నందమూరి ఫాన్స్ మంచి జోష్ లో ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫాన్స్ లో జోష్ వారం ముందు నుంచే మొదలయ్యింది. మే 19న ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్, పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మే 19న ‘ఎన్టీఆర్ 30’ ఫస్ట్ లుక్ ని వైరల్ చేసి, మే 20న సింహాద్రి రీరిలీజ్ కి ఎంజాయ్ చెయ్యడానికి రెడీ అయ్యారు ఫాన్స్. ఈ రెండింటి కన్నా ముందు మే 17న సింహాద్రి రీరిలీజ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యడానికి ఫాన్స్ సిద్ధంగా ఉన్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా రానున్నాడు.
ఎన్టీఆర్ బర్త్ డే దగ్గర పడుతూ ఉండడంతో ఫాన్స్ ‘కామన్ డీపీ’ని లాంచ్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటిన ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా కామన్ డీపీని ఫాన్స్ రెడీ చేశారు. ఎన్టీఆర్ పైన ఇంటర్నేషనల్ మీడియా రాసిన ఆర్టికల్స్ అన్ని ఈ కామన్ డీపీలో పెట్టారు. ఫాన్స్ ఈ కామన్ డీపీని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో #NTR30 #ManOfMasessNTR #JrNTR టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే 19, 20న ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో చెయ్యబోయే హంగామా… సింహాద్రి రీ రిలీజ్ థియేటర్స్ లో చెయ్యబోయే సెలబ్రేషన్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలి.