ఇవాళ బీజేపీ ఫైనల్ లిస్ట్ వచ్చే ఛాన్స్.. జనసేన సీట్లు ఇవే..
తెలంగాణలో తొలిసారిగా జనసేన తన బలాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ మూడో జాబితాపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ముగిసింది. జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తుందని గతంలోనే ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ నేతలు పవన్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అనంతరం సీట్ల ఖరారుపై చర్చలు జరిపారు. జనసేన తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని కోరింది. కానీ, చివరకు 9 సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఏపీ నుంచి సెటిలర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనను బరిలోకి దింపాలనేది బీజేపీ వ్యూహం.
బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, సేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను కేటాయించాలని జనసేన భావిస్తోంది. మిగిలిన సీట్లను ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకునే ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 29 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి!.. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతుంటే మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరుస పర్యటనలతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ కూడా దూకుడు పెంచింది. పెండింగ్‌లో ఉన్న సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో వేగం పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఈ రాత్రికి తుది జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను ఖరారు చేయనుంది. అలాగే జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.
తాత విదేశాలకు వెళ్లాడని చెప్పి.. మనవడిని జైలుకు ఎందుకు తీసుకొచ్చారు..!
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ఎపిసోడ్, చంద్రబాబు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకొచ్చిన ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు శేష జీవితం అంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సిందేనని జోస్యం చెప్పారు. మనవడు దేవాన్ష్ తో తాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాడని చెప్పిన నారా భువనేశ్వరి.. ఇప్పుడు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు తీసుకువచ్చిందని ప్రశ్నించారు. తాతలా తప్పుడు పనులు చేస్తే.. నువ్వు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తావని మనవడితో చెప్పాలంటూ నారా భువనేశ్వరికీ సూచించారు. ఇక, చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చిందో తెలియకుండా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుకు కళ్లు కనబడటం లేదు, ముసలివాడు అని హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
రాహూల్ గాంధీ పది సార్లు పర్యటించినా.. కాంగ్రెస్ అధికారంలోకి రాదు..!
రాహూల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా.. మీ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ.. కుటుంబ పరిపాలన అంటారు.. మీకున్న అర్హత ఎంటి? అని ప్రశ్నించారు. మీరు లీడర్ వా.. రీడర్ వా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసా.. ఉద్యమంలో చనిపోయిన వారు కాంగ్రెస్ వల్లనే కదా? అని మండిపడ్డారు. BJP పార్టీ BRS లు ఒక్కటే అంటారు.. గతంలో ఎన్నికలు ఉన్నపుడు.. మీరు అక్కడికి వెళ్లకుండా.. జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. మరి మీరా తొత్తులు.. మేమా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదకొండు సార్లు మీకు అధికారం ఇస్తే.. సాగునీరు.. తాగు నీరు ఇవ్వకుండా.. పోటిరెడ్డిపాడు బొక్క కొట్టి.. RDS బద్దలు కొట్టి నీళ్ళు దోచుకు పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పదేళ్లలో దేశంలోనే అత్యధిక GDP తెలంగాణది అన్నారు. ఇప్పుడు BRS మహారాష్ట్ర లో విస్తరిస్తుంటే.. మీకు బుగులు పుట్టుకుని.. మాపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ అవసరాల గురించి.. BC లను.. మైనారిటీ లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో పొత్తుల అంశం ప్రాసెస్ లో ఉంది
తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఆయా పార్టీలు బరిలో దింపే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తుల అంశం ప్రాసెస్ లో ఉందన్నారు. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూస్తామని ఆయన వెల్లడించారు.
అంతేకకాఉండా.. ఆ తర్వాత మా నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా మేం పాటిస్తామని కూనంనేని వ్యాఖ్యానించారు. మేం ఏం చేయాలో మాకు స్పష్టత ఉందని, రేపు మరోసారి మా పార్టీ ముఖ్య నేతలు సమావేశం అవుతారన్నారు. సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని తెలిపిందన్నారు. మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామని, కాంగ్రెస్ లో నేతలను ఎందుకు చేర్చుకున్నారో నాకు తెలియదని కూనంనేని సాంబశివ రావు తెలిపారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందని అనుకుంటున్నామన్నారు కూనంనేని సాంబశివ రావు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఈ జన్మకు మారడు.. యుద్ధం అనేది 2019లోనే అయిపోయింది..
క్రీడలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొ్న్నారు. నవంబరు 1 నుంచి 2023 సబ్ జూనియర్ టోర్నమెంట్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి డిక్లేర్ చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే అద్భుతమైన అవకాశాలు క్రీడలలో ఇస్తున్నామన్నారు. ఆల్ ఇండియా సబ్ జూనియర్ టోర్నమెంట్ ప్రారంభించడం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు.
రాష్ట్రం మొత్తం ఆటలు క్రీడలతో ఉత్సవంలా ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులలో పోటీ పెంచే క్రీడలను అందరూ ప్రోత్సహించాలన్నారు. చంద్రబాబుకు అత్యంత తీవ్రమైన వ్యాధులున్నాయి, ప్రాణాలకే ప్రమాదమని వాదించారని ఆయన తెలిపారు. వాళ్ళ రూట్ మ్యాప్ రాగానే మేం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండున్నర గంటలు సమయం పట్టే ప్రయాణాన్ని 14గంటలు మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్‌లా చేశారని ఆయన ఆరోపించారు.
ఊహాగానాలను తాము నమ్మము
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై కీలక వ్యాఖ్యుల చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరామని, బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నారన్నారు. సీపీఎం సీట్లపై చర్చ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇంకా సీపీఎం సీట్లపై స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు. రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుందని, ఇండియా కూటమి బలపడటం వల్ల బీజేపీని నిలవరించవచ్చని సీపీఐ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఊహాగానాలను తాము నమ్మమని, వివేక్ కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామన్నారు నారాయణ. చెన్నూరులో సీపీఐ గెలుపుకు వివేక్ కృషి చేస్తారని, పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తామన్నారు సీపీఐ నారాయణ.
“పంది గుండె”ను అమర్చుకున్న వ్యక్తి.. 40 రోజుల తర్వాత మృతి
మానవులకు అవయవాలు పాడైతే, వేరే వాళ్లు దానం చేయడమో లేకపోతే మరణించడమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. ముఖ్యంగా పంది అవయవాల్లో జన్యుమార్పిడి చేసి మనుషులకు అమర్చుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తికి పంది కిడ్నీని, మరొక వ్యక్తి పంది గుండెను అమర్చారు. అయితే ప్రారంభ రోజుల్లో సదరు రోగులు బాగానే ఉన్నా తర్వాత మానవ శరీర వ్యవస్థ వాటిని తిరస్కరించడంతో మరణించారు. అయితే కొన్ని రోజుల పాటు వారు జీవించి ఉండటం, పందులకు సంబంధించిన కొన్నాళ్ల పాటు పనిచేయడం శాస్త్రవేత్తలకు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది. ఇదిలా ఉంటే తాజా ఇదే విధంగా పందికి గుండెను అమర్చుకున్న రెండో వ్యక్తి మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్ అనే వ్యక్తి ప్రపంచంలోనే పంది గుండెను అమర్చుకున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను లారెన్స్ కి పెట్టారు. గుండె వైఫల్యంతో బాధపడుతున్న లారెన్స్, ఇలా పంది గుండెను అమర్చుకున్న తర్వాత 40 రోజుల పాటు జీవించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, మొదటి నెలలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది, అయితే ఆ తర్వాత రోజుల్లో గుండెను శరీరం తిరస్కరిస్తున్న సంకేతాలు కనబడ్డాయని, శస్త్ర చికిత్స తర్వాత దాదాపుగా ఆరు వారాలు జీవించి సోమవారం మరణించారు.
20 రూపాయల కోసం కక్కుర్తి పడితే.. రూ.3వేలు ఫైన్
ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్‌మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్‌మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్‌లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, బెంగుళూరులోని ఐకియా మాల్‌లోని క్యారీబ్యాగ్‌లకు లోగోలు ఉన్నాయి. అయినా సరే, వినియోదారుల నుంచి ఆ మాల్ సిబ్బంది డబ్బులు వసూలు చేశారు. ఈ విషయంపై ఓ మహిళ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో ఆ మాల్‌పై 20 రూపాయల క్యారీ బ్యాగ్ కోసం రూ.3వేల జరిమానాను విధించింది వినియోగదారుల కోర్టు.
మైనార్టీలకు కేసీఆర్ చేసింది శూన్యం..
గతంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని, లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు..ఏమైందని ప్రశ్నించారు. ఇస్లామిక కల్చరల్ సెంటర్స్ , మైనారిటీలకు ఇల్లు అన్నారు ..ఏ ఒక్కటి కాలేదని ఆయన మండిపడ్డారు. మేము మైనారిటీలకు 55 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆరు మాత్రమే ఉన్నాయని, మైనార్టీలకు కేసీఆర్ చేసింది శూన్యమన్నారు షబ్బీర్ అలీ. మైనార్టీలకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం రెండు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారని, కానీ ఏ ఒక్కరికి సహాయం చేయలేదన్నారు షబ్బీర్ అలీ. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ,ప్రియాంక యూత్ డిక్లరేషన్స్, సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్స్ విడుదల చేశారని, త్వరలో మైనార్టీ ,బిసి, డిక్లరేషన్స్ రాహుల్ ,ప్రియాంక గాంధీ లచేత విడుదల చేస్తామన్నారు షబ్బీఆర్ అలీ
ఎంత బాధైన భరిస్తాం, విజయం సాధించే వరకు పోరాడుతాం.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు ప్రతిజ్ఞ
ఇజ్రాయిల్-హమాస్ పోరాటం తీవ్ర యుద్ధంగా మారుతోంది. ఈ యుద్ధంపై ఇప్పటికే అరబ్, ముస్లిం దేశాలు తమ ఆందోళనను వ్యక్తపరిచాయి. అయితే ఇరాన్‌తో సహా పలు అరబ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. ఓ వైపు గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్ హిజ్బుల్లా, యెమెన్ హౌతీ రెబల్స్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గాజా స్ట్రిప్ లో భూతల దాడులు ‘‘బాధకరమైన నష్టాలు’’ మిగుల్చుతున్నప్పటికీ.. హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ‘‘మనకు చాలా ముఖ్యమైన విజయాలు ఉన్నాయి, కానీ బాధకరమైన నష్టాలు కూడా ఉన్నాయి. మనలో ప్రతీ సైనికుడు ముఖ్యమే అని తెలుసు’’ అంటూ నెతహ్యహు ఓ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. గాజాలో భూతల దాడుల్లో కనీసం 11 మంది సైనికులు మరణించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ధృవీకరించిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మేము విజయం సాధించే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు. అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని మాట్లాడుతూ.. హమాస్‌ని నేల కూల్చే వరకు తాము విశ్రమించబోమని చెప్పారు.
చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టులో విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో మరికొన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఎల్లుండి(నవంబర్ 3)కి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అంశాలు మీడియాతో మాట్లాడకూడదు.. రాజకీయ సమావేశాలు, సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదంటూ షరతులను సీఐడీ ప్రతిపాదించింది. సీఐడీ షరతులపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఎక్కడా అతిక్రమించలేదని.. ఆయన మాట్లాడటం అనేది ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో న్యాయస్థానాలు కల్పించాయన్నారు సీఐడీ చెబుతున్న షరతులు ఆయన హక్కులను హరించే విధంగా ఉన్నాయని లాయర్లు కోర్టులో తెలిపారు. ఇదిలా ఉండగా.. జైలు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగ్స్ను సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. ర్యాలీలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా.. రాజమండ్రి నుంచి ర్యాలీగా విజయవాడకు వచ్చారని కోర్టుకు వెల్లడించారు.
తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
రాథోడ్ బాపురావు బీజేపీలో చేరడం సంతోషమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీలోకి రాథోడ్ బాపురావు చేరారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరికొంత మంది బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. సాయంత్రం బీజేపీ సీఈసీ సమావేశం ఉంటుందన్నారు. సాయంత్రం కొన్ని సీట్ల పై స్పష్టత వస్తుందని, మిగిలిన సీట్లను త్వరలో ప్రకటిస్తామన్నారు కిషన్ రెడ్డి. మూడో తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతామని, ఎన్నికలకు సమాయత్తం అవుతామన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో కర్ణాటక ప్రజలను మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. కర్ణాటకలో ఐదునెలలుగా కరెంట్ లేదు..ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ టాక్స్ వసూలు చేసి పంపిస్తున్నారని, కర్ణాటకను కాంగ్రెస్ దోచుకుటుంది.. తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు కిషన్ రెడ్డి.
కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడికి పోయింది
కేసీఆర్ కి ప్రజల ఓట్ల పై నమ్మకం లేదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. జనవశీకరణపై నమ్మకం ఉందని, వశీకరణ, తాంత్రిక పూజలు చేస్తారు.. అందుకే ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కి వెళ్లడం లేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ అందరి క్షేమం కోసం చేసే పూజలు మాత్రమే ఫలిస్తాయన్నారు. మేడిగడ్డ మర్చిపోక మునుపే అన్నారం బ్యారేజ్ లీక్ మొదలైందని, బ్యారేజ్ లీకేజీల గురించి కేసీఆర్ మాట్లాడాలన్నారు. కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడికి పోయిందని, కాళేశ్వరంతో ఎవరికి న్యాయం జరగలేదన్నారు బండి సంజయ్.
అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ పార్టీ,రాష్ట్ర నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ప్రొజెక్టర్ పెట్టి కాళేశ్వరం లీకేజీల గురించి కేసిఆర్ చెప్పాలి. కాంట్రాక్టులు కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు పై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. తాంత్రిక పూజసమగ్రి కాళేశ్వరంలో కలపడనికే కేసీఆర్ వెళ్ళాడు. నాణ్యత లోపం కారణంగానే లీకేజీ సమస్యలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ తప్పిదం. కేసీఆర్ క్షమాపణ చెప్పి రైతులను ఓట్లు అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డామ్ లు కుంగుతున్నాయి..లికవుతున్నాయి. లక్ష ముప్పై కోట్ల కేసీఆర్ కుటుంబం నుంచి రికవరీ చేయాలి. విద్రోహ చర్య అయితే పోలీసులు ఏం చేస్తున్నారు. ఎన్నికలున్నాయి కాబట్టి విద్రోహ చర్య అంటే ప్రజలు మర్చిపోతారు అనులకుంటున్నారు.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దళితబంధు పుట్టించిన మొగోడు కేసీఆర్
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూసుకువెళ్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ఖమ్మం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా అశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లిలో వెంకట వీరయ్య 70, 80 వేల మెజారిటీ తో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మీద నుంచి చూశా… ఇంకా రావాల్సిన వారు చాలా మంది… సండ్ర మీద అభిమానం తో వచ్చారన్నారు. సత్తుపల్లి చైతన్యం, ఆలోచన వున్న ప్రాంతమన్నారు. పోటీ చేసిన వ్యక్తులు అనుభవం, కార్యదక్షత చూడాలన్నారు సీఎం కేసీఆర్.
అంతేకాకుండా.. ‘పార్టీ ఎది, పార్టీ చరిత్ర, వైఖరి, ప్రజల గురించి ఆ పార్టీ ఏమి ఆలోచిస్తుంది అనేది చూడాలి. కులాన్ని ద్వేషించడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి పరిణతి వచ్చిన దేశంలో అద్భుతాలు జరుగుతాయి. దళిత బంధు పుట్టించిన మొగుడు కేసీఆర్. కేసీఆర్ రాక ముందు బందు వుందా. ఎవ్వరూ దరఖాస్తు ఇవ్వకున్న డిమాండ్ చేయకుండా నేను ఇచ్చాను. ఓట్ల కోసం పెట్టలేదు. 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వస్తె వారి పరిస్థితి బాగాలేదు. అంటరాని వారు గా ఇబ్బందులు పడ్డారు. పేద పెడబొబ్బలు పెట్టే మూడు రంగులు, ఎర్ర రంగు జెండాలు దళితులను వాడుకున్నారు. ఎన్నికల్లో మోసాలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే గా వున్నప్పుడు ఆనాడే దళిత చైతన్య యాత్ర పెట్టాను. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టని పథకాలు చాలా పెట్టాను. ఎన్నిక గడువాలి అన్న ఆలోచన మాకు లేదు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం. చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. కరోనా దరిద్రం, నోట్లు రద్దు లేకపోతే ముందే దళిత బందు పెట్టాను.