హైదరాబాద్ లో యువతి దారుణ హత్య..
ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపా పేట లోని రాజీ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ హత్య మిస్టరీగా మారింది. వివరాలలోకి వెళ్తే.. చంపా పేట రాజిరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో స్వప్న(24) అనే యువతి, హనుమంతు(25) అనే యువకుడు కలిసి ఉంటున్నారు. కాగా వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి రోజు గుర్తు తెలియని వ్యక్తులు వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కూడా యువతి యువకుడిని పలు మార్లు హెచ్చరించాడు. అయిన గుర్తు తెలియని వ్యక్తులు వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఇంటి యజమాని బయటకు వచ్చి చూసాడు. హనుమంతు రెండొవ అంతస్తు నుండి కింద పడి ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్వప్న, హనుమంతు నివసిస్తున్న ఇంటి నుండి కంగారుగా బయటకు వచ్చి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా..?
విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అధికారం కొంత మంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థ రహితం అంటూ ఆయన మండిపడ్డారు. బీసీ మంత్రులమైన మాకు వ్యక్తిత్వం లేదా? ఆత్మాభిమానం లేదని ప్రతిపక్షాలు చెప్పదలచుకున్నాయా?.. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా, ఆత్మాభిమానంతో మంత్రులుగా మా విధులను నిర్వర్తిస్తూ ఉన్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వేసుకున్న ముసుగులు తీసి వేసి చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు.. కేరళలో వివాదాస్పద ఘటన..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
శుక్రవారం మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూమెంట్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించింది. సాలిడారిటీ యూవ్ మూమెంట్ అనేది జమాతే ఇస్లామీ యూత్ వింగ్. అయితే ఈ ర్యాలీలో హమాస్ నాయకుడు ఒకరు ప్రజలను ఉద్దేశిస్తూ వర్చువల్ గా మాట్లాడటంపై వివాదం చెలరేగింది. ఈ ఘటనను రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఖండించారు. కేరళ పోలీసులు తీరును ఆయన ప్రశ్నించారు. ఇలా హమాస్ ఉగ్రవాద నాయకుడు ఈ ర్యాలీలో మాట్లాడటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..
కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని.. ప్రజలు నన్ను గెలిపియ్యడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వినికి టికెట్లు ఇచ్చారని.. నాకు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మీటింగ్స్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని జంగా పేర్కొన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి ఒక బ్రోకర్.. అసమర్థుడు అంటూ విమర్శలు గుప్పించారు. కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. ఏ సర్వే ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా నాయకులు సిద్ధంగా లేరన్నారు. తనపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. స్వలాభం కోసం పార్టీని నాశనం చేయొద్దన్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు.. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావును కామారెడ్డి రైతు జేఏసీ బృందం కలిసింది. ఈ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్… ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు.
9ఏళ్ల రాక్షస పాలన అంతానికి సమయం ఆసన్నమైంది
తొమ్మిదిన్నర సంవత్సరాల రాక్షస పాలనకు అంతం కావడానికి సమయం ఆసన్నమైందని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ అన్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించిన సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్ చౌరస్తాలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన సుధీర్ రెడ్డినీ ఓడించడమే తమ లక్ష్యం అన్నారు. సుధీర్ రెడ్డి నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అధికార దాహంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, ప్రజలు దీనినీ గమనిస్తున్నారని ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఎల్బీనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని తెలియజేశారు. టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందర్నీ కలుపుకొని ముందుకు పోతానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది
వైసీపీ నాలుగున్నరేళ్ళ పాలనలో చేపట్టిన సామాజిక సాధికారత గురించి ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ యాత్ర అని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. 175 నియోజక వర్గాల్లో ఈ యాత్ర జరుగుతుంది.. వైసీపీ పెత్తందార్ల పార్టీ కాదు ప్రజల పార్టీ అంటూ ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి హయాంలో సామాన్య ప్రజలకు చేసింది ఏం లేదు అని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడు.. ఆయన్ని ప్రజలు పట్టించుకోవటం లేదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
“వెంటనే ఆ పిచ్చిని ఆపేయండి”.. ఇజ్రాయిల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు.
టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని ఎర్డోగాన్ ఎక్స్(ట్విట్టర్)లో వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ వెంటనే ఈ ‘మ్యాడ్ నెస్’ని ఆపేయాలని, దాడులను ముగించాలని కోరారు. ఎర్డోగాన్ శనివారం ఇస్తాంబుల్ లో పాలస్తీనాకు మద్దతుగా తన పార్టీ ఇస్లామో-కన్సర్వేటివ్ ఏకేపీ పార్టీ నిర్వహించనున్న ర్యాలీని ప్రోత్సహించాడు. ఈ ర్యాలీకి దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటాని ఎర్డోగాన్ ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై చిరుమర్తి తీవ్ర ఆరోపణలు
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటాల తూటాలు అధికమవుతున్నాయి. తాగా నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. అటవీ సంపద దోచుకొని, వ్యాపారులను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, కిరాయి మర్డర్లు చేసి సంపాదించిన డబ్బు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన డబ్బు నియోజకవర్గంలో పంచుతూ వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని.. పేదల పొట్ట కొట్టి సంపాదించిన డబ్బు తిరిగి పేదల వద్దకు వెళుతుందని చిరుమర్తి అన్నారు.
ఓటర్ల జాబితాపై వైసీపీ కీలక కసరత్తు.. ఈ నెల 31న వర్క్ షాప్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ముసాయిదా ఒటర్ల జాబితాను ఆయన నిన్న (శుక్రవారం) విడుదల చేశారు. అయితే, ముసాయిదా ఓటర్లు జాబితా విడుదల నేపథ్యంలో ఓటర్ల జాబితాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఓటర్ల జాబితా అంశాలపై ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక ఇంఛార్జ్ నియామకం చేసేందుకు యోచిస్తుంది.
అయితే, ఈ నెల 31వ తేదీన వైసీపీ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. 175 నియోజక వర్గాల నుంచి పార్టీ ఇన్ చార్జ్ లు హాజరుకానున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వర్క్ షాపు జరుగనుంది. పార్టీ సెంట్రల్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇక, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఫోకస్ గా ఈ వ్యవస్థ పని చేయనుంది. డిసెంబర్ 9వ తేదీ వరకు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది.
నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు
నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు అని ధీమా వ్యక్తి చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాయకులకు కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందని, నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు అన్నారు. భువనగిరిలో 40 ఏళ్ల చరిత్ర తిరగరాయాలన్నారు. ఎంత కష్టపడాలన్న 33 రోజులు మాత్రమే ఉందని, పోలింగ్ వరకు ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు ఓటు వేయ్యండి తర్వాత ఐదేళ్లు మీ కోసం మేమం కష్టపడతామని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాకు 27 ఏళ్ల అనుభవంతో చెబుతున్న కాంగ్రెస్ గెలుపు మీ బాధ్యత అని, అనిల్ రెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నానన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ ఇచ్చిందని ఆనాడు కాళ్లు మొక్కిన కేసీఆర్ ఈనాడు కాంగ్రెస్ గ్యారెంటీ లేని పార్టీ అంటున్నాడని, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నానని ఆయన వెల్లడించారు.
మంత్రి బుగ్గనకు టీడీపీ నేత యనమల లేఖ
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు. మండలి ప్రతిపక్ష నేతగా తానడిగిన వివరాలు ఇవ్వాలని బుగ్గనను యనమల కోరారు. 2021-22 ఏడాదికి కాగ్ ఇచ్చిన నివేదికని లేఖలో ఆయన ప్రస్తావించారు. 67 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ సంస్థకు లెక్కలివ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?
వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మద్దూరుపాడు జంక్షన్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ పై చేసిన దాడి చూస్తే వైసీపీ అరాచకం ఏ విధంగా పెచ్చరిల్లుతోందో అర్థం అవుతోంది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.