ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం!
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఘటన అందరినీ ఆకట్టుకుంది. భాగ్యనగరంలో బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండిసంజయ్‌కుమార్, గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ లక్ష్మణ్, రచయిత అందెశ్రీ, బీఆర్‌ఎస్ నేత బోయిన్ పల్లి వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్‌ను రిసీవ్ చేసుకున్నా..
తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు అయిదుగురు ముఖ్యమంత్రులు నా కోసం వేయిట్ చేశారని.. కానీ మా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత అని విద్యాసాగర్‌రావు అన్నారు. తాను రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “సాంస్కృతిక జాతీయ వాదం అందరిలో ఉంది.. పార్టీలు వేరు కావొచ్చు. ఎల్లంపల్లికి శ్రీపాద రావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ. వాజపేయిని ప్రధాన మంత్రి అవుతావని నెహ్రూ అన్నారు. సాంస్కృతిక జాతీయ వాదం ఉంది. ఐక్య రాజ్య సమితిలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత అయిన వాజ్ పేయిని పీవీ పంపించారు. పాలక పక్షానికి, ప్రతి పక్షానికి పెద్దగా డిఫరెన్స్ లేదు.. అంబేడ్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న భారత జాతిని వదిలిపెట్టలేదు..” అని మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు.
35 ఏళ్ల విద్యార్థి, రాజకీయ జీవితంలో వీళ్లతోనే కలిసి పని చేశా..
నా 35 సంవత్సరాల విద్యార్థి, రాజకీయ జీవితంలో వివిధ దశల్లో కలిసి పనిచేసిన వారు ఈ వేదిక మీద ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “విద్యాసాగర్ రావును అందరూ సాగర్ జీ గానే గుర్తిస్తారు. మాకు కూడా ఆయన సాగర్ జీ నే. వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి విద్యాసాగర్ రావు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారు. ఈ రోజు యూనివర్సిటీలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వర్సిటీల్లో బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని ఆదేశించాను. మళ్ళీ వర్సిటీలకి పూర్వ వైభవం తేవాలి అని చెప్పాను. విద్యార్థుల పోరాటం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకం అయింది. పార్టీ ఫిరాయింపుల మీద నేను మాట్లాడితే బాగుండదేమో.. కానీ ఈ రోజు ప్రజా జీవితంలో ఉండే వారు యే పార్టీలో ఉన్నామని కాకుండా పదవుల్లో ఉండాలని అనుకుంటున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి రాకపోవడమే కారణం.. విద్యార్థి రాజకీయాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..” అని సీఎం వ్యాఖ్యానించారు.
రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?
ప్రపంచంలోని ప్రతి దేశంలో డ్రగ్స్ వాడకం ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. ఇక అత్యంత ఎక్కువ జనాభ ఉన్న దేశాలలో భారత్ ఒకటి. దింతో భారత్ లో ప్రమాదకరమైన డ్రగ్స్ ను అమ్మెందుకు డ్రగ్స్ డీలర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ ను nనివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇకపోతే తాజాగా అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురంలో పోలీసులు రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ని కొలిమిలో తగులబెట్టారు. అయితే ఇలా డ్రగ్స్ ని కొలిమిలో కాల్చడానికి గల కారణాన్ని తెలుపుతూ.. ఈ డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో కాల్చలేమని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల సరుకు దేశంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల మొత్తంగా ఉంది. ఈ చర్యకు డీజీపీ ధాలివాల్ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ ను నాశనం చేయడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన పేర్కొన్నారు.
కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు.. బరులు సిద్ధం
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పందేలు కాయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నిర్వాహకులు.. ఒకపక్క పోలీసుల అంచులు కొనసాగుతున్న నిర్వాహకులు పందెంబరులను అందంగా ముస్తాబు చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈసారి పందాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. పందాల పరిల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చే వారికోసం టెంట్లు షామియానాలు ఒకపక్క, కోడిపుంజులకు అవసరమైన ఏర్పాట్లు మరోపక్క చేస్తున్నారు నిర్వాహకులు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి
ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు CPM తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభలు జరుగనున్నాయి. జనవరి 25వ తేదీన సంగారెడ్డి PCR గ్రౌండ్ లో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. మహా సభలు బహిరంగ సభ పోస్టర్‌ను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రేవంత్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చుతుందని, నిర్బంధంలో రాష్ట్రంలో ఉంది…ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏడో వాగ్దానం స్వేచ్ఛ ఇప్పుడు అమలు కావడం లేదన్నా తమ్మినేని వీరభద్రం. మహా సభల్లో రేవంత్ సర్కార్ నిర్ణయాల పై చర్చ జరుపుతామని, జనవరి 26 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పిందన్నారు తమ్మినేని వీరభద్రం. అంతేకాకుండా.. రైతు భరోసా తో ప్రభుత్వం చెప్పిన హామీలు చేస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని, స్తానిక సంస్థల ఎన్నికల కోసం – ఎన్నికల లబ్దికోసమే కాకూడదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక గ్రామ సభలోనే జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హత కోసం రేషన్ కార్డు, జాబ్ కార్డు పెట్టకూడదని, జాబ్ కార్డులు, రేషన్ కార్డులు లేని వాళ్ళు లక్షల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు పథకాలు తప్ప హామీలు అమలు చేయలేదని ఆయన అన్నారు. పట్టణాల్లో ఉపాధి హామీ అమలు చేయాలని కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేమని, మేము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదన్నారు. మేము మిత్రపక్షం అయితే మంత్రి పదవులు తీసుకునే వాళ్ళమని, రాష్ట్ర ప్రభుత్వం పై త్వరలో పోరాటాలు మొదలు పెడతామన్నారు తమ్మినేని వీరభద్రం.
భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయింపు చేసింది ప్రభుత్వం. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరించినట్లు జీవోలో తెలిపింది. ఇకపై అన్ని రకాల భవనాలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు జారీ చేస్తాయి. నగర పంచాయతీల్లో మూడెకరాలు దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరి.. గ్రామ పంచాయతీలు 300 చ.మీ, 10 మీటర్ల ఎత్తు వరకూ అనుమతులు మంజూరు చేస్తాయి. అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయింపు జరిగింది.
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజర్యారు. సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని, పాలమూరు జిల్లాకు త్రాగు, సాగు నీరు అందించడానికి కృష్ణా నదిలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ఎంత ఖర్చు చేయడానికి అయినా ప్రజా ప్రభుత్వం వెనుకాడదన్నారు భట్టి విక్రమార్క. రూ. 38వేల కోట్ల తో మొదలుపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గాలికి వదిలేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ ఐదు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. దానిపై చర్చకు సిద్ధమా..!
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట్ట ముంచిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ముంచింది కాక సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన నేను బహిరంగ చర్చకు సిద్ధమని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు రైతులకు అమాలయ్యాయా..? అని ఆయన వ్యాఖ్యానించారు. 15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి 12 వేలు ఇస్తున్నారని, వానాకాలం గుండు సున్నా ఇచ్చి యాసంగిలో కోతలు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో వస్తే 15 వేల హామీ ఏమైంది అని నిలదీయండని, మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకే పంటకు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ ఏమైందో రేవంత్ కే తెలియాలన్నారు. వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామన్న సీఎం రేవంత్ ఇప్పుడు కేవలం 10 లక్షల మందికే ఇస్తాం అంటున్నారని, మన రాష్ట్రంలో ఒక కోటి 2 లక్షల మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికి ఇస్తే ఇదేం నీతి..? అని ఆయన ప్రశ్నించారు.
పీ-4 విధానంపై దృష్టి పెట్టాలి.. అట్టడుగున ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడాలి
దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్) విధానంపై దృష్టి పెట్టాలని తెలిపారు. గతంలో పీ3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ఉండేది.. ఇప్పుడు పీపుల్ పార్టనర్‌షిప్ కుడా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చాలామంది గ్లోబల్ సిటిజన్లుగా వెళ్లి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు.. సమాజంలో అట్టడుగున ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి కోరారు. అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికి కొన్ని లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.. సంక్రాంతికి ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో పేదరికాన్ని పోగొట్టాలని తెలిపారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద రాష్ట్రం కోసం సంకల్పం తీసుకుందామని కోరుతూ పీ4 విధాన పత్రాన్ని విడుదల చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.