పవన్ కల్యాణ్ ముందే ఊహించాడా..? వైరల్‌గా మారిన ‘భారత్’ కామెంట్స్
ఇండియా కాస్త భారత్‌గా మారనుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. దానికి ప్రధాన కారణం.. మన దేశం పేరును ‘ఇండియా’ అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ అని పేర్కొనడంతో.. ఇండియా త్వరలోనే మాయం కాబోతోందా? భారత్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ చర్యకు పూనుకున్నారా? అనేది చర్చనీయాంశంగా మారిపోయింది.. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రింట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది.. దీనిపై పెద్ద వివాదమే రేగుతోంది.. విపక్షాలు దీనిని తప్పుపడుతుండగా.. కొందరు సినీ, క్రికెట్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు.. ఇదే సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి.. ఇంతకీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘భారత్’ గురించి ఏమన్నారు? ఏ సందర్భంలో ఆ చర్చ వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే.. తన అన్నయ్య, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు పవన్ కల్యాణ్.. ఆ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ‘ఇండియా’ను ‘భారత్’ అని మారుస్తున్నారన్న దానిపై జోరుగా చర్చ సాగుతోన్న సమయంలో.. పవన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. ఇంతకీ పవన్ ఏం మాట్లాడంటే.. ‘ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు.. భారతదేశం అనేది మనది’ అంటూ వ్యాఖ్యానించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అయితే, ప్రస్తుతం ఆ వీడియోను జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. ఇక.. కేంద్ర ప్రభుత్వ చర్యపై ఓ వైపు తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తుండగా.. పవన్ గతంలో చేసిన కామెంట్లపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో ప్రేమించుకున్నారు.. పెళ్లి ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సీఎన్‌పేట గ్రామానికి చెందిన యనమల హరిబాబుకు సోషల్ మీడియా (ఫేస్‌బుక్)లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుకన్యతో పరిచయం ఏర్పడింది.. వారి వ్యవహారం ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్ వరకు వెళ్లింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ఆ జంట.. 2 నెలల కిందట పెళ్లితో ఒక్కటయ్యింది.. దాదాపు నెల రోజుల పాటు అక్క ఇంట్లో తలదాచుకున్న ఆ జంట.. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు.. అదే ఇప్పుడు ఆ జంటతో పాటు.. యువకుడి కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టింది. హరిబాబు ఇంటికి వచ్చిన సుకన్య కుటుంబ సభ్యులు.. హరిబాబుకు సంబంధించిన ఆస్తి పాస్తులు అన్నీ యువతి పేరుపైకి మార్చాలంటూ పట్టుబట్టారు. అయితే, హరిబాబుకు సోదరుడు కూడా ఉండడంతో.. ఆస్తిపాస్తులు రాసివ్వడం ఇప్పడే కుదరదని స్పష్టం చేశారు.. ఇక, దీంతో రెచ్చిపోయిన యువతి బంధువులు.. రాడ్లు, కర్రలతో హరిబాబు కుటుంబంపై దాడి చేశారు. అతడి తల్లి కొట్టడమే కాకుండా ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.. అడ్డుకునేందుకు యత్నించిన హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు.. ఇది గమనిస్తూ చాలా సేపు మనకు ఎందుకులే అనుకున్న స్థానికులు.. ఆ తర్వాత దాడి చేస్తున్నవారిపై తిరగబడ్డారు. దీంతో.. సుకన్య బంధువులు పరారయ్యాడు.. ఇక, తీవ్రంగా గాయపడిన హరిబాబు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు.. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా.. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. పెళ్లి చేసుకున్న ఆ కాపురంలో ఇప్పుడు ఆస్తిపాస్తులు చిచ్చుపెట్టాయి.
క్యాబ్ డ్రైవర్ల నిరసన.. ఆరూట్‌కు రాలేమంటూ రైడ్ క్యాన్సిల్..
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో రవాణా వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతోంది. అయితే.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి.. నగరం నుంచి విమానాశ్రయానికి.. ఆ మార్గంలో క్యాబ్‌ల వినియోగం పెరిగింది. అదే స్థాయిలో క్యాబ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ప్రయాణికుల రద్దీ, క్యాబ్‌ల మధ్య పోటీని దృష్టిలో ఉంచుకుని ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ కంపెనీలు తక్కువ ఛార్జీలను నిర్ణయిస్తున్నాయి. ఇలా తక్కువ ధరల వల్ల క్యాబ్ డ్రైవర్లు సంపాదనకు నోచుకోవడం లేదు. యాప్స్‌లో చూపిన ధరలకే రావాలని ప్రయాణికులు కోరుతున్నారని.. ఆ ధరలకు వాహనాలు నడపడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా సరిపోవడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. క్యాబ్వాలాలు కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సర్వీసులను నిలిపివేస్తూ.. ‘తక్కువ ధర.. గాలి లేదు’ అంటూ నిరసనకు దిగారు. దీంతో సమయానికి క్యాబ్‌లు అందుబాటులో లేక.. సర్వీసులు బుక్ చేసినా.. డ్రైవర్లు నిరాకరించడంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోట్లు కురిపిస్తోన్న లిక్కర్ కిక్కు.. ఒక్క ఆగస్టులోనే 6 వేల కోట్ల ఇన్‌కం
ప్రభుత్వాల ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల ఖజానాలకు ఆరు బీర్లు-మూడు విస్కీ బాటిళ్ళలాగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణలో మద్యం కిక్ తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 2 లక్షల కోట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. 2021 సంవత్సరం నుంచి మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం రూ.30 వేల కోట్ల మార్కును దాటుతోంది. ఈసారి రూ.కోటికి చేరే అవకాశం కూడా ఉంది. 40 వేల కోట్లు. ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా వైన్ బార్లు, బార్ల ఏర్పాటుతో పాటు గ్రామాల్లోని బెల్టుషాపులను యథేచ్ఛగా వదిలేయడం, అధికారులకు టార్గెట్లు పెట్టడం, మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయపు వరద పారుతోంది. గత ఏడేళ్ల ఆదాయంతో పోలిస్తే.. ఈ రెండేళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. ఇది మూడు రెట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. ఏడేళ్లలో మద్యం విక్రయాలు రెట్టింపు అయ్యాయి. ఆదాయం మూడింతలు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.
అమెరికా కాలేజీలు, వర్సిటీలకు సమస్యగా మారిన ఏఐ టూల్స్.. విద్యార్థులు ఏం చేస్తున్నారంటే
మొన్నటి వరకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ పై ఏది కావాలన్నా ఆధారపడే వాళ్లం. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ హవా నడుస్తుంది. ఎక్కడ చూసిన చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించే వినిపిస్తుంది. అయితే ఇవే ఇప్పుడు విద్యాసంస్థలకు తల నొప్పిగా మారాయి. విద్యార్థులు ఈ ఏఐ టూల్స్ ను ఉపయోగించి తమ పనులను చకచక చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థుల సృజనాత్మకత దెబ్బతింటుందని కాలేజీలు, యూనివర్శిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక తాజాగా అమెరికాలోని కొన్ని కాలేజీలకు ఈ టూల్స్ మరీ తలనొప్పిగా మారాయి. యూఎస్ లో కొన్ని కాలేజీలలో, యూనివర్శిటీలలో విద్యార్థులు చేరాలంటే వారి హిస్టరీ మొత్తం ఒక వ్యాసం రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే వారికి అడ్మిషన్లు ఇస్తారు. ఇందులో విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ ను కూడా ఆయా విద్యాసంస్థలు చెక్ చేస్తాయి. అయితే చాలా మంది విద్యార్థులు చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ ను ఉపయోగించి ఈ పనిని సులువుగా చేసేస్తున్నారు. ఎవరి వ్యాసం చూసిన అద్భుతంగా అనిపిస్తుంది. దీంతో ఎవరికి అడ్మిషన్ ఇవ్వాలో తెలియక విద్యా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే కొన్ని యూనివర్శిటీలు ఈ ఆర్టిఫిషియల్ టూల్స్ పై నిషేధం విధించాయి. కొన్ని యూనివర్శిటీలు వీటిని పాక్షికంగా ఉపయోగించవచ్చని తెలిపాయి. ఇదిలా వుండగా మిచిగాన్ యూనివర్సిటీ అయితే వీటి వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ఏఐ టూల్స్ అందుబాటులోకి రాగానే ప్రారంభంలోనే విద్యాసంస్థలు స్టూడెంట్స్ భవితవ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి వాడటానికి ఎంతో సులభంగా ఉండటంతో పాటు సమాచారం కూడా కావాల్సిన విధంగా రావడంతో మెదళ్లకు పని చెప్పడం మానేస్తారని అనుమానం వ్యక్తం చేశాయి. తాజాగా ఇది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
ఫోన్ ను బెడ్ మీద పెట్టి పడుకుంటున్నారా? ఏమౌతుందో తెలిస్తే గుండె ఆగిపోతుంది..
రాత్రి పొద్దుపోయే వరకూ మొబైల్ చూస్తూ నిద్రలోకి జారుకుంటే అది మెదడుపై పెను ప్రభావం చూపిస్తుంది. నిద్రలో క్రమక్రమంగా నాణ్యతలేమి తగ్గి నిద్రలేమి బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చివరకు అది వ్యక్తుల రోజువారి పనులకు కూడా ఆటంకంగా మారుతుందని, మానసిక సామర్థ్యం సన్నగిల్లి పనిలో తప్పులు ఎక్కువ జరుగుతాయని చెబుతున్నారు.. మనసు మొత్తం ఫోన్ మీదే ఉంటే కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక బెడ్ మీద తలదిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఇక అంతే సంగతి..యాపిల్ సంస్థ తన కస్టమర్లకు జారీ చేసిన మార్గదర్శకాలే నిదర్శనం. యాపిల్ సూచనల ప్రకారం, ఫోన్లను దిండ్లు లేదా దుప్పట్లపై లేదా వాటి పక్కల అస్సలు పెట్టుకోకూడదు. గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వీటిని చార్జింగ్ చేయాలని యాపిల్ స్పష్టం చేసింది. నిద్ర ముంచుకొచ్చే సమయాల్లో పక్కనే ఫోన్ ఉంటే అందులోని వెలుతురుకు నిద్రాభంగం తప్పదని హెచ్చరిస్తున్నారు.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫోన్ ను వీలైనంత దూరంలో ఉంచడం మంచిది.. ఇక ఈ మధ్య ఫోన్స్ పేలిపోతున్నాయి ఇది కూడా ఆలోచించండి..
ముఖేష్ అంబానీ చెల్లెలు ఎవరో తెలుసా.. ఆమె వద్ద ఎంత డబ్బు ఉందంటే?
ఆసియా ఖండపు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఆయన, ఆయన ఫ్యామిలీ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తూనే ఉంటారు. అంబానీ సోదరులు అనిల్ అంబానీ, ముఖేష్ గురించి మనందరికీ తెలుసు కానీ వారి ఇద్దరు సోదరీమణులు దీప్తి అంబానీ, నీనా కొఠారి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సోదరీమణులిద్దరూ ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. అంబానీ తోబుట్టువులలో దీప్తి సల్గావ్కర్ చిన్నది. ఆమె 23 జనవరి 1962న భారతీయ వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ దంపతులకు జన్మించారు. దీప్తి సల్గావ్కర్ వీఎం సల్గావ్కర్ కాలేజ్ ఆఫ్ లాలో లా చదివారు. ఆమె గోవాకు చెందిన వ్యాపారవేత్త దత్తరాజ్ సల్గావ్కర్‌ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 1983లో వివాహం చేసుకొని సల్గావ్‌కర్ కుటుంబానికి చెందిన మాన్షన్‌లో స్థిరపడ్డారు. ఇది ప్రేమ వివాహమని దత్తరాజ్ సల్గాంకర్ కొన్నాళ్ల క్రితం డీఎన్‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. దీప్తి సల్గాంకర్ నికర విలువ 2023లో సుమారు 1 బిలియన్ డాలర్ (రూ. 7710 కోట్లు)గా అంచనా వేయబడింది.
తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్న 6 భారత ఆటగాళ్లు.. లిస్టులో హైదరాబాద్ ప్లేయర్! తుది జట్టులో చోటెవరికంటే
సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో తలపడే భారత జట్టును మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే, అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది. ఎంఎస్ ధోనీ నాయత్వంలో 2011 అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈసారి ఆరుగురు ఆటగాళ్లు తొలిసారిగా భారత్ తరపున వన్డే ప్రపంచకప్ ఆడనున్నారు.
సూపర్-4 వేదికల్లో మార్పు లేదు.. సెప్టెంబర్ 10న భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
కొలంబోలో భారీ వర్షాల కారణంగా ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లు, ఫైనల్ వేదికను మార్చే అవకాశం ఉందని జరిగిన చర్చకు తెర పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే.. సూపర్ 4 మ్యాచ్‌లు, ఫైనల్ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి. కొలంబోలో వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. వేదికను మార్చకూడదని మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. భారీ వర్షాల కారణంగా సూపర్ 4, ఫైనల్ మ్యాచ్‌ల్ని కొలంబో నుంచి హంబన్‌టోటాకు తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తక్కువ సమయంలో మారుమూల జిల్లా హంబన్‌టోటాకు తరలివెళ్లడంపై అధికారిక ప్రసారదారు తమ ఇబ్బందుల్ని ఏసీసీ వివరించినట్లు తెలిసింది. సమస్యలను తెలుసుకున్న ఏసీసీ.. కొలంబోనే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో సూపర్ 4 మ్యాచ్‌లు, ఫైనల్ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి. నేడు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు లాహోర్‌లో జరగనుంది. సూపర్–4 దశలో సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో, 12న శ్రీలంకతో, 15న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అందరూ మరోసారి ఎదురుచూస్తున్నారు. దాయాది దేశాల మధ్య సెప్టెంబర్ 2న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.