తెలంగాణలో పోటీపై షర్మిల సంచలన నిర్ణయం
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కి సహకరించాలని నేతలు కోరారు. గతంలో పొత్తు, సయోధ్య కుదరలేదు. కాంగ్రెస్ నేతలతో మరో సారి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే.. చరిత్ర నన్ను క్షమించదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో జరుగబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయట్లేదని తెలిపారు. తన పార్టీని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. కేసీఆర్ నియంత పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యం వైఎస్ఆర్టీపీది. ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్టీపీని స్థాపించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిసిస్తూ వచ్చారు. పార్టీ స్థాపించక ముందే 42 మంగళవారాలు నిరసన దీక్షలు చేశామన్నారు. 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశామన్నారు. తెలంగాణ లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేక ఓటు చీల్చి తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు. వైఎస్సార్ తయారు చేసిన కాంగ్రెస్ ను ఓడించ వద్దు అని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసే ఆలోచన నాకు లేదన్నారు.
నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రం..
అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు.. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంటుందని ప్రకటించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. జిల్లాల పునర్విభజన మళ్లీ జరుగుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారణమైనవని, వాటిని ఎవరు నమ్మవద్దని సూచించారు.. అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్న ఆయన.. రాయచోటిలో అన్నమయ్య జిల్లా కేంద్రం ఉండకూడదని కొంత మంది దురుధ్యేశ్యంతో విష ప్రచారం చేస్తున్నారు… కొంత మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా మాద్యమాలు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నే జిల్లా కేంద్రంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
మేం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. కేసులు మాత్రం పెడతారు..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. చిత్తూరు జిల్లా కాణిపాకంలో పర్యటించిన ఆమె.. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకున్ని దర్శించుకున్నారు.. ఆ తర్వాత కాణిపాకంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు రోడ్లు, భవనాలు నిర్మాణమే జరగడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం కారణంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల రోడ్డున పడ్డారన్న ఆమె.. నదుల్లో పెద్ద పెద్ద జేసీబీలతో ఇసుకను తవ్వేస్తున్నారు.. దాని వల్ల బోట్లు నడుపుతున్న వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు..? అని నిలదీశారు.
చంద్రబాబు కేసులో సీఐడీకి షాక్.. ఆ పిటిషన్ తిరస్కరణ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషం విదితమే.. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. కొన్ని షరతులను కూడా విధించింది.. కానీ, చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, సీఐడీకి హైకోర్టు షాకిచ్చింది.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు.. రాజకీయ ర్యాలీల్లో కూడా పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కూడా కొనసాగుతాయని పేర్కొంది.. కానీ, చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న వాదనలు ముగించిన హైకోర్టు.. ఈరోజు తీర్పు వెలువరించింది. కాగా, స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఇదే సమయంలో ఆయనను అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి.. దీనిపై హైకోర్టు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు.. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే.
వైకుంఠ ద్వార దర్శనం షెడ్యూల్ విడుదల.. టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. అందుకే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతారు.. తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి.. దీంతో.. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలకు పూనుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. పది రోజుల పాటు దర్శనం కలిపిస్తూ వస్తోంది.. ఇక, ఏడాది వైకుంఠ ద్వార దర్శనం షెడ్యూల్ విడుదల చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. డిసెంబర్ 23వ తేదీ 2023 నుంచి జనవరి 1వ తేదీ 2024 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. శ్రీవారి దర్శనాలు, వివిధ సేవలకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను కూడా ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. ఈ నెల 10వ తేదీన ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు.. రోజుకి 22,500 చొప్పున 2.25 లక్షల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇక, 10వ తేదీన ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు కూడా ఉంచనున్నట్టు పేర్కొన్నారు.. రోజుకి 2 వేలు చొప్పున 20 వేల టికెట్లు విడుదల చేస్తాం అన్నారు.. డిసెంబర్ 22వ తేదీన సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ లో దర్శన టోకెన్లు విడుదల చేస్తాం.. రోజుకి 42,500 చొప్పున 4.25 లక్షల టికెట్లు విడుదల చేస్తామని.. సర్వదర్శనం టికెట్లను తిరుపతిలో ఏర్పాటు చేసే 10 కౌంటర్ల ద్వారా కేటాయించనున్నట్టు తెలిపారు. ఇక, డిసెంబర్ 23వ తేదీ 2023 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని షెడ్యూల్ విడుదల చేస్తూ.. ఆ పది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
రిషి కొండ కేసు.. లింగమేని పిటిషన్ తిరస్కరించిన సుప్రీం..
రిషికొండపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, టీడీపీ నేత లింగమనేని శివరామ ప్రసాద్‌కు అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీం.. లింగమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఎంను రుషికొండకు వెళ్లవద్దని అంటున్నారు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉంది.. రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించింది చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాజకీయాలకు ఇది వేదిక కాదని పేర్కొంది.. హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వద్ద ఈ కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేసింది.. రాజకీయ కారణాలతోనే కోర్టుకు వచ్చారన్న సీజేఐ.. లింగమనేని అభ్యర్థనను తోసిపుచ్చారు.. దీంతో, హైకోర్టుకు వెళ్తాం అన్నారు పిటిషనర్. కాగా, ఏపీ హైకోర్టు, ఎన్టీజీలో కేసు పరిష్కారం అయ్యే వరకు రుషి కొండపై ఎలాంటి నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలంటూ లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
నేను కంది పప్పునే.. కేటీఆర్ గన్నేరు పప్పు.. రేవంత్ సెటైర్
నేను కంది పప్పునే కానీ.. కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కందిపప్పు ఆరోగ్య కరమైన దినుసు అని.. . కొడంగల్ లో పండించే పంట అన్నారు. కందిపప్పు ఆరోగ్యం ఇచ్చే పప్పు కంది పప్పు అన్నారు. కేటీఆర్ గన్నేరు పప్పు అని.. గన్నేరు పప్పు తింటే చస్తారని రేవంత్ అన్నారు. కమ్యూనిస్టు లతో చర్చలు భట్టి చేస్తున్నారని అన్నారు. మొదట్లో వాళ్ళు కేసీఆర్ తో ఉన్నారన్నారు. తర్వాత వచ్చిన మార్పులతో కమ్యూనిస్టులు మాతో వచ్చారని క్లారిటీ ఇచ్చారు. చర్చలు కొలిక్కి వచ్చాకా చెప్తా అన్నారు. చర్చలు ఇంకా ముగియలేదన్నారు. కమ్యూనిస్టులు మా సహజ మిత్రులన్నారు. అధిష్టానం కూడా మళ్లీ సూచనలు చేసిందన్నారు. కాళేశ్వరం పై కాగ్ నివేదిక ఇచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం విధానంతో కాస్ట్ పెంచింది అని కాగ్ చెప్పిందన్నారు రేవంత్. దీనిని కేటీఆర్ బుకాయించారని మండిపడ్డారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నంత కాలం.. రాజీవ్ గాంధీ ఏ పదవి తీసుకోలేదన్నారు. రాజీవ్ ప్రధాని ఉన్నప్పుడు సోనియాగాంధీ పదవి తీసుకోలేదన్నారు. తెలంగాణ వస్తే.. నేను నా ముసల్ది ఉంటాం కాపలా కుక్కలెక్క ఉంటా అన్నాడు కానీ.. అధికారంలోకి రాగానే.. కేటీఆర్ మంత్రి.. హరీష్ మంత్రి అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ ని అనడం సరి కాదని.. కుటుంబం అందరికి పదవులు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. సీమాంధ్ర పాలకులు దోపిడీ చేశారు అనేది బీఆర్ఎస్ వాదన అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ..సామాజిక న్యాయం.. సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోవడం సహించలేమన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటం లో ధర్మం ఉందని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. మట్టికి పోయినా ఇంటి వాడు పోవాలని కేసీఆర్ చెప్తారన్నారు. ఆయన చెప్పిన నీళ్లు వచ్చాయా..? పల్లెలకు నిధులు వచ్చాయా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఉద్యమంలో టీజీ అని అనుకున్నామన్నారు. కానీ తెలంగాణా వచ్చాకా టీఎస్ పెట్టుకున్నాడని మండిపడ్డారు.
శబరిమల భక్తులకు TSRTC గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే ఉచిత ప్రయాణం!
ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల తరువాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ముడుపు చెల్లించి దీక్షను విరమిస్తారు. అయితే కేరళ లోని శబరిమలకు వెళ్లేందుకు భక్తులు ప్రయివేట్ బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. కానీ కార్తీక మాసంలో హిందువుల్లో చాలామంది అయ్యప్ప మాలను ధరిస్తారు. కనుక భక్తులందరూ ఆ సమయంలో శబరిమలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. దీనితో చాలా మందికి ట్రైన్ టికెట్లు దొరకవు.. అలాంటి వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ని సంప్రదిస్తారు. ఈ క్రమంలో కార్తీక మాసం సిజన్ కావడం చేత టికెట్ ధర అధికంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం భక్తులు ఎదుర్కునే సమస్యే. అయితే ఈ ఏడాది ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో కరీంనగర్ రీజియన్ రీజినల్ మేనేజర్ ఎన్.సుచరిత మాట్లాడుతూ.. సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ.. టీఎస్ ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చనుందని తెలిపారు. కాగా ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రయాణంలో ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటమనుషులకు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలానే ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని.. అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమీషన్ కూడా ఇస్తామని వెల్లడించారు. కాగా శబరిమలకు వెళ్లే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని.. మరిన్ని వివరాలకు సమీపంలో డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆర్ఎం కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పేదవాడిని పెళ్లి చేసుకున్నందుకే.. నా కూతురిని హత్య చేశా!
తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన మూడో రోజే ఓ యువ జంటను కొందరు అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు అనుమానించిందే నిజమైంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తండ్రే హత్య చేశాడు. పేదవాడిని పెళ్లి చేసుకున్నందుకే తన కుమార్తెను హత్య చేశానని తండ్రి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… తమిళనాడు తూత్తుకూడి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన మారి సెల్వం (24), కార్తిక (20)లు గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండేందుకు.. పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని కార్తిక తన కుటుంబ సభ్యులకు తెలపగా వారు ఒప్పుకోలేదు. సెల్వం తక్కువ కులానికి చెందినవాడని, పేదవాడిని యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న సెల్వం, కార్తిక.. మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయి ఓ గుడిలో వివాహం చేసుుకున్నారు. ఈ విషయం కార్తిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు.
స్పెషల్ పర్సన్‌తో బెస్ట్ ఫీల్డర్ అవార్డు అనౌన్స్‌మెంట్.. శ్రీలంకతో మ్యాచ్‌లో ఎవరంటే?
వన్డే ప్రపంచకప్ 2023లోని ప్రతి మ్యాచ్‌లో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గెలుచుకోగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల శ్రేయస్ గెలుచుకున్నాడు. రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నందుకుగాను శ్రేయస్‌ను ఈ అవార్డు వరించింది. శ్రేయస్ ఈ అవార్డును గెలుచుకోవడం రెండోసారి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ప్రతి మ్యాచ్ అనంతరం సరికొత్త రీతిలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ విన్నర్‌ను అనౌన్స్ చేయించే ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. ఈసారి ఓ స్పెషల్ పర్సన్‌తో అనౌన్స్ చేయించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీడియో కాల్ ద్వారా శ్రేయస్ అయ్యర్‌ను విజేతగా ప్రకటించాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలను కాదని శ్రేయస్ విజేతగా నిలిచాడు. ఇక బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను ప్రకటించడంతో పాటు అద్భుత విజయం సాధించిన భారత జట్టును సచిన్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో రోహిత్ సేన అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గిల్ (92), కోహ్లీ (88), శ్రేయస్ (82) హాఫ్ సెంచరీలు చేశారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుశంక 5 వికెట్స్ తీశాడు. ఆపై శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. కసున్ రజిత (14) టాప్ స్కోరర్. మొహమ్మద్ షమీ 5 వికెట్స్ పడగొట్టాడు.
లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు! షమీ సూపరో సూపర్
వన్డే వరల్డ్‌కప్ 2023లో టీమిండియా సీనియర్ పేసర్ ‘మహ్మద్ షమీ’ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మెగా టోర్నీలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏకంగా 14 వికెట్స్ పడగొట్టాడు. న్యూజీలాండ్, శ్రీలంకలపై ఐదేసి వికెట్స్ పడగొట్టిన షమీ.. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీశాడు. ఈ మూడు మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో జట్టుకు సునాయాస విజయాలు అందించాడు. షమీ బౌలింగ్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘షమీ సూపరో సూపర్’,’లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్ 2023లో టీమిండియా ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో చివరి మూడు మ్యాచ్‌లలో మహమ్మద్ షమీ ఆడాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టు కూర్పులో మార్పులు చేయగా.. షమీకి అవకాశం దక్కింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్స్ పడగొట్టి తాను ఎంత విలువైన బౌలరో చాటిచెప్పాడు. రెండో మ్యాచ్‌లో 4 వికెట్స్ తీసిన షమీ.. మూడో మ్యాచ్‌లో మరోసారి 5 వికెట్స్ పడగొట్టాడు. దాంతో వరల్డ్‌కప్ 2023లో అత్యధిక వికెట్స్ తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్స్ పడగొట్టి ఐదవ స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో దిల్షాన్ మధుశంక (18) ఉన్నాడు. షమీ ఇదే ఫామ్ కొనసాగిస్తే లీగ్ దశ ముగిసే లోపు అగ్రస్థానంలోకి దూసుకొస్తాడు. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ 5 వికెట్స్ పడగొట్టడంతో ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లలో 45 వికెట్లతో మాజీ పేసర్లు జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్‌లను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ తరపున ప్రపంచకప్‌లో జహీర్, శ్రీనాథ్ చెరో 44 వికెట్లు తీశారు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ (71) ఉన్నాడు.
AI రూపొందించిన పాస్తా నగర చిత్రాలను చూశారా? వావ్ అద్భుతమే..
టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇటీవల బాగా వినిపిస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ ఇప్పటికే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.. సేవలు అందుబాటులోకి వచ్చాక వింత వింత పోకడలు వైరల్ అవుతున్నాయి. ఏఐ రూపొందించిన ఫోటోలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. అలా మాయ చేస్తోందీ చాట్ జీపీటీ. దీని వినియోగం ఓ ట్రెండ్ గా మారిపోయింది.. దీంట్లో పాస్తా తో నిర్మించిన నగరం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పాస్తాతో కప్పబడిన నగర దృశ్యం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? కాకపోతే, ఈ AI-సృష్టించిన చిత్రాలు మీకు ఒక సంగ్రహావలోకనం ఇస్తాయి కాబట్టి మీరు ట్రీట్‌లో ఉన్నారు. కొందరు పాస్తాలో సాస్‌ను జోడించాలని కోరుకుంటే, మరికొందరు నగరంలోని ఇళ్లలో ఒకదానిలోకి మారడానికి ఆసక్తిగా ఉన్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌కు పాస్తా మాత్రమే నగరాన్ని స్వాధీనం చేసుకోగలిగితే అని శీర్షిక చదువుతుంది. చిత్రాలు స్పఘెట్టి నుండి లింగ్విన్ వరకు, ఫెటుక్సిన్ నుండి ట్యాగ్లియాటెల్ వరకు మరియు అనేక ఇతర పాస్తా యొక్క విభిన్న వైవిధ్యాలతో కప్పబడిన గృహాలను ప్రదర్శిస్తాయి. పోస్ట్‌లో కేథడ్రల్ లాంటి నిర్మాణం మరియు పాస్తాతో కప్పబడిన కారు కూడా ఉన్నాయి..
బ్రేకింగ్ న్యూస్..రోడ్డు మీద ఉర్ఫి జావేద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..
ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ మరియు డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా అందరికీ సపరచితమే.. హౌస్ లో తన బోల్డ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది… అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ముంబై పోలీసులు ఈ అమ్మడుకు షాక్ ఇచ్చారు.. నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు.. చిత్రచిత్రాల డ్రెస్సులు, రకరకాల వస్తువులతో డ్రెస్సులు, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు వేస్తూ బాగా ఫేమస్ అయింది. అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకుంటూ మిగతా శరీరం అంతా కనపడేలా చాలా బోల్డ్ గా బట్టలు వేసుకొని ఫోటో షూట్ చెయ్యడంతో పాటుగా అలాగే బయటకు వస్తుంది.. జనాలు ఆమెను ఒక వింతగా చూస్తుంటారు..అలా వైరల్ అవ్వడంతో పాటు వివాదాల్లో కూడా నిలిచింది ఉర్ఫీ. ఉర్ఫి జావేద్ విచిత్ర బోల్డ్ వేషధారణతో పలువురికి ఇబ్బంది కలుగుతున్నా, ఆమెని హెచ్చరించినా, ఆమెపై పోలీసు కేసులు పెట్టినా తాను మాత్రం మారట్లేదు. రోజురోజుకి తన డ్రెస్సింగ్ తో పాటు, తన సోషల్ మీడియా పోస్టులతో వివాదాల్లో, వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా ఓ కొత్త రకం డ్రెస్ వేసుకొని పొద్దున్నే కాఫీ తాగడానికి బయటకి వచ్చింది ఉర్ఫి. బాటమ్ జీన్స్, టాప్ బ్యాక్ మొత్తం కనపడేలా కేవలం ఫ్రంట్ కవర్ అయ్యేలా ఓ లవ్ షేప్ క్లాత్ కట్టుకొని వచ్చింది. అయితే ఏమైందో తెలీదు కానీ కొంతమంది ముంబై మహిళా పోలీసులు రోడ్డు మీదనే ఆమెకు, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..