తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది..
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీ బోర్డర్ నియోజకవర్గం కాబట్టి మేం మధిరలో ప్రచారానికి వచ్చామన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్రెడిబులిటీ కోల్పోయారని.. ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చిన కేసీఆర్.. తన ఇంటిలో ఉన్న వారికే ఉద్యోగాలిచ్చుకున్నారని విమర్శించారు. కీలక పదవులు కేసీఆర్ ఇంట్లోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ ఇక పేలని తుపాకినే.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.
నల్లగొండ పట్టణ అభివృద్ధికి 400కోట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి నమస్కారం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కారును.. మోడీ సంక్షేమ గ్యారేజ్ కీ పంపాలన్నారు అమిత్ షా. కేసీఆర్ అవినీతి, కమిషన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. జిల్లాలో సాగు నీరు ప్రాక్టులను నిర్లక్ష్యం చేసిందని అమిత్ షా విమర్శించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి 400కోట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని, దళిత బంధులో 30 నుండి 40 శాతం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమిషన్లు తీసుకున్నారని అమిత్ షా ఆరోపించారు. బీసీ నీ సీఎం చేస్తాం అనీ బీజేపీ హామీ ఇచ్చారని, ఎంఐఎం తో కేసీఆర్ చేతులు కలిపారన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే ఉర్దూ ను రెండో అధికార బాషాగా కేసీఆర్ చేశారని ఆయన మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్ లను బీజేపీ అధికారంలోకి రాగానే తొలగించి… బీసీ లకు ఇస్తామని అమిత్ షా వెల్లడించారు.
మంత్రి మల్లారెడ్డి అఫడవిట్‌పై పటిషన్.. కొట్టేసిన హైకోర్టు
మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి వేసిన నామినేషన్లో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని అతను కోర్టు కోరారు. ఇక దీనిపై శనివారం విచారణ చేపట్టగా.. ఆఫిడవిట్‌లోని అభ్యంతరాలపై ఫిర్యాదు దారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్టు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మంత్రి మల్లారెడ్డిపై వేసిన పటిషన్ హైకోర్టు కోట్టివేసింది.
జగన్ సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు తలదించుకోవాలి..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు తలదించుకోవాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. పేదవాడికి జబ్బు చేస్తే ఆదుకోవాలని చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత వైఎస్‌కు దక్కుతుందన్నారు. అబద్ధం – నిజానికి మధ్య యుద్ధంలో నిజాన్ని గెలిపించాలన్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ రోజున మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కారణం ఇదే..
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్‌లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్‌ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున ఢిల్లీ మందుబాబులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ రోజు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ డ్రై డేగా పాటించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కిషన్ మోహన్ ఆదేశాలు జారీ చేశారు.
అధికారంలోకి రాగానే… ముథోల్ ను దత్తత తీసుకుంటా
బీజేపీ అధికారంలోకి వస్తే ముథోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అట్లాగే నాందేడ్ నుంచి బైంసా- నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వే లైన్ నిర్మాణానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. హైదరాబాద్ నుంచి బోధన్- బాసర మీదుగా బైంసా వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిని మహారాష్ట్రలోని మాహోర్ వరకు పొడిగించాలనే ప్రజల డిమాండ్ ను కేంద్రం ద్రుష్టికి తీసుకెళతానన్నారు. అట్లాగే ముథోల్ టెక్స్ టైల్ పార్క్, పత్తి పంట బాగా పండే ముధోల్ నియోజకవర్గంలో టెక్స్ టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరిపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి ముథోల్ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు.
పిస్టల్‌తో కాల్చుకుని గరుడ్ కమాండో ఆత్మహత్య
భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గరుడ్ కమాండోను నైట్ డ్యూటీకి నియమించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు 23 ఏళ్ల యోగేష్ కుమార్ మహతోగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు భుజ్ ‘ఎ’ డివిజన్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ డిజె ఠాకోర్ తెలిపారు. యోగేష్ జార్ఖండ్ నివాసి కాగా.. భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో భారత వైమానిక దళం యొక్క గరుడ్ కమాండో ఫోర్స్ యూనిట్‌లో పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌లో నివసిస్తున్న అతని తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల అతను కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని, దీంతో ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగింది
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకువచ్చేందుకు కాషాయనాథులు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా నేడు వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ.. సర్వసంపన్న తెలంగాణ కేసీఆర్ అవినీతితో అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అవినీతి అడ్డగా మారారని, బీఆర్ఎస్ అంటే భారత్ బ్రాస్టాచార్ సమితి అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం చేశారని, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగిందని, కేసీఆర్ కుంభకోణాలు లెక్కబెట్టాలంటే వారం రోజులు పడుతుందన్నారు అమిత్ షా.
తెలంగాణ కోసం ఆనాడు పోరాడేటోడు ఎవ్వడు లేడు
సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే అన్ని అబద్ధాలు, అబండాలు, బట్ట కాల్చి మీద వేసుడు చూస్తున్నామన్నారు. అమెరికాలో ఇలా ఎన్నికల మీటింగ్ లు ఉండవని, ఎన్నికలు వస్తే నిలబడ్డ అభ్యర్థి గుణం, బలం అన్ని చూడాలన్నారు. దీనికంటే ముఖ్యంగా నిలబడ్డ అభ్యర్థి పార్టీ గురించి తెలుసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. మన ఓటు మనకే వజ్రాయుధం.. ఎవడో మనకు చెప్పిండని ఓటు వేయొద్దన్నారు సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందే ఉందని, తెలంగాణ సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందన్నారు కేసీఆర్. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఎం చేసింది..పదేళ్ల తెలంగాణలో బీఆర్‌ఎస్ చేసింది అనేది చర్చ జరగాలన్నారు.
సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో
తెలంగాణలో ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు దశ(పది) అంశాలతో కార్యచరణ రూపొందించారు.
“రాహుల్ గాంధీ అద్దంలో చూసుకో”.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇతరులపై వేళ్లు చూపించే ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలని శనివారం అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు.
రాహుల్ గాంధీ అధ్యక్షతన 2019లో కాంగ్రెస్ 540 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. 50 స్థానాలకు పడిపోయిందని అన్నారు. దీనికి ప్రధాని మోడీ నుంచి రాహుల్ గాంధీ ఎంత డబ్బు తీసుకున్నారు..? ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. ఇతరుల వైపు వేళ్లు చూపే ముందు మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని అన్నారు.
దుబాయ్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్, విమాన కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. దుబాయ్ నివాసితులు బీచ్‌లకు దూరంగా ఉండాలని.. రోడ్లపై వరదలు తగ్గాకే ఇంట్లోనుంచి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా పరిస్థితి విషమించడంతో దుబాయ్ పోలీసులు ఉదయం 6.30 గంటలకు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తుఫాను, వర్షం కారణంగా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. యుఎఇ జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. దుబాయ్ లో నీట మునిగిన పలు దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.