నేటితో ముగియనున్న సీఎం జగన్ కడప పర్యటన..
ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పర్యటన నేటితో ముగియనుంది.. ఈ నెల 23వ తేదీన కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. నిత్యం వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.. ఇక, ఇవాళ్టితో సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ముగియనుంది.. మూడో రోజు తన పర్యటనలో భాగంగా ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి కాసేపట్లో పులివెందులకు బయలుదేరనున్నారు సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు పులివెందులోని సీఎస్‌ఐ చర్చికి చేరుకుంటారు.. సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో సీఎం వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారు.. దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రార్థనల్లో పాల్గొనబోతోంది వైఎస్ కుటుంబం.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో.. కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ముగిసినట్టు అవుతుంది. కాగా, ఈ మూడు రోజుల పాటు.. శనివారం, ఆదివారం తన సొంత జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.. అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
రైలులో బిర్యానీ తిని ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
రైళ్లలో అస్వస్థతకు గురైన ప్రయాణికులకును హుటాహుటిన రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌కు తరలించారు.. ఎవరికీ ప్రాణాపాయంలేకపోయినప్పటికీ.. తీవ్ర అస్వస్థత ఇబ్బంది పడుతున్నారు. ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో సేలంకు వెళ్తున్న 15 మంది కార్మికులు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో బిర్యానీలు కొనుగులు చేశారట.. అయితే, ఆ బిర్యానీ తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో రైలు మదద్ యాప్‌లో ఫిర్యాదు చేయడం.. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైల్వే సిబ్బంది, పోలీసులు సిద్ధంగా ఉండి.. వారిని రాజమండ్రి జీజీహెచ్‌కి తరలించారు. మరోవైపు, దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని పాలక్కడ్‌కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలులో ఎగ్ బిర్యానీలు కొనుగోలు చేసి ఆరగించారు.. వారికి కూడా అదే పరిస్థితి ఎదురైంది.. వారిలో నలుగురిని రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో దించి ఆస్పత్రికి తరలించారు.. ఇలా మొత్తంగా రైళ్లలో బిర్యానీ తిని ఒకే రోజు 9 మంది ఆస్పత్రిలో చేరారు. ప్రయాణాల్లో ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని కొనుగోలు చేసి.. లేని జబ్బులు తెచ్చుకోవద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
దంతెవాడ-సుక్మా సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని తుమ్కాపాల్, డబ్బా కున్నా గ్రామాల మధ్య అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నక్సల్స్ సంబంధిత సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బకున్న గ్రామ సమీపంలోని కొండ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి మీడియాకు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సమయంలో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం ఆ ప్రాంతంలో ఉందని ఆయన చెప్పారు. ఆ సమయంలో నక్సలైట్‌తో ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్ర పోలీసు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), బస్తర్ ఫైటర్స్‌లోని రెండు విభాగాల సిబ్బంది ఆపరేషన్‌ను ప్రారంభించారని సుందర్‌రాజ్ పి చెప్పారు. ఈ ఆపరేషన్ దంతెవాడ-సుక్మా అంతర్ జిల్లా సరిహద్దులోని తుమ్‌క్‌పాల్ పోలీస్ క్యాంపు నుంచి దబ్బకున్న వైపు సాగుతోంది.
మంచు తుఫాను, -40 డిగ్రీల ఉష్ణోగ్రత.. 72 ఏళ్ల తర్వాత తొలిసారి
భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో ఇది కఠినమైన శీతాకాలం. పర్వతాలలో హిమపాతం కొనసాగుతుంది మరియు మైదానాలలో చలిగాలులు కొనసాగుతాయి. మరోవైపు చైనాలోనూ శీతాకాలం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -40 డిగ్రీలకు పడిపోయింది. ప్రస్తుతం రాజధాని బీజింగ్ నగరంలో ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. 9 రోజులుగా మంచు తుపాను కొనసాగుతోంది. 1951 నుండి బీజింగ్‌లో నమోదైన అతి పొడవైన చలిగాలి ఇదే. దీంతో పనులు కూడా నిలిచిపోయాయి. ఆసుపత్రులు, అత్యవసర సేవలు మినహా ఇతర పనులు మూసివేయబడ్డాయి. మంచు తుపాను కారణంగా రెండు మెట్రోలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చాలా మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. బీజింగ్‌లోని నంజియావో వాతావరణ కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రత ఆదివారం మధ్యాహ్నం మొదటిసారిగా సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని రాష్ట్ర మీడియా బీజింగ్ డైలీ నివేదించింది. అయితే ప్రస్తుతం రాజధానిలో -10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబర్ 11న మొదటిసారి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే పడిపోయింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. 300 గంటలకు పైగా చలిగాలులు కొనసాగుతున్నాయి. ఈ నెల, బీజింగ్‌లోనే కాకుండా చైనాలోని చాలా ప్రాంతాల్లో చలిగాలుల వ్యాప్తి కనిపిస్తోంది. దీంతో పనులపై కూడా ప్రభావం పడింది. ఆసుపత్రులు, అత్యవసర సేవలతో పాటు ఇతర వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. రాజధాని బీజింగ్‌లో శీతాకాలం కారణంగా మెట్రో సేవలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. మంచు తుఫాను సమయంలో బిజీ సబ్‌వే లైన్‌లో రెండు రైళ్లు ఢీకొనడంతో వందలాది మంది ప్రయాణికులు బీజింగ్‌లో ఆసుపత్రి పాలైనట్లు నగర రవాణా అధికారి తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
ఆదివారం వాయువ్య పాకిస్థాన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె ఎనిమిది మంది పిల్లలు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అబోటాబాద్ జిల్లా తహరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె నలుగురు కూతుళ్లు, ఎనిమిది మంది చిన్నారులు మరణించారని తెలిపారు. కూలిన భవనం శిథిలాల నుంచి స్థానికులు తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారని తెలిపారు. మృతుల వయస్సు తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మూడు అంబులెన్స్‌లు, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు రెస్క్యూ అధికారులు శాయశక్తులా కృషి చేశారు. ఇదిలా ఉండగా, ఖైబర్ ఫక్తున్‌ఖ్వా తాత్కాలిక ముఖ్యమంత్రి అర్షద్ హుస్సేన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద సంఘటనకు కారణాన్ని అన్వేషించడానికి.. ప్రాంతంలోని ఇతర నివాసితుల భద్రతను నిర్ధారించడానికి అధికారులు కూడా కృషి చేస్తున్నారు. జూలైలో లాహోర్‌లోని భాటి గేట్ ప్రాంతంలోని ఒక ఇంటిలో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలడంతో ఒక శిశువు, ఒక మహిళతో సహా ఒక కుటుంబంలోని 10 మంది సభ్యులు ఘోరమైన అగ్నిప్రమాదంలో మరణించారని జియో న్యూస్ నివేదిక తెలిపింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఓ వ్యక్తి, అతని భార్య, మరో ఇద్దరు మహిళలు, ఐదుగురు పిల్లలు, ఏడు నెలల పాప ఉన్నారు. కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే భవనంపై నుండి దూకి ఘోరమైన మంటలను తప్పించుకోగలిగాడు. రిఫ్రిజిరేటర్ కంప్రెసర్‌లో పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు రెస్క్యూ అధికారులు నిర్ధారించారు. పొగ బయటకు వెళ్లేందుకు ఇంట్లో వెంటిలేషన్ లేదన్నారు.
1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన పేటీఎం
ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం మరోసారి వార్తల్లో నిలిచింది. పేటీఎం మరోసారి తమ ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. Paytm ఈ రిట్రెంచ్‌మెంట్‌లో మొత్తం ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించాలని భావిస్తోంది. Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ ఈసారి 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. గత కొన్ని నెలల్లో ఈ తొలగింపులు జరిగాయని.. Paytm వివిధ యూనిట్ల ఉద్యోగులు బాధితులుగా ఉన్నారని సంబంధిత సమాచారం పేర్కొంది. Paytm తన ఖర్చులను తగ్గించుకోవడానికి, దాని వివిధ వ్యాపారాలను పునర్వ్యవస్థీకరించడానికి ఈ తొలగింపును చేసిందని చెప్పబడింది. Paytm ఈ తొలగింపులో దాని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం మంది ప్రభావితమయ్యారు. భారతీయ స్టార్టప్‌లోనూ ఇది అతిపెద్ద తొలగింపులలో ఒకటిగా పరిగణించబడుతుంది. స్టార్టప్ కంపెనీలకు 2023వ సంవత్సరం కలిసిరాలేదు. ఈ సంవత్సరం భారతీయ స్టార్టప్‌లు మొదటి మూడు త్రైమాసికాల్లో 28 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు 2022 సంవత్సరంలో స్టార్టప్ కంపెనీలు 20 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, 2021లో 4 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఫిన్‌టెక్ రంగాన్ని పరిశీలిస్తే ఈ నెలాఖరులోగా జెస్ట్‌మనీ మూసివేయబోతోంది.
ఓటీటీలోకి రాబోతున్న ‘ Hi Nanna’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటిలోకి కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా ఓటిటి రైట్స్ ని Netflix సొంతం చేసుకుంది. అలాగే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం “హాయ్ నాన్న” జనవరి 12 అంటే సంక్రాంతికి ఈ ను ఓటీటీలోకి వదిలే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి పెద్ద లు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేయనున్నాయి. అలాగే నాని హాయ్ నాన్న కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యి సందడి చేసే ఛాన్స్ ఉందని టాక్. చూడాలి మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది.. అలాగే తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం నిజంగా షాకింగ్ న్యూసే.. గతంలో వచ్చిన వాటికంటే ఇది ఎక్కువే..
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏం ఇప్పుడు చేస్తున్నాడో తెలుసా?
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులతో, మెయింట్ గేట్ నుంచి బయటకు రావడమే దీనంతటికి కారణమైందని పోలీసులు భావించారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ప్రశాంత్ పై ఏడు కేసులు నమోదు అయ్యాయి.. దాంతో పల్లవి ప్రశాంత్ అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. బెయిల్ రాకుండా చేశారు. ఏకంగా జైలుకి కూడా పంపించారు. కానీ ఎట్టకేలకు ప్రశాంత్‌కి బెయిల్ వచ్చింది. జైలు నుంచి వచ్చిన ప్రశాంత్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు.. కాగా ఇటీవల భోలే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఇచ్చిన చిన్న పార్టీకి పల్లవి ప్రశాంత్ హాజరయ్యాడు.. బిగ్ బాస్ కంటెస్టెంట్లకి ఆయన చిన్న గెట్ టూ గెదర్ పార్టీ నిర్వహించారు. ఇందులో శివాజీ, ప్రశాంత్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు మరికొందరు కంటెస్టెంట్లు ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రశాంత్ మాత్రం ఇకపై మీడియా ముందుకు రాదలుచుకోలేదట. మీడియాకి, పబ్లిక్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నాడట.. ఇక బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల ఎటువంటి వాటిని ఇక చేయబోనని చెప్పిన సంగతి తెలిసిందే.. ఎవరిని కలవను కూడా కలవనని చెప్పాడు.. ఎలాంటి వివాదాలు లేకపోయి ఉంటే, బిగ్ బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ హంగామా వేరే ఉండేది. ఆయనకు సినిమా ఆఫర్లు, ఇతర కమర్షియల్ ఆఫర్లు వచ్చేవి. ఫుల్ బిజీగా ఉండేవాడు. వరుస ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగిపోయేది.. కానీ షో విన్నర్ అవ్వడం అతనికి శాపంగా మారింది..ఇక ముందు అతడు పొలం పనులకే పరిమితం అవుతాడని తెలుస్తుంది..
ఫ్యామిలితో ఫారిన్ కు వెళ్లనున్న మహేష్ బాబు?
టాలివుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘గుంటూరు కారం’.. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తుంది.. మరో హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది.. ఈ సినిమాలో మాస్ సాంగ్ ఇదే.. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే.. ఇక సినిమాలోని కొన్ని చిన్న చిన్న ఫ్యాచ్ వర్క్ లను కూడా ఈ నెల ఆఖరిలో పూర్తి చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ వెకేషన్‌కు వెళతారట మహేశ్‌బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారు.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..