కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహిస్తున్న సభకు బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే భయంతో మా సభను ప్రభుత్వం అడ్డుకుంటోంది అని ఆమె సీరియస్ అయ్యారు. రోడ్లపై బారికేడ్లు పెడితే భయపడతామా? మా జాతకాల్లో భయాల్లేవు.. ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారు..? పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు.. ఎవడ్రా మమ్మల్ని ఆపేది? అని రేణుకచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కిలు ఉన్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భట్టి పాదయాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాకతో వీరి సమావేశానికి ఆసక్తి నెలకొంది.
CM Nitish Kumar comments on KCR Sabha: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నాయకులు రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా విపక్షాల భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత రోజ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏం అక్కర లేదని.. నాకు ఒకే కల ఉందని , ప్రతిపక్షాల నాయకులు ఏకమై ముందుకు సాగాలని, అది దేశానికి మేలు చేస్తుందని’’ ఆయన…