కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి.. తాను కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇక ఆ తర్వాత 18 పేజెస్ అనే సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు నిఖిల్ మార్కెట్‌ను మరింతగా పెంచాయి. అందుకే భారీ టార్గెట్‌తో భారీ అంచనాల మధ్య.. ఈ వారం ‘స్పై’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు నిఖిల్. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవల్లో 1600 పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం, రానా గెస్ట్ రోల్‌లో నటించడంతో.. మరింత హైప్ క్రియేట్ అయింది. గ్యారీ బీహెచ్ డైరెక్షన్లో, రాజశేఖర్ రెడ్డి కథ అందిస్తూ నిర్మించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది కానీ కలెక్షన్స్ మాత్రం సూపర్ హిట్ అనే రేంజులో వస్తున్నాయి. మొదటి రోజు 11 కోట్లకి పైగా రాబట్టిన స్పై మూవీ, నిఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.
స్పై సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నిఖిల్ ఇచ్చిన ఎలివేషన్ మాత్రం మామూలుగా లేదు అంటూ సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ హల్చల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే స్పై మూవీలో ఖాదర్ ఖాన్ అనే గ్లోబల్ టెర్రరిస్ట్‌ను నిఖిల్ పట్టుకోవడానికి వెళ్లినప్పుడు.. అతను పుష్ప మూవీలోని ఊ అంటావా.. పాటకు డ్యాన్స్ చేస్తుంటాడు. అయితే ఆ టెర్రరిస్ట్ బతూర్ ఫ్రమ్ బలోచిస్తాన్ అని చెప్పడంతో.. మరి బన్నీ పాటలు వింటున్నావెంటని అడగ్గా.. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ సార్ అని చెబుతాడు. అఫ్‌కోర్స్.. ఆయనకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారని నిఖిల్ ఫ్రెండ్ చెప్పడంతో.. ఈలలు, అరుపులతో థియేటర్ టాపులు లేచిపోతున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ‘స్పై’ మూవీని గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ క్రేజ్ అంటూ.. ఆ వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏదేమైనా.. స్టార్ హీరోలకి ఇచ్చే ఇలాంటి ఎలివేషన్స్ సినిమాలకు కలిసొచ్చే అంశాలేనని చెప్పొచ్చు.