ MORE: Maoists Press Note: చర్చలకు ప్రభుత్వం నేరుగా స్పందించ లేదు.. మావోయిస్టుల లేఖ..
అలాంటి 60 శాతానికి పైగా కేసుల్లో కవలలలో ఒకరు చనిపోతారు. కానీ ఈ పసిబిడ్డలు అన్ని అసమానతలను తట్టుకున్నారు. అయినప్పటికీ, సోదరులు వారి మొదటి మూడు సంవత్సరాలు చదునుగా పడుకోవలసి వచ్చింది. ఎందుకంటే వారి ప్రత్యేకమైన శరీర నిర్మాణం వారిని కూర్చోకుండా నిరోధించింది.
అయితే ఓ సర్జరీ ద్వారా మూడవ కాలును తీసేశారు. దాంతో వాళ్ల తొడలు, కాళ్లకు బలం వచ్చి ఇప్పుడు స్వంతంగా కూర్చోగలుగుతున్నారు. ఈ శస్త్రచికిత్స చేసిన మూడు నెలలైన ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తలేదు. ప్రస్తుతం ఇంకా ఆ కవలలు కలిసే ఉన్నారు.