Trainee Aircraft Emergency Landing: ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులోనూ శిక్షణా విమానాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. శిక్షణా విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా వ్వవసాయ క్షేత్రంలో ల్యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెలగావిలో గల సాంబ్రా విమానాశ్రయం నుంచి సోమవారం రెడ్‌బర్డ్ శిక్షణా విమానం ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సమస్యను గమనించిన పైలట్ ఫ్లైట్‌ను విమానాశ్రయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇలా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో శిక్షకుడితోపాటు ట్రైనీ పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Read Also: Harish shankar : పవన్ కోసం అదిరిపోయే డైలాగ్స్ రాసిన హరీష్ శంకర్
విషయం తెలుసుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు, ట్రెయినింగ్ స్కూల్‌కు చెందిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని బెలగావి ఎయిర్‌ఫోర్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, సోమవారం ఉదయం భారతీయ వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ (Apache Helicopter) మధ్యప్రదేశ్‌లోని బిండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ అత్యవసరంగా దించాడని అధికారులు తెలిపారు. అయితే పైలెట్ అప్రమత్తంగా ఉండడం వల్ల హెలికాప్టర్‌ను సురక్షితంగా దించామని, భారీ ప్రమాదాన్ని తప్పించామని అధికారులు తెలిపారు. ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్.. ప్రపంచంలో అత్యంత ఆధునిక హెలికాప్టర్. మల్టీరోల్ ఆపరేషన్స్‌లో దీన్ని వాడుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.