మెగాస్టార్ జజ్జనక వేస్తే… థియేటర్స్ మోత మోగాల్సిందే
2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడేసిన మెగాస్టార్ చిరంజీవి, మరో నెలరోజుల్లో హిస్టరీ రిపీట్ చేయడానికి థియేటర్స్ లోకి భోళా శంకర్ గా వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న భోలా శంకర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో చిన్న భయం ఉండేది. మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ బాగోలేదు, చిరుతో సినిమా అంటే ఏం చేస్తాడో అని కంగారు పడేవారు. మెహర్ రమేష్ నెమ్మదిగా భోలా శంకర్ సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. ఫాన్స్ కి మెగా మాస్ చూపిస్తే సినిమా హిట్ అనే విషయం మెహర్ కి బాగా తెలుసు అందుకే భోలా శంకర్ సినిమాని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వింటేజ్ చిరు వైబ్స్ ఇస్తూ భోళా శంకర్ సినిమా నుంచి టీజర్, భోళా మేనియా సాంగ్స్ బయటకి వచ్చి మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చాయి.
ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఫోటోతో రెచ్చగొట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు..
కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిగ్విజయ్ పై చర్యలు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 469 (ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ చేయడం), 500 (పరువు నష్టం) మరియు 505 (ప్రజా దుష్ప్రవర్తనకు దారితీసే ప్రకటనలు) కింద తుకోగంజ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది.
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రక్తపాతం.. 20కి చేరిన మరణాల సంఖ్య..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాలో రాజకీయ కక్షలు పెరిగాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, వామపక్ష పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. శనివారం ఎన్నికల రోజు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పలు పార్టీల కార్యకర్తలు మరణించారు.
ఎన్నికల తర్వాత రోజు కూడా దాడులు కంటిన్యూ అయ్యాయి. ఆదివారం ఉదయం మాల్డాలో టీఎంసీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కత్తిపోట్లకు గురై మరణించారు. దీంతో ఎన్నికలకు సంబంధించిన హింసలో ఇప్పటి వరకు 20 మంది మరణించారు. ఎన్నికల అనంతరం మాల్దాలోని బైష్ణవనగర్ లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరైన టీఎంసీ కార్యకర్త మాటియుర్ రెహ్మన్ పోలింగ్ స్టేషన్ కి వచ్చిన సమయంలో కొంతమంది చుట్టుముట్టి కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యకు కాంగ్రెస్ కారణమని అధికార టీఎంసీ ఆరోపించింది. ఈ ఘర్షణలో మరో ఆరుగురు కూడా గాయపడ్డారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
కష్టపడి నర్సును చేస్తే.. నల్లగా ఉన్నావని వదిలేసింది భయ్యా..
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అలోక్, పీసీఎస్ జ్యోతి మౌర్యల కథ ఇంకా ముగియలేదు, కాన్పూర్‌లో ఇలాంటి కొత్త కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా ఓ యువకుడు తన భార్యను కష్టపడి నర్సింగ్ చదివించాడని, దీని కోసం అప్పుల పాలయ్యాడు. ఇప్పుడు అతని భార్యకు కూడా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు తన పేదరికం తీరిపోతుందని ఆశపడ్డాడు..అయితే అదే భార్య నాకు నువ్వంటే ఇష్టం లేదు అని పెద్ద దెబ్బ కొట్టింది.
ఈ కేసు కాన్పూర్ దేహత్‌లోని మైథా పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర పురం గ్రామానికి సంబంధించినది. ఇక్కడ నివసించే అర్జున్‌కు బస్తీ జిల్లాకు చెందిన సవితా మౌర్యతో 2017లో వివాహం జరిగింది. సవిత మొదటి నుంచి చాలా ప్రస్టేజియస్ గా ఫీలవుతుండేది. దీంతో తన భర్త ముందు చదువుకుని ఏదైనా కావాలనే కోరికను వ్యక్తం చేసింది. అర్జున్ కూడా ఆమె కోరికను గౌరవించాడు. పేదరికంలో ఉన్నప్పటికీ కష్టపడి పని చేస్తూ కాన్పూర్‌లోని మంధానలోని రామ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పారా మెడికల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆమెను చేర్పించాడు.
41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు.. అధికారులకు సెలవు రద్దు చేసిన సీఎం కేజ్రీవాల్..
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై 25 తర్వాత 41 ఏళ్లకు భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 1958 జూలై 21న ఆల్ టైం హై వర్షపాతం 266.2 మి.మీ రికార్డు అయింది. ఆ తరువాత 2003 జూలై 10న 133.4 మి.మీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ జలమయం అయింది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న శనివారం ఏకంగా 126 మి.మీ వర్షం నమోదైంది. రుతుపవన సీజన్ మొత్తం వర్షపాతంలో 15 శాతం వర్షం కేవలం 12 గంటల్లోనే కురిసింది.
మార్క్ జుకర్‌బర్గ్ భద్రతకు ‘మెటా’ చేసిన ఖర్చు రూ.355 కోట్లా…
మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్‌ల గురించి ఈ రోజు వార్తల్లో నిలిచారు. అయితే వాటిపై చేసిన ఖర్చు గురించి జనాలు చర్చించుకుంటున్నారు. జుకర్‌బర్గ్ భద్రత కోసం మేటా మూడేళ్లలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. నివేదిక ప్రకారం, గత 3 సంవత్సరాలలో మేటా సహ వ్యవస్థాపకుడి భద్రత కోసం రూ.355 కోట్లు ఖర్చు చేశారు.
మార్క్ జుకర్‌బర్గ్ కుటుంబం కూడా అతని ఫౌండేషన్ ‘డిఫెండ్ ది పోలీస్’ కోసం కోటి రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఆ ముసుగులో జుకర్‌బర్గ్ భద్రత కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు. లీ ఫాంగ్ అనే విదేశీ మీడియా జర్నలిస్ట్ ప్రకారం, DefundPolice.org పేరుతో గ్రూప్ PolicyLinkకి చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ 2020 నుండి $3 మిలియన్లు (రూ. 24.78 కోట్లు) విరాళంగా ఇచ్చింది.
ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టడం సంతోషం
కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే.. వైఎస్సార్ జిల్లా గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు సీఎం జగన్. భోగాపురం బీచ్ కారిడార్ లో తొలి ఆతిథ్య, టూరిజం ప్రాజెక్ట్ ఇది. 350 కోట్ల తో 40 ఎకరాల్లో ఒబారాయ్ గ్రూప్ అధ్వర్యంలో రిసార్ట్స్.. సెవెన్ స్టార్ హోటల్ నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు.
మాస్ కాంబినేషన్ ఆ ‘మరణహోమం’ కథతో సినిమా చేస్తుందా?
డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. రవితేజని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపీచంద్ మలినేనికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. రవితేజకి పర్ఫెక్ట్ గా వాడడంలో దిట్ట గోపీచంద్ మలినేని. అలాగే రవితేజ లేని గోపీచంద్ మలినేని కెరీర్ ని ఊహించడం కష్టమే. రియల్ లైఫ్ లో కూడా బ్రదర్స్ లా ఉండే రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇదే మాస్ హిస్టీరియాని మరోసారి క్రియేట్ చేయడానికి రవితేజ-గోపీచంద్ మలినేని రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం గత కొంతకాలంగా మాస్ మహారాజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. “THE MASSIEST COMBO IS BACK TO CREATE MAGIC AT THE BOX OFFICE” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసారు. #RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. థమన్-రవితేజ… థమన్-గోపీచంద్ మలినేని… థమన్-గోపీచంద్ మలినేని-రవితేజలది సూపర్ హిట్ కాంబినేషన్… అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయడానికి ఈ కాంబో రెడీ అయ్యింది.
పాళికా బజార్ అగ్ని ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరుకున్న తలసాని
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లారు. పరిస్థితుల్ని ఆరా తీశారు. ఎవరికి ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. పక్కనే వున్న లాడ్డీలో వున్న వారందరిని సురక్షితంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారని అన్నారు. పాళికా బజార్‌లోని ఓ బట్టల షాపులో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. పాళికా బజారులో సుమారు నాలుగు వందల షాపుల ఉన్నాయి. అక్కడే వున్న ఓ బట్టల షాపులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. బట్టల దుకాణం పక్కనే ఉన్న లాడ్జ్ ఉండటంతో ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించారు. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు. మంటలు అంటుకున్న షాపుకు చుట్టుపక్కల్లో బట్టల హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి.
తొమ్మిదో నెల గర్భంతో ఇబ్బంది పడుతున్న ఇలియానా..
హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఇలియానా హిందీ సినిమాలలో కూడా మెరిసి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది. కానీ ఆ తరువాత ఇలియానా కెరీర్ కు ఇబ్బందులు వచ్చాయి ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఇలియానా ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇలియానా ఇటీవలే పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన బేబీ బంప్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం హీరోయిన్ ఇలియానాకు తొమ్మిదో నెల అని తెలుస్తుంది.నిండు గర్భవతిగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేశారు. తన బిడ్డకు తండ్రిని చూపిస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా కానీ అతని ఫేస్ ను మాత్రం కనిపించకుండా కవర్ చేసింది.. తన బాయ్ ఫ్రెండ్ పేరును ఇప్పటికీ వెల్లడించలేదు ఇలియానా.
బ్రెజిల్‌లో కుప్పకూలిన భవనం.. ఇద్దరు చిన్నారులు సహా 14 మంది మృతి
బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో నిరాశ్రయులైన ప్రజలు ఉపయోగించే భవనం కూలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 14 మంది మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ భవనం కుప్పకూలిన సంఘటన నమోదైంది. ప్రస్తుతం భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్నిఫర్ డాగ్స్ సహాయం కూడా తీసుకుంటున్నారు. అగ్నిమాపక దళ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, శనివారం స్నిఫర్ డాగ్స్ సహాయంతో రెస్క్యూ అండ్ రిలీఫ్ వర్క్ టీమ్ శిథిలాల కింద చిక్కుకున్న 15 ఏళ్ల బాలిక, 65 ఏళ్ల మహిళను సజీవంగా రక్షించగలిగింది. దీనితో పాటు 18 ఏళ్ల బాలుడు కూడా రక్షించబడ్డాడు, కానీ, అతను తీవ్ర గాయాలతో మరణించాడు. మూగజీవాలు భవనంలో చిక్కుకున్నాయి. జంతువులను బయటకు తీసేందుకు సహాయక చర్యలపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు.
బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. బండి సంజయ్ కు జాతీయ స్థాయి బాధ్యతలు
తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన బండి సంజయ్‌కు అదిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో సంజయ్‌కు స్థానం కల్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట ఓ ప్రకటన విడుదలైంది. ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ తొలగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను కూడా తొలగించారు. బీజేపీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. జాతీయ కార్యవర్గంలో తెలంగాణ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోము వీర్రాజుకు చోటు దక్కింది. శనివారం రాత్రి బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి 10 మందిని చేర్చుకుంటున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోమువీర్రాజు, సురేష్ కశ్యప్, సంజయ్ జైశ్వాల్, అష్మినీ శర్మ, దీపక్ ప్రకాష్, సతీష్ పునియా చోటు చేసుకున్నారు.