రాజోలు సీటు.. ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు (ఎస్సీ రిజర్వుడు) వైసీపీ సీటు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచించాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఖచ్చితమైన సర్వే నిర్వహించి టిక్కెట్ కేటాయించాలంటూ ఎమ్మెల్యే రాపాక చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి.. మలికిపురం సెంటర్‌లో వైఎస్సార్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ఈ నియోజక వర్గంలో రెండు సార్లు ఓడిపోవడంతో కార్యకర్తలు మనోవేదనతో వున్నారని అన్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీ గెలిచే అభ్యర్థికి టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నన్ను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం చెప్పిందని.. పార్టీ అధిష్టానం ఎంపీగా పోటీ చేయమన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధంగా వున్నట్టు ఎమ్మెల్యే రాపాక చెప్పారు. అయితే, ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధమని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు రాపాకకు మద్దతుగా రాజీనామాలు చేశారు. రెండు రోజుల క్రితమే రాపాకను అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జిగా నియమించారు.. మరోవైపు.. మాజీ మంత్రి, టీడీపీ రాజోలు ఇంఛార్జికి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే, వైసీపీలో కొందరు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్లు ఖరారు అయ్యాక గొల్లపల్లి, రాపాక కూడా కలుసుకుని మాట్లాడుకున్నారు కూడా. అంతకుముందు దశాబ్ద కాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, వీరిద్దరూ వైసీపీలో ఒక్కటయ్యారు. మా మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని పార్టీ శ్రేణులకు కూడా స్పష్టం చేశారు.
డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్‌లు విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులోకి రానుండగా.. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.. ఇక, 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో ఈ పరీక్షలు నిర్వహించేవిధంగా షెడ్యూల్ రూపొందించారు. కాగా, రాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్సీ-2024 షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.. డీఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం.. పాత షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే, ఎస్జీటీ అర్హతలను మార్చడం, టెట్ కు డీఎస్సీకి మధ్యన తగిన సమయం ఇవ్వడం వల్ల షెడ్యూల్ లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.. ఇక, పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
గీతాంజలి ఫ్యామిలీకి అండగా సీఎం జగన్.. రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అయితే.. గీతాంజలి కుటుంబానికి తాను అండగా ఉంటానని ప్రకటించారు సీఎం జగన్.. అంతేకాదు గీతాంజలి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు.. ఇక, గీతాంజలి పసిబిడ్డల కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సీఎం జగన్.. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. కాగా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా గ్రూపుల వేధింపుల వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్టు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంతో తెనాలికి చెందిన మహిళ ఆత్మహత్య ఘటన రాజకీయంగా దుమారం రేపింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. యూట్యూబ్ ఛానెల్‌లో గీతాంజలి ఇంటర్వ్యూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గీతాంజలి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
గీతాంజలి ఆత్మహత్యకు కారణం అదే.. భర్త బాలచందర్ కీలక కామెంట్లు
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా పోస్టుల వల్లే.. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్టు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారం సీఎం వైఎస్ జగన్ వరకు వెళ్లింది.. మహిళల గౌరవానికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసిన సీఎం జగన్.. గీతాంజలి ఇంటర్వ్యూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు.. తన భార్య గీతాంజలి మృతిపై కీలక విషయాలను వెల్లడించారు ఆమె భర్త బాలచందర్. జగనన్న కాలనీలో ఇల్లు పట్టా తీసుకున్నాం.. ప్రభుత్వానికి మద్దతుగా నా భార్య కామెంట్లు చేసింది.. అక్కడి నుంచి సోషల్ మీడియాలో మాకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు బాలచందర్.. అసభ్య పదజాలంతో టోల్స్ రావడంతో నా భార్య తీవ్ర ఆవేదన చెందింది.. మేం పనుల నిమిత్తం బయటికి వెళ్లిపోయాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లతో నా భార్య గీతాంజలి మరింత కలత చెందింది.. అర్ధరాత్రి కూడా ఫోన్ చూసుకొని బాధపడేది అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇక, ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ కి వెళ్లి గీతాంజలి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం.. అయినా ప్రయోజనం లేకుండా ప ఓయింది.. ట్రోల్స్ వల్లే నా భార్య ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయం తెలుసుకొని నిర్ధాంత పోయానన్న బాలచందర్.. మాకు ఎప్పుడూ సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెట్టే అలవాటు లేదు.. కానీ, మా మీద మాత్రం కామెంట్లు పెట్టారు.. అది చూసి నా భార్య తీవ్ర ఆవేదన చెందింది.. అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు గీతాంజలి భర్త బాలచందర్.
బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అజెండా ఒక్కటే..
బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సోషల్ మీడియాతో ప్రతి ఇంటికి మన సందేశం వెళ్ళాలి.. దేశ ప్రజలు మూడోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలు.. ఎవరి దగ్గరికి వెళ్లినా మోడీ మోడీ అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కానీ మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అమిత్ షా పేర్కొన్నారు. దివ్యమైన రామ మందిరం నిర్మాణం చేసుకున్నాం.. కాశ్మీర్లో 370 రద్దు చేసుకున్నాం.. ట్రిపుల్ తలాక్ తెచ్చాం.. లక్షల మంది ముస్లిం తల్లుల బాధ అర్థం చేసుకుని త్రిపుల్ తలాక్ తెచ్చాం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చాం.. ఇప్పుడు CAA తెచ్చామని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ CAAకు వ్యతిరేకం.. కాంగ్రెస్ కి నాగరికత లేదని విమర్శించారు. కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు అని మండిపడ్డారు. పదేళ్ళలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది మోడీ సర్కార్ అని అమిత్ షా తెలిపారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మూడు పార్టీల జెండాలు వేరు.. అజెండా ఒక్కటేనని ఆరోపించారు. ముస్లిం రిసేర్వేషన్ లు ఎత్తివేస్తాం.. కాంగ్రెస్ ఎత్తేయగలుగుతుందా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు. దాని చిట్టా అంతా తమ దగ్గర ఉందని.. తెలంగాణ వికసిత్ అజెండా లేదు వల్ల దగ్గర అని ఆరోపించారు. ఉమ్మడి ఏపీకి సోనియా, మన్మోహన్ సింగ్ లు పదేళ్ళలో 2 లక్షల కోట్లు ఇచ్చారు.. మోడీ 12 లక్షల కోట్లు వెచ్చించారు తెలంగాణకు అని తెలిపారు.
తెలంగాణలో భానుడి భగభగలు.. మార్చిలోనే మండే ఎండ
ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. భానుడి భగభగలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళలలో కాస్త చల్లబడినా గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం ముఖం మాడిపోయేలా ఎండలు ఉంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రికార్ట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 40.5గా నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్ లో 40.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదయ్యాయి. అటు.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ లో 40.1గా నమోదు అయ్యాయి. మరోవైపు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడి భగభగమంటున్నాడు. ఉక్కపోత, ఎండతో జనం అల్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అటు.. సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది.
“పాకిస్తాన్ హిందువులు స్వేచ్ఛగా ఉపిరి పీల్చుకుంటారు”.. సీఏఏకి మద్దతుగా పాక్ మాజీ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ డానిష్ కనేరియా భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు మద్దతు తెలిపారు. 2015కి ముందు భారత్‌కి తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించి, సీఏఏ నిబంధనలు పాకిస్తానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్తానీ హిందువులు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకోగలుగుతారు అని కనేరియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఏఏని అమలు చేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి, హోమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ టీంలో లెగ్ స్పిన్నర్‌గా సేవలందించిన డానిష్ కనేరియా, ఆ జట్టుకు ఆడిన రెండో హిందువుగా ప్రసిద్ధి చెందారు. అనిత్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీంకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల పాక్ జట్టులో తనపై ఇతర క్రికెటర్లు చూపిన మతవివక్షను కూడా ఆయన వెల్లడించారు. తాను హిందువు అని, అఫ్రిది వంటి ఆటగాళ్లు తనపై వివక్ష చూపించేవారని పేర్కొన్నారు. పాకిస్తాన్ తరుపున 2000-2010 క్రికెట్ ఆడిన కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు పగగొట్టారు. 18 వన్డేలు ఆడారు. సోమవారం సీఏఏని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉండీ, మతవివక్ష ఎదుర్కొంటూ భారత దేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి ఈ దేశ పౌరసత్వాన్ని ఇస్తుంది. ముస్లిమేతర హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు పార్సీకు పౌరసత్వం రానుంది. డిసెంబర్ 21, 2014కి ముందు దేశానికి వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.
పవన్ ‘జల్సా’తో కథ అల్లారు.. ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన పూనమ్ కౌర్
తెలుగులో చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఉంటుంది నటి పూనమ్ కౌర్. తెలుగులో అనేక సినిమాలో హీరోయిన్ గా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన పంజాబీ భామ పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె పరోక్షంగా చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూ ఉంటాయి. అయితే గతంలో ఆమెను జల్సా సినిమాలో నటించాల్సి ఉండగా తప్పించి ఆమె స్థానంలో పార్వతి మెల్టన్ ను నటింప చేశారు అనే టాక్ ఉంది. దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాబట్టి ఆయనను అప్పటి నుంచి ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె నిజంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలియకుండానే వారి మధ్య వివాహం కూడా పెరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ విషయం మీద పూనమ్ కౌర్ స్పందించింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా ఏపీకి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకునే మరణించింది ఆమె గురించి ట్వీట్ చేసిన పూనమ్ కౌర్ గీతాంజలి ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకుంది? అనే విషయం మీద తనకు కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకొచ్చింది. ఎవరైతే ఒక పార్టీకి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ ముఠా ఉందో, ఎప్పుడూ వాళ్ళు మహిళలను సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టే విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్లు కానీ లేక వారు ఎవరైనా కానీ వాళ్లని శిక్షించాలని కోరింది. ఆ తర్వాత ఎందుకు చెప్పుకొచ్చిందో తెలియదు కానీ జల్సా స్టోరీ అనేది తన మీద వండి వార్చిన ఒక ఫేక్ స్టోరీ అని చెప్పుకొచ్చింది. నిజాన్ని కప్పిపుచ్చే విధంగా ఈ ఫేక్ స్టోరీ అల్లారని తాను తన జీవితకాలంలో ఏ ఒక్క డైరెక్టర్ ని గాని నటుడిని గాని ఒక సినిమా కోసం అవకాశం అడగలేదు అని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడూ నటన లేకుండా అయినా ఎలా బతకవచ్చు అనే విషయం మీద ఆలోచిస్తూ ఉంటా అని చెప్పుకు రావడమే కాదు తాను ఒప్పుకున్న సినిమాలు, చేసిన సినిమాలు కంటే రిజెక్ట్ చేసిన సినిమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని నమ్మవద్దని అని చెప్పుకొచ్చింది. అయితే గీతాంజలి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ జల్సా విషయాన్ని ఎందుకు ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చింది అనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి.
రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.. గతంలో కన్నా ఇది డీప్ గా ఉంది..అందులో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖంను ఎడిట్ చేశారు. ఈ వీడియోపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో చేయవద్దు’ అని రష్మిక మందన్న అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు పోలీసుల ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..ఇలాంటి వాటిని ఆపాలని హెచ్చరిస్తున్నారు.. వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలేస్తున్న రష్మికకి ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరమనే చెప్పాలి. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైన మరోసారి ఇలాంటి వీడియో బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు..
ఏమైందిరా మీకు.. ఎందుకురా ఇప్పుడు వీటిమీద కొట్టుకుంటున్నారు
సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సివస్తుందో అని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా, దగ్గినా గొడవే. ఇక ఫ్యాన్స్ వార్ అయితే.. మా హీరో గొప్ప అని ఒకడు అంటే.. మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు.. ఇలా సరదాసరదాగా పోస్టులు చేసుకొనే దగ్గరనుంచి.. అడ్రెస్స్ లు పెట్టుకొని బయటికి వెళ్లి కొట్టుకొనేవరకు వచ్చారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్- ప్రభాస్ ఫ్యాన్స్.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని రక్తాలు వచ్చేట్టు కొట్టుకున్నారు. ఇక ఇప్పుడు అలాంటి గొడవలు ఏమి లేవు అనుకుంటా.. కొత్త ట్రెండ్ కు నాంది పలికారు ఫ్యాన్స్. అదే ఏ సినిమా గొప్ప. అవును మీరు విన్నది నిజమే.. ఒక డైరెక్టర్ తీసిన రెండు సినిమాలను పోలుస్తూ.. ఆ సినిమా గొప్ప అంటే.. ఇంకో సినిమా గొప్ప అని చెప్పుకొస్తున్నారు. అసలు ఆ రెండు సినిమాలు ఏంటి.. ? ఆ డైరెక్టర్ ఎవరు.. ? అనేది తెలుసుకుందాం. త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న గురూజీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాల్లో అతడు, జల్సా సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. మహేష్ బాబు, త్రిష జంటగా అతడు తెరకెక్కగా.. పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా జల్సా తెరకెక్కింది. ఇద్దరు హీరోలకు ఈ రెండు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో అభిమానులు కొట్టేసుకుంటున్నారు. కొంతమంది అతడు బావుంటుంది అంటే ఇంకొంతమంది జల్సా అని చెప్పుకొస్తున్నారు. జల్సా కన్నా అతడునే బావుంటుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. రెండు త్రివిక్రమ్ సినిమాలే.. ఇద్దరు స్టార్ హీరోలు.. అటుఇటుగా రెండు కథలు ఒకటే అని చెప్పొచ్చు. డబ్బు కోసం హత్య చేసే హీరో అతడులో ఉంటే .. ఆ డబ్బు లేక తల్లిదండ్రులను కోల్పోయిన హీరో జల్సాలో కనిపిస్తాడు. పొలంలో హీరోను ఎలివేట్ చేసే సీన్ అతడులో ఉంటే .. అదే పొలంలో విలన్ ను ఎలివేట్ చేసే సీన్ జల్సాలో ఉంటుంది. ఇక రెండు సినిమాల్లో హీరోయిన్స్ ఎంతో అమాయకులు. అతడులో పవర్ ఫుల్ ఆఫీసర్ గా ప్రకాష్ రాజ్ కనిపిస్తే.. జల్సాలో కామెడీ పోలీస్ గా కనిపిస్తాడు. ఇక బ్రహ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.