ఆ సంస్కృతి మా పార్టీలో లేదు.. కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మా బిజెపిలో ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించే సంస్కృతి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఈ ఎన్నికలలొ ప్రభుత్వం ఎర్పాటు చెయబోతుందన్నారు. బిసి ని ముఖ్యమంత్రి ని చేస్తామని ప్రకటించామన్నారు. బిసి, ఎస్సి, అగ్ర వర్ణాల పేదలు బిజేపి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ఈనెల 7 రొజున బిసి అత్మీయ గౌరవ సభ నిర్వహిస్తాం…ప్రదాని మోడి హాజరు అవుతారన్నారు. స్వచ్ఛందంగా అందరూ తరలిరావాలన్నారు.
మోడి ప్రదాని అయిన తరువాత బిసిలకి న్యాయం జరుగుతుందన్నారు. 27 మంది బిసిలని మంత్రులని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ది అన్నారు. బిసిని ప్రదానిని చేసిన ఘనత బిజేపి ది అని తెలిపారు. 23 సీట్లు మాత్రమే బిఆర్ఎస్ బిసిలకి ఇచ్చిందన్నారు. బిసిలకి టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టి అవమాన పరిచిందన్నారు. రేపు కరీంనగర్ అసెంబ్లీ బిజేపి అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. బిసి నినాదం బిఅర్ఎస్ ఎందుకు పక్కకు పెట్టారని తెలిపారు. బిసిలకి బిఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్షమాపణ చెప్పాలన్నారు. బిసిలకి ముఖ్యమంత్రి ఇవ్వాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించాలన్నారు. వాస్తవ నివేదికలు ఇస్తే ప్రభుత్వం తట్టుకోవడం లేదన్నారు. తాంత్రిక పూజలు చేయడానికి టైం ఉంటది, కాని కాళేశ్వరం ని సందర్శించడానికి సమయం లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఇరిగేషన్ పై ఖర్చుపెట్టిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్టులో 25 వేల కోట్లు గల్లంతయ్యాయి, మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పనికిరాకుండా పోయాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు గ్రామస్తుల దగ్గర తక్కువ డబ్బులకే భూములు గుంజుకున్నారు, వారికి న్యాయం జరగకుండానే రాత్రిపూట కొట్టి బుల్డోజర్లతో కూల్చి గ్రామాన్ని ఖాళీ చేయించారు అయిన ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..
బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి. ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలువబడే బాబా వంగా గతంలో అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, బ్రెగ్జిట్ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారు.
టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేసింది..
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులకు సంబంధించి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ లో ఈసారి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము.. శాస్త్రవేత్తలు చర్చించి ఏఏ పంటలు వేయాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాధారణ వర్ష పాఠం..574.7 మిల్లీ మీటర్లు ఉండగా 487.2 15 మిల్లీ మీటర్లు నమోదైంది.. 15 శాతం వర్షం తగ్గింది.. ప్రత్యామ్నాయ పంటల కోసం.. రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగనే
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీయే గెలిచేది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. జిల్లాలో పార్లమెంట్ గానీ.. అసెంబ్లీ గానీ ఆయన ఎవరు అభ్యర్ధి అంటే వారినే మనం కలిసి కట్టుగా పని చేసి గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి కట్టుగా వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి అని ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డినే అని ధర్మాన కృష్ణ దాస్ చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.. ఆయన ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేదు అని మాజీ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు జిల్లాలో అభివృద్ధినీ నిర్లక్ష్యం చేశాయి.. కానీ, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు అభివృద్ధి ఊపందకుంటున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ వెల్లడించారు
మహిళా రిజర్వేషన్ తక్షణ అమలు కోసం ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కె.కవిత న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న పిటిషన్‌ను ఇంప్లీడ్ చేసే ప్రయత్నంలో భారత్ జాగృతి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కవిత తన నిబద్ధతను పునరుద్ఘాటించారు, తాము గతంలో మహిళా రిజర్వేషన్ కోసం వాదించామని, దానిని వేగంగా అమలు చేయడానికి మరో పోరాటానికి సిద్ధమయ్యామని ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు ఉద్యమిస్తున్నాయని ఆమె సూచించారు.
ప్రజల అంకాక్ష నేరవేరాలంటే మంచి నాయకుడికి ఓటు వేయాలి
భద్రాద్రి కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ వచ్చింది అంటే అగమ్ అగమ్ హాడవుడి చేస్తున్నారని, మోసపూరితమైన వాగ్దనాలు చేయ్యటంతో దేశం అగం అవుతుందన్నారు. ప్రజల చేతిలో ఒకే ఒక వజ్రాయుధం ఓటు.. ఓటును అగం చేయకుండా ఎన్నుకోవాలి… అప్పుడే ప్రజలు గెలుస్తారన్నారు. ప్రజల అంకాక్ష నేరవేరాలంటే మంచి నాయకుడికి ఓటు వేయాలని, పార్టీల వైఖరి, చరిత్ర చూడాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందని, కాంగ్రెస్ వాళ్ళు చేతకాని దద్దములు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పారిపలనలో సింగరేణి నడపలేక ఇబ్బందులు పడ్డారు.. తెలంగాణ వచ్చాక ఇప్పుడు లాభల బాట నడుస్తుంది. వడ్డిలేని రుణం కూడా ఇస్తున్నం…. 50 యేళ్ళు కాంగ్రెస్ వెనుక ఉన్నారు…10 సంవత్సరాలే మేము అధికారంలో ఉన్నం ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలి మీరు… తెలంగాణ రాకముందు కరెంట్ కోతలు కరెంట్ ఉత్పత్తి అయిన కొత్తగూడెంలోనే కరెంట్ ఉండేది…కాదు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కరెంట్ కోతలు లేవు,వాటార్ సమస్యలు లేవు. డయాలిసిస్ పెషెంట్లకు కూడా పెన్ క్షన్ ఇస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌దే. మీ కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి ని చూడండి… సీతారామ ప్రాజెక్టు 70% పూర్తి అయింది.
పురంధేశ్వరి టీడీపీకి గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తోంది..
విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కనకదుర్గనగర్ లో మూడు ఇండోర్ సబ్ స్టేషనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. 20 కోట్ల రూపాయలతో మూడు ఇండోర్ సబ్ స్టేషన్లను ప్రభుత్వం నిర్మించింది. 8 సబ్ స్టేషన్లకు లోడ్ రిలీఫ్ ఉంటుంది.. స్ధానిక ప్రజలకు కొండ చివరి వరకూ విద్యుత్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం సహజం.. పురంధేశ్వరి టీడీపీకి గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తోంది.. దానిని అందరూ గర్హిస్తున్నారు.. ఈ రాష్ట్రంలో డీస్టీలరీలు అన్నీ చంద్రబాబు మంజూరు చేశారు.. చంద్రబాబుతోనే మద్యం గురించి ఆవిడ మాట్లాడాలి అని ఆయన మండిపడ్డారు. మా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆమెను వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు.. చంద్రబాబు ఆమె తరఫున మాట్లాడితే మాకు ఇబ్బంది లేదు.. వాస్తవాలు తెలుసుకుని పురంధేశ్వరి మాట్లాడాలి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి కొనసాగుతుంది..
గత కొన్ని రోజులుగా వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భగా ఎంపీ విజయ సాయిరెడ్డి పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి అని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం అని మండిపడ్డారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని.. ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసే సరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
విలువలు లేని తమకే ఇది సాధ్యం.. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్..!
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోపక్క ఏపీలోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. రోజుకో మాట, పూటకో వేషం వేసే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబుతో జోడి కట్టిన పవన్.. తెలంగాణలో మాత్రం బీజేపీ పార్టీతో కలిసి నడిచేందుకు రెడీ అయ్యాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ (ఎక్స్ )లో పోస్ట్ చేశారు.
‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఉన్న ఫోటో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోలను మంత్రి ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పవన్ కు ఏదైనా సాధ్యమే.. విలువలు లేని రాజకీయాలు చేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు అంటూ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.