*హైదరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు..
గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పట్నం మహెందార్ రెడ్డి, తెలంగాణ ఫైర్ శాఖ డిజి నాగిరెడ్డి, హోం ప్రనిస్పల్ సెక్రెటరీ జితేందర్, సౌమ్య మిశ్రా ఇతరఅధికారులు, ఫైర్ సిబ్బంది పాల్గొననున్నారు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం లేకపోవడం మంచిది కాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివృది చెందుతుందన్నారు. గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రాజకీయాలు కు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలు ను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకు రాబోతున్నామన్నారు. హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామమన్నారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతామన్నారు. అర్బన్ తెలంగాణా, రూరల్ తెలంగాణా ను అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మ సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్నారు. ఫార్మ్ సిటీలో మీరు ప్లాన్ చేస్తే మేము పల్లె లో ప్లాన్ చేస్తున్నామని, 10 నుండి 15 విలేజ్ లో ఫార్మ్ ను ప్లాన్ చేస్తున్నామన్నారు. ఒకే ప్రాంతము 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని, అపోహాలకు ఎవరు లోను కాకండని సూచించారు. రాజకీయంగా నాకు అవగాహన ఉంది, నిర్మాణంలో నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. మేము అంతకు మేము అపర మేధావులు అని నిర్ణయాలు తీసుకోబోమన్నారు. అలా నిర్ణయాలు తీసుకుంటే.. మేడి గడ్డ అవుతుందన్నారు. పరిపాలన పై నాకు కొంత సమయం కావాలి, ఎవరు కుడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
*మేడారం జాతరకు వెళ్తున్నారా..? అయితే వీటిని చూసి రండి..
మహా జాతర 2024: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా.. లక్షలాది మంది భక్తులు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ మేడారం వెళ్లే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలు తప్ప మరేమీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే మేడారంలోని జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెల గురించి చాలా మందికి తెలియదు. అంతే కాదు మూడు నాలుగు రోజులు జాతరలో గడిపే భక్తులకు కూడా సమ్మక్క, సారలమ్మ ఆలయాలు కనిపించవు. మేడారం జాతర ప్రాంగణంలోనే ఉన్న జంపన్న, నాగులమ్మ గద్దెలు, సమ్మక్క, సారలమ్మ ఆలయాల గురించి ప్రచారం లేకపోవడంతో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా భక్తులకు తెలియడం లేదు. చాలా మంది అటుగా వెళుతుండగా వాటిని గమనిస్తే తెలియక లైట్ తీసుకుంటున్నారు. మరి జంపన్న, నాగులమ్మ ఆలయాలు ఎక్కడ.. సమ్మక్క, సారలమ్మ ఆలయాలు ఎక్కడ నిర్మించారు..
మేడారంలోని సమ్మక్క గుడి..
మేడారం మహాజాతర ప్రాంగణంలో సమ్మక్క ఆలయం ఉంది. ఈ ఆలయం సమ్మక్క మరియు సారలమ్మ పొలాలకు 200 మీటర్ల దూరంలో ఉంది. జాతర ప్రారంభానికి ముందు ఈ ఆలయంలో గుడిమెలిగె, మందమెలిగే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తారు. జాతరకు వచ్చే భక్తులకు చాలా మందికి ఇక్కడ సమ్మక్క గుడి ఉందనే విషయం తెలియదు. అందుకే వరి పొలాలను సందర్శించిన తర్వాతే తిరిగి వస్తుంటారు.
కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం
తల్లి సమ్మక్క, కూతురు సారలమ్మ కూడా కాకతీయ రాజులతో వీరోచితంగా పోరాడిన సంగతి తెలిసిందే. మేడారానికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం ఉంది. పూజారులు, గ్రామస్తులు సారలమ్మను ఇంటి కూతురిగా భావిస్తారు. చాలా మంది మహిళలు పిల్లల కోసం ఇక్కడ వరం తీసుకుంటారు. జాతర సందర్భంగా ఆలయం నుంచి మేడారంలోని గద్దెపైకి అమ్మవారిని తీసుకెళ్తుండగా తడిబట్టలతో అమ్మవారిని తీసుకెళ్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఛత్తీస్‌గఢ్ నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు.
వాగు వద్ద జంపన్న గద్దె
మేడారంలో సమ్మక్క కుమారుడు జంపన్న వాగు ఉన్న సంగతి తెలిసిందే. కానీ వాగు పక్కనే ఉన్న జంపన్న గద్దె గురించి చాలా మందికి తెలియదు. జంపన్న వాగుకు అవతలివైపు జంపన్న గట్టు ఉంది. సమ్మక్క-సారలమ్మ గద్దె ఉన్న సమయంలోనే జంపన్న గద్దె కూడా స్థాపించబడిందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. జంపన్న వాగులో స్నానం చేసే భక్తులలో చాలామందికి అక్కడ జంపన్న గద్దె ఉందనే విషయం తెలియదు. ఈ విషయం తెలిసిన వారు మాత్రమే ఇక్కడికి వచ్చి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు.
వాగు పక్కనే నాగులమ్మ గద్దె ఉంది
సమ్మక్క తల్లికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు. నాగులమ్మ కూడా కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందింది. కాగా, సమ్మక్క, సారలమ్మతో పాటు నాగులమ్మను నియమించారు. ఈ నాగులమ్మ గద్దె జంపన్న నదికి అవతలి వైపున ఉన్న స్నాన ఘాట్ల వద్ద ఉంది. జంపన్న నదిలో స్నానాలు చేసిన భక్తులు నాగులమ్మకు కూడా పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులలో చాలా మంది మహిళలు ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. జాతరకు వచ్చే భక్తులు అటుగా వెళ్తున్నా ఇది నాగులమ్మ గద్దె అని చాలామందికి తెలియదు. మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ పూజా మందిరంతో పాటు జంపన్న, నాగులమ్మ గుడులు కూడా ఉన్నాయని భక్తులకు తెలియజేసే వ్యవస్థ లేదు.
అందుకే వాటి గురించి చాలా మందికి తెలియదు. జాతరలో నాలుగైదు రోజులు బస చేసిన భక్తులు వాటిని దర్శించుకోలేకపోతున్నారు. అయితే వీరికి సరైన గుర్తింపు తీసుకురావాల్సిన ప్రభుత్వం అక్కడ కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో జాతరకు వచ్చే భక్తులకు మేడారంలో పార్కింగ్ స్థలాలతోపాటు దర్శనీయ స్థలాలు, ప్రయాణ మార్గాల గురించి తెలియజేసేలా కనీసం బోర్డులు ఏర్పాటు చేస్తే చాలా మంది భక్తులు వారిని దర్శించుకునే అవకాశం ఉంది.
*మేడారానికి 6 వేల ప్రత్యేక బస్సులు.. నేటి నుంచి 25 వరకు సేవలు
ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు దాదాపు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.105 కోట్లతో జాతర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మేడారం భక్తులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ 51 కేంద్రాల నుంచి ఏకకాలంలో ఆరు వేలకు పైగా బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని, గత జాతరలతో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో సుమారు 40 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రయాణించే భక్తులకు ఆర్టీసీ ఛార్జీలను కూడా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడిపే అవకాశం ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 2,500 బస్సులు నడపడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 22 ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ చెల్లించిన వారి కోసం ప్రత్యేక మేడారం బస్సులు నడుపుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుండగా.. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నేటి నుంచి 25 వరకు 6 వేల బస్సులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
*8 రోజులు.. 45 గంటలు.. 3 బిల్లులు.. 2 తీర్మానాలు..
తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిన్న (శనివారం)తో ముగిసింది. ఫిబ్రవరి 8వ తేదీన తమిళసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ ఫిబ్రవరి 17 వరకు కొనసాగాయి. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు వాడివేడి చర్చలు జరిగాయి. ఇక చివరి రోజైన శనివారం సాగునీటి రంగంపై శ్వేత పత్రం విడుదల, దానిపై చర్చ కొనసాగింది. హాట్ హాట్ గా కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి 8.20 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఎనిమిది రోజుల పాటు సాగాయి. తొలిరోజు (8వ తేదీ) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సాయి సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ధన్యవాద తీర్మానం 9వ తేదీన చర్చకు వచ్చింది. మూడో రోజు (10వ తేదీ) రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ ఖాతా బడ్జెట్‌ను సభలో ప్రతిపాదించింది. మరుసటి రోజు ఆదివారం అసెంబ్లీకి సెలవు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఓటాన్ ఖాతా బడ్జెట్ ప్రతిపాదన, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకూడదని తీర్మానం, కుల గణనపై తీర్మానం, నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం వంటి అంశాలను హైలైట్ చేశారు. పలు సందర్భాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, టీ.హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. మొత్తం 8 రోజుల శాసనసభ సమావేశాల్లో 59 మంది ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడారు. దాదాపు 45 గంటల పాటు సమావేశం కొనసాగింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని కుల గణనపై మరో తీర్మానం చేశారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశాల్లో మరో 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
*నేడు విశాఖకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ విశాఖకు రానున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరుగా మాట్లాడనున్నారు. పొత్తులో జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గం నేతలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.
*టీటీడీ సహాయం కోరిన అయోధ్య రామమందిరం ట్రస్ట్.. సౌకర్యాల కల్పనకు సహకారం
అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది. ఈ క్రమంలో అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం మేరకు టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం అయోధ్యకు వెళ్లారు. మూడు రోజులు క్రితమే అయోధ్యకు టీటీడీ ప్రతినిధులును ఈవో ధర్మారెడ్డి పంపారు. శనివారం సాయంత్రం అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్న ఏవీ ధర్మారెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయోధ్య ట్రస్టు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు, డీఎస్ఎన్ మూర్తి ఇందులో పాల్గొన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, క్యూ లైన్ల నిర్వహణ, ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ బాలరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించడం.. వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. మరోరెండు రోజుల పాటు టీటీడీ అధికారుల బృందం అయోధ్యలోనే ఉండనుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
*తమిళనాడులో ఏనుగు భీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి!
తమిళనాడులో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. పోలం పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. మహిళలతో పాటు ఓ ఆవును కూడా ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు భీభత్సంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు భీభత్సంకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోసూరూ డెంకనికోట సమీపంలో పోలం పనులు చేసుకుంటున్న వసంతమ్మ, అశ్వతమ్మ అనే ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. దాంతో చుట్టుపక్కల వారు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆపై ఓ ఆవును కూడా తొక్కి చంపింది. ఏనుగు చిత్తూరు సరిహద్దు గ్రామాల వైపు వెళ్లింది. దాంతో అటుగా ఉన్న గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇద్దరు మహిళల మృతికి కారణం అటవీశాఖ నిర్లక్ష్యమే అని జాతీయ రహదారిపై గ్రామస్థులు ధర్నాకు దిగారు.
*పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి!
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఫిబ్రవరి 10న తనకు కుమారుడు పుట్టాడని శనివారం (ఫిబ్రవరి 17) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గీతా మాధురి పేర్కొన్నారు. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, హీరో నందు 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2019లో దాక్షాయణి ప్రకృతి జన్మించింది. గీతా మాధురి తెలుగులో ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. రొమాంటిక్, మాస్, ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు.. డివోషనల్ సాంగ్స్ కూడా పడుతూ అభిమానులను అలరిస్తున్నారు. గీతా మాధురి గాత్రానికి, ఆమె పాటలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కొన్నాళ్లుగా పాటలు పాడడం లేదు. తాను మరోసారి తల్లి కాబోతున్నాని జనవరిలో గీతా మాధురి చెప్పారు. సీమంతం ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇక ఫిబ్రవరి 10న బాబు జన్మించాడని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం గీతా మాధురి తన కుమారుడితో శారద సమయం గడుపుతున్నారు. గీతా మాధురి సింగర్‌గా రాణిస్తోంటే.. నందు హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరైన బ్రేక్ కోసం నందు ఎంతో కష్టపడుతున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. అంతేకాకుండా క్రికెట్ యాంకర్‌గా సత్తాచాటుతున్నాడు. నందు, అవికా గోర్ కలిసి చేసిన ‘వధువు’ వెబ్ సిరీస్ పర్వాలేదనిపించింది. 25కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన నందు ఖాతాలో బొమ్మ బ్లాక్ బస్టర్, సవారి, శివరంజని, ఇంతలో ఎన్నెన్ని వింతలో లాంటి హిట్స్ ఉన్నాయి.