వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Weather Updates : తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారుజామునే ఎండలు మండి పడటంతో ప్రజలు దైనందిన పనులు చేసుకోవడానికే ఇబ్బందిపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు…