పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రభాస్–త్రిప్తి కాంబినేషన్ తొలిసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు దర్శకుడు సందీప్‌కు కూడా ఇది కొత్త కాంబినేషన్ కాదు. త్రిప్తి, సందీప్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ ‘యానిమల్’లో చిన్న పాత్ర అయిన కానీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ పాత్రతోనే ఆమె తెలుగువారికి కూడా పరిచయం అయింది.
Also Read : Naveen Polishetty : సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్ అవుట్ ..?
తరువాత హిందీలో వరుస ప్రాజెక్ట్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తి, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది. ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నప్పటికీ, టాలీవుడ్ హీరోలతో పనిచేయాలన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న త్రిప్తి డిమ్రిని హోస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు.. టాలీవుడ్‌లో ఏ హీరోతో పని చేయాలని అనుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, క్షణం కూడా ఆలోచించకుండా త్రిప్తి — “జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయడం నా కోరిక. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇష్టం!” అని సమాధానం చెప్పింది. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ కూడా భారీగా రియాక్ట్ అవుతున్నారు. “ఎన్టీఆర్-త్రిప్తి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది”, “స్పిరిట్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో త్రిప్తిని చూడొచ్చేమో!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి మార్కెట్, భారీ క్రేజ్ ఉన్నందున భవిష్యత్తులో ఈ కాంబినేషన్ నిజమైతే ఇండస్ట్రీ మొత్తంలోనే సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, త్రిప్తి ‘స్పిరిట్’ షూటింగ్‌కు సిద్ధమవుతోంది.