పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రభాస్–త్రిప్తి కాంబినేషన్ తొలిసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు దర్శకుడు సందీప్‌కు కూడా ఇది కొత్త కాంబినేషన్…