ఆప్ రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ ఉమెన్ ప్యానెల్ చీఫ్ నామినేట్..
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్‌గా ఉన్న స్వాతిమలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మలివాల్ పేరు ప్రస్తావనకు వచ్చింది. గతంలో ఢిల్లీలో మహిళల పట్ల జరిగిన దాడులతో పాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు సంఘటనలపై కీలక వ్యాఖ్యలు చేసి స్వాతిమలివాల్ వార్తల్లో నిలిచారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉన్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ని మరోసారి ఆప్ రాజ్యసభకు నామినేట్ చేస్తుంది.
నోరు అదుపులో పెట్టుకోండి.. రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయి..
రానున్న రోజుల్లో నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణాలో మహిళలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 28 రోజుల్లో ప్రజలకు అందించిన సేవలను ప్రజలు నమ్మారన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు, అమరుల కుటుంబాలకు ఏం న్యాయం చేసిందన్నారు. రానున్న టీఎస్ ప్రక్షాళన కోసం కేంద్రంలో యూపీఎస్సి మా ప్రభుత్వం చేపడుతున్న చర్చలు చేస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు కళ్ళు కనిపించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం 28 రోజుల ప్రగతి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పై శాఖల వారీగా మా ప్రభుత్వం సమీక్షలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చందుకు ఇంకా సమయం ఉండగా 31 మత్తు దిగనట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. గతంలో 70 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేసిన మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని ప్రశ్నించారు.
2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయి..
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సదస్సుపై కౌంటర్ ఇచ్చిన ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరు..? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ.. బీసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా..? అని నిలదీశారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు.. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని పేర్కొన్నాడు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
టిల్లు ను వెంటాడుతున్న వాయిదా కష్టాలు..
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 పైనే ఉంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2022 ఆగస్టు చిత్రీకరణ షురూ చేసుకున్న ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 2023నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కానీ ఈ సినిమా విడుదల విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. పలు కారణాలతో విడుదల తేదీ మార్చి 2023 నుంచి ఏకంగా నవంబర్ 2023కి మారిపోయింది. ఈ నెలలోనైనా థియేటర్లలో టిల్లు సందడి ఉంటుందని అంతా అనుకుంటే.. మళ్లీ ఆ తేదీ కాస్తా 2024 ఫిబ్రవరి 9కి మారిపోయింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడింది.. దీనికి కారణం రవితేజ నటిస్తోన్న ఈగల్ సినిమానే. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈగల్‌ను జనవరి 13న విడుదల చేయాల్సింది.కానీ సంక్రాంతికి వరుస సినిమాలున్న నేపథ్యంలో ఆదాయంపై ప్రభావం పడకూదనే ఉద్దేశంతో నిర్మాతలు ఈగల్ సినిమాను టిల్లు స్క్వేర్ డేట్‌కు మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే.. వీహెచ్ ఏమన్నారంటే.. !
సోనియాగాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాలపై పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని, భారత్ కూటమిని గెలిపిస్తామని వీహెచ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలకు పనిలేక 420 బుక్ లెట్ తో కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపెంచారని స్పష్టం చేశారు. పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నిరవేర్చారో ప్రజలకు చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవరుస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు ముడు ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగ హామీలు నెరవేర్చలేకపోయారన్నారు.
సత్తా చాటిన ఐఐటీ బాంబే విద్యార్ధులు.. 85 మందికి కోటికి పైగా వేతనం..
దేశంలో ఐఐటీ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఐఐటీలో చదివిన విద్యార్థులకు దేశంలోనే కాదు ప్రపంచస్థాయిలో తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులను తమ ఉద్యోగంలో చేర్చుకోవాలని మల్టీ నేషనల్ కంపెనీలు ఉవ్విళ్లూరుతుంటాయి. తాజాగా మరోసారి ఐఐటీ సత్తా నిరూపితమైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే(IIT Bambay) విద్యార్థులను జాక్‌పాట్ వరించింది. 85 మంది విద్యార్థులు రూ. కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. 2023-24 నియామకాల్లో సీజన్ ఫేజ్-1లో భాగంగా ఈ సాలరీ ప్యాకేజీని అందుకోనున్నారు.
మూడో లిస్ట్‌పై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికే కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫస్ట్, సెకండ్ లిస్టులను పార్టీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్‌పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్టియు) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డాక్టర్ శ్రీధర పణికర్ సోమనాథ్‌కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (హానోరిస్ కాసా) డిగ్రీని ప్రదానం చేసింది. శుక్రవారం జరిగిన వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా జేఎన్టీయూ-హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి నుంచి డాక్టర్ సోమనాథ్ గౌరవ జేఎన్టీయూ హైదరాబాద్ డాక్టరేట్‌ను అందుకున్నారు.
రూ.15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్ కేసు పెట్టిన ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు దివాకర్ 2017లో ఎంఎస్డీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
అయితే అగ్రిమెంట్లో పేర్కొన్న నిబంధనలను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము, షేర్ లాభాలను చెల్లించవలసి ఉంది. కానీ, మిహిర్ దివాకర్, సౌమ్య బిస్వాస్ ఆ షరతును నెరవేర్చలేకపోయారు. దాంతో ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.
పొంగల్ సందర్భంగా ప్రజలకు తమిళనాడు సర్కారు గుడ్‌న్యూస్..
పొంగల్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదును కానుకగా అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15న పొంగల్ పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పండుగకు ముందు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, చైనా రేషన్ కార్డుదారులు, రేషన్ కార్డులు లేనివారు మినహా అందరూ రేషన్ కార్డుదారులకు ఈ కానుకను అందించనున్నారు. పండుగకు ముందు న్యాయ ధరల దుకాణాల ద్వారా వెయ్యి రూపాయల నగదును పొంగల్ కానుకగా అందజేస్తారు.