టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’. జనవరి 14న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, పండుగ రేసు నుంచి ఈ మూవీ తప్పుకుందట. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి ప్రభాస్–మారుతి ‘రాజా సాబ్’, చిరంజీవి–అనిల్ రావిపూడి సినిమా లాంటి భారీ చిత్రాలు రావడం తో పోటీ దారుణంగా మారింది. దీంతో మేకర్స్ సినిమా తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను జనవరి 23 లేదా రిపబ్లిక్ డే వీకెండ్‌లో విడుదల చేసే అవకాశాలు ఉందట.
Also Read : iBomma Ravi : ఐబొమ్మ రవి ఐదోరోజు కస్టడీ విచారణ.. కీలక విషయాలు బయటకు
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. కథ, కామెడీ, నవీన్ పోలిశెట్టి టైమింగ్ కారణంగా మొదటి టీజర్ నుంచి సినిమా పై బజ్ ఉంది. ఇక ఈ సినిమా పండగ రేసు నుంచి తప్పుకున్నా, రిపబ్లిక్ డే రిలీజ్ అయితే మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో ప్రత్యేకమైన కామెడీ డిటెక్టివ్ స్టైల్‌తో మెప్పించిన నవీన్.. ‘జాతిరత్నాలు’ తో నవ్వుల తుఫాన్ సృష్టించాడు. ‘మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి’ తో హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ చూపించాడు. . ఇక ‘అనగనగా ఒక రాజు’ కోసం సింగర్‌గా కూడా మారి తన మరో టాలెంట్ బయటపెట్టబోతున్నారు. ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడినా, నవీన్ పోలిశెట్టి మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పాలి.