తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులు ఇదే తరహా వాతావరణం తెలంగాణలో ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. వడదెబ్బ తగలకుండా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దని సూచించింది ఆరోగ్య శాఖ. అత్యవసరం అయితే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా.. ‘నల్లటి దుస్తులు వేసుకోవద్దు. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఫ్లూయిడ్స్ కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోండి.
Also Read : NTR: గ్లోబల్ రీచ్ ఉన్న హీరోకి పర్ఫెక్ట్ డిజైన్…
ఎండదెబ్బ లక్షణాలు.. చెమట పట్టకపోవడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్ళు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓఆరేస్ ప్యాకెట్లు అంగన్ వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విరివిగా అందుబాటులో పెట్టాము. డ్రింకింగ్ వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాలి. ఈ కాలంలో ఫుడ్, వాటర్ ఎక్కువగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచన.’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read : Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ