అదానీ గ్రూప్ పవర్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా సొంతం చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూట్ క్లీయర్ చేసుకున్నారు. ఈ రెండు సంస్థల మధ్య కొనుగోలు ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ కంపెనీని పీఎఫ్సీ (PFC) కన్సల్టింగ్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ వార్తలు బయటకు రావటంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి 1082.40 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి.
Read Also: IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. భారత కెప్టెన్ ఎవరు?
కాగా, హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్.. దీన్ని పీఎఫ్సీ కన్సల్టింగ్ లిమిటెడ్ రూపొందించింది. ఫేజ్- 3 పార్ట్ ఎ ప్యాకేజీ కింద ఖవ్రా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 7జీడబ్ల్యూ పునరుత్పాదక శక్తిని రవాణా చేయడమే దీని యొక్క లక్ష్యం.. టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది. రాబోయే 24 నెలల్లో కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనుందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.
Read Also: Singareni Election Results: ఐఎన్టీయూసీ హవా.. సత్తా చాటిన ఏఐటీయూసీ
అయితే, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సుమారు 301 కిలో మీటర్ల మేర ట్రాన్స్ మిషన్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు దాదాపు 3 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ప్రాజెక్ట్ లో 765కేవీ హల్వాద్ స్విచింగ్ స్టేషన్ నిర్మాణం కూడా ఉండనుంది. ఇది కాకుండా అదానీ గ్రూప్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ ఫోర్ లిమిటెడ్ 49:51 శాతం వాటాతో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయడానికి యూఏఈకి చెందిన ఎస్యాసాఫ్ట్ హోల్డింగ్స్ తో అదానీ గ్రూప్స్ ఒప్పందం చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ కింద కంపెనీ ఇండియాతో పాటు విదేశాల్లో స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్టులపై వర్క్ చేయనుంది.