తాగుబోతు వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లికూతురు..
ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది. బంధువులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా కూడా ససేమిరా అంది. చివరకు పెళ్లి రద్దైంది. ఉత్తర్ ప్రదేశ్ వారణాసి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన యువకుడితో జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సాయంత్రం బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ కు ఊరేగింపుగా వచ్చాడు వరుడు. అతని బంధువులు స్నేహితులు కూడా వేదికపైకి చేరారు. పెళ్లి కూతురు కూడా తన స్నేహితురాళ్లతో వేదికపైకి చేరుకుంది. వధూవరులు దండలు మార్చుకునే సమయంలో పెళ్లి కూతురు స్నేహితురాళ్లను చూసి వరుడి ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేశారు. అప్పటికే వారంతా మద్యం తాగి ఉన్నారు. దండలు మార్చుకునే సమయంలో వరుడు కూడా తాగి ఉన్నట్లు వధువు గమనించింది. దీంతో అతనితో పెళ్లి వద్దంటూ వేదికపై నుంచి దిగి తన గదిలోకి వెళ్లిపోయింది. బంధువులు గంటల తరబడి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, వధువు వినలేదు. చివరకు చేసేదేం లేక ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి.
నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కన్నుమూశారు. శరత్ బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించారు. శరత్ బాబు అంత్యక్రియలు మంగళవారం (మే 23న) చెన్నైలో జరగనున్నాయి.
తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దొంగలు..
ముగ్గురు వ్యక్తులు తన భార్య, 14 ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో ఈ ఘటన జరిగింది. సైఫ్నిలోని వారి ఇంటిలో నుంచి దొంగలు నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వ్యక్తి చేసిన ఆరోపణలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సదరు వ్యక్తి తన ఇంటి నుంచి రూ. 5000 నగదుతో పాటు మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత మళ్లీ కొద్ది సేపటికి వచ్చి తన భార్యతో పాటు కూతురుపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. రేపు కొవ్వూరుకు ముఖ్యమంత్రి
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. శ్యామలానగర్‌లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం జగన్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి 8.40కి బయలుదేరి కొవ్వూరులోని కేజీఎం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉ.9.20కి చేరుకుంటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులను కలుస్తారు.
లిప్ లాక్ లే కాదు.. వెబ్ సిరీస్లో అంతకు మించి ఉంటాయట
ఏం మాయ చేశావే తో ప్రేక్షకులను మాయచేసేసింది సమంత. వరుస హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరిమధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది సమంత. చైతుతో విడిపోయిన తర్వాత తన దృష్టి అంతా సినిమాలపైనే పెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే ఇంకొక వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. తాజాగా శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తన దృష్టిఅంతా తన నెక్ట్స్ మూవీపై పెట్టింది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.. నిరసనకు అనుమతులు లేకపోవడంతో తాము కార్యక్రమాన్ని అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాగైనా నిరసనను కొనసాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేయడంతో.. ముందు జాగ్రత్తగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని మూడేళ్లుగా కోరుతున్నామని.. ముఖ్యమంత్రి స్వయంగా మూడుసార్లు సంతకాలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తాము విధ్వంసం చేయడం లేదని.. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. పోలీసుల తీరు సరికాదన్నారు. క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం రూ.7 కోట్ల నిధులు అడిగామని ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల లోగోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ యొక్క అద్భుతమైన పురోగతి మరియు దాని ఏర్పడినప్పటి నుండి దాని పదేళ్ల ప్రయాణానికి ప్రతీకగా లోగోను రూపొందించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, విద్యుత్, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక వారసత్వం మరియు యాదాద్రి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి నీటిపారుదల ప్రాజెక్టులతో సహా వివిధ ముఖ్యమైన విజయాలను లోగో పొందుపరిచింది. ఇది డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరియు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వంటి ఐకానిక్ నిర్మాణాలను చేర్చడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు మరియు T-హబ్ వంటి పట్టణ మౌలిక సదుపాయాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇవన్నీ దేశానికి తెలంగాణ మోడల్‌కు చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి.
ఓటర్ల జాబితాతో జనన, మరణ వివరాలు లింక్.. కొత్త బిల్లును తీసుకురానున్న కేంద్రం
జనన, మరణాలకు సంబంధించిన వివరాలను ఓటర్ల జాబితాతో పాటు మొత్తం అభివృద్ధి ప్రక్రియకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చేందుకు యోచిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం తెలిపారు. భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ కార్యాలయం ‘జనగణన భవన్’ని ప్రారంభించిన అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. జనాభా గణన అనేది అభివృద్ధి ఎజెండాకు ఆధారం అయ్యే ప్రక్రియ అని ఆయన అన్నారు.
ఖచ్చితమైన జనాబా గణాంక వివరాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జనాభా గణన సమాచారం ఆధారంగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరుతాయని ఆయన తెలిపారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రత్యే పద్దతిలో భద్రపరిస్తే అభివృద్ధి పనులను సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు. ఎన్నికల జాబితాతో జనన, మరణ వివరాలను లింక్ చేసే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దీని వల్ల ఒక వ్యక్తికి 18 ఏళ్లు నిండితే ఆటోమేటిక్ గా ఓటర్ల జాబితాలో చేర్చబడతాడని, మరణించినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్నికల జాబితా నుంచి అతని పేరును తొలగించవచ్చని చెప్పారు.
మే 23 నుంచి రూ. 2,000 నోట్లను మార్చుకోవచ్చు.. క్లారిటీ ఇదిగో?
గత వారం చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన తర్వాత పౌరులు మే 23, 2023 (మంగళవారం) నుంచి రూ.2,000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం ప్రారంభించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ప్రజలు హడావిడి చెందాల్సిన అవసరం లేదని, రూ. 2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సౌకర్యం సెప్టెంబర్ 30, 2023 వరకు తెరిచి ఉంటుందని అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, మార్పిడి/డిపాజిట్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు ప్రత్యేక సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. 2,000 రూపాయల నోట్ల మార్పిడి/డిపాజిట్ సదుపాయం నేటి నుంచి ప్రారంభం కాగా, పనిని సులభతరం చేసే కొన్ని కొన్ని కీలక ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.
ఏంటి ‘బ్రో’ ఇది… ఐటమ్ సాంగ్ కు ఆ స్టార్ హీరోయినా ?
రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రాబోతుంది. సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మెగా మల్టీస్టారర్గా రూపొందుతోన్న ‘బ్రో’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది మొదలైన నెల రోజులకే పవన్ కల్యాణ్ కు సంబంధించిన టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి మిగిలిన నటీనటులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు జరుగుతోన్న షెడ్యూల్లో సాయి తేజ్ సీన్లను తెరకెక్కిస్తున్నారు.
ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు..
సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మించారనేది వింటాం. అయితే కొన్ని సందర్భాల్లో చాలా అరుదుగా ఇద్దరి కన్నా ఎక్కువ మంది శిశువులు జన్మిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది రాజధాని రాంచీలోని రిమ్స్ లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని, ఎన్ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఐదుగురు శిశువులు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని తెలిపారు. ‘‘ఇత్‌ఖోరి ఛత్రాకు చెందిన మహిళ రిమ్స్ లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువులు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU)లో ఉంచబడ్డారు. డాక్టర్ శశిబాలా సింగ్ విజయవంతంగా డెలివరీ చేశారు’’ అని రిమ్స్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. వైద్యుల బృందం తల్లీ శిశువుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
హీరోయిన్ డింపుల్ హయతి పై క్రిమినల్ కేసు
గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతి. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో అమ్మడి అందచందాలకు కుర్రకారు వెర్రెక్కిపోయారు. తాజాగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది డింపుల్. సినిమా ఆశించిన విజయం దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఈ బ్లాక్ బోల్డ్ బ్యూటీపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఓ ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్‌తో పాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఇదే అపార్ట్ మెంట్లోని ఫ్లాట్ నంబర్ సీ (2)లో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.