పవన్ డెడ్‌లైన్..! మరో నెల రోజులు వెయిట్ చేస్తాం..!
అన్నమయ్య డ్యాం బాధితుల ఇళ్ల నిర్మాణంపై పోరాటం విషయంలో జనసేన పార్టీ మరో నెల రోజుల పాటు వెయిట్ చేస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అన్నమయ్య డ్యాం బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం చేస్తామంటూ అధికారులు చేసిన ప్రకటన పై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.. అన్నమయ డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డా ఆయన.. అధికారులవి కంటితుడుపు చర్యలేనని భావిస్తున్నాను.. అధికారులు చెప్పిన విధంగా అన్నమయ్య డ్యాం బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడతారో..? లేదో చూస్తాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు తమ నిబద్ధతను ఎంత వరకు చాటుకుంటారో చూస్తాం.. అన్నమయ్య డ్యాం బాధితుల ఇళ్ల నిర్మాణంపై పోరాటం విషయంలో మరో నెల రోజులు వెయిట్ చేస్తామని తన ట్వీట్‌లో పేర్కొన్నారు పవన్ కల్యాణ్. కాగా, అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్‌నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి 18 నెలలు.. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే.. కేంద్ర జలవనురుల శాఖ మంత్రి శకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు.. అంటూ గత ట్వీట్లలో పవన్ కల్యాణ్ ప్రస్తావించిన విషయం విదితమే.
మా హయంలోనే విజయనగరం అభివృద్ధి.. అందరికీ తెలుసు..
విజయనగరంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అశోక్ గజపతిరాజు చిప్ ట్రిక్స్ మానుకోవాలి అంటూ.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతపై మండిపడ్డారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిజంగా పూలే విగ్రహానికి దండ వేయాలని అనుకుంటే ముందు రోజే మాకు తెలియజేస్తే మేమే తాళం తీయిస్తాం కదా? అని ప్రశ్నించారు. ఇటీవల వాటర్ ఫౌంటైన్ సుందరికారణ చేశాం.. ఎవరూ పాడుచేయకూడదు అనే తాళం వేయడం జరిగిందన్న ఆయన.. కానీ, మీరు ఎటువంటి సమాచారం లేకుండా గేటుకి దండ వేసి వెళ్లిపోయారు.. దీనిని రాజకీయంగా వాడుకోవాలి అని అనుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మహనీయులు పట్ల మీకంటే మాకే గౌరవం ఎక్కువగా ఉందన్నారు కోలగట్ల.. మహనీయులకి మేం ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది పట్టణం అంత కనిపిస్తుందన్నారు.. ఐస్ ఫ్యాక్టరీ జుంక్షన్ లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడే బ్రాందీ షాప్ తీసేస్తాం అని చెప్పడం జరిగింది. ఇప్పటికే బ్రాందీ షాప్ వేరే చోటుకు మార్చేశాం అనే సంగతి కూడా మీకు తెలియకపోవడం విడ్డూరం అని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకండి.. మీరు ఒక్కరే సమాజానికి మార్గదర్శకులు అయిన్నట్టు మాట్లాడవద్దు.. మీరు ఒక్కరే నిజాయితీ కాదు ఇక్కడ అందరం నిజాయితీ గానే సేవ చేస్తున్న విషయం గ్రహించాలని అని హితవుపలికారు.. ఇక, మీ హయంలో కంటే మా హయంలోనే విజయనగరం అభివృద్ధి అయ్యిందని.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.
నిలకడగా భట్టి విక్రమార్క ఆరోగ్యం.. సాధారణ స్థితికి బీపీ, షుగర్ లెవెల్స్
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చెర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామంలోని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ పరీక్షించారు. స్వల్ప అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం రుక్కంపేటలో ఈనెల 18న (గురువారం) భట్టి అస్వస్థతకు గురయ్యారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పరదేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ అదే గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లో భట్టి విక్రమార్క ఆరోగ్యాన్ని పరిశీలించారు. తీవ్రమైన ఎండలు, వందల కిలోమీటర్లు పరిగెత్తడంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని వైద్యులు నిర్ధారించారు. వడదెబ్బకు గురైనట్లు నిర్ధారణ అయింది. ఈరోజు ఉదయం కూడా షుగర్ లెవెల్స్, బీపీ, ఫ్లూయిడ్స్ చెక్ చేశారు. సన్‌బర్న్ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది కాబట్టి తగినంత విశ్రాంతి మరియు ద్రవాలు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. డీహైడ్రేషన్ పూర్తిగా తగ్గే వరకు ఎండలో నడవవద్దని వైద్యులు భట్టి విక్రమార్కకు సూచించారు.
రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో వారికి మాత్రమే నష్టం..!
సర్క్యూలేషన్ లో వున్న రూ.2 వేల నోటును ఉపసంహంచుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.. దీంతో, సామాన్యుల్లో గందరగోళం మొదలైంది. 2 వేల నోట్లు బ్యాంకులకు ఇస్తే ఏమవుతుందోనంటూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు.. ఇది ఎవరికి లాభం..? మరెవరికి నష్టం? అనే చర్చ సాగుతోంది.. అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.. డబ్బులు ఆశ చూపించి ఓట్లు కొనుక్కుందామని చూసే పార్టీలకు నోట్ల రద్దుతో గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయన్నారు.. ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజాస్వామ్యం పర్యవేక్షణ సాధ్యమన్న ఆయన.. బ్లాక్ మనీ ఉన్న వాళ్లకు తప్ప.. రెండు వేల నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులకు నష్టం లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటుకు రెండు వేల రూపాయలు పంచిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు విష్ణుకుమార్ రాజు.. పెద్దనోట్ల వల్ల ఎదురయ్యే సమస్యలు గుర్తించే నేను ఆర్బీఐకి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు.. ఇక, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నోట్లు చెలామణీకి ప్రయత్నాలు జరుగుతాయి. లిక్కర్ షాపుల్లో 2వేల రూపాయల చెలామణిపై వ్యవస్థలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.. మరోవైపు.. నేను పార్టీ మారుతున్నాననే ప్రచారం రాజకీయ కుట్రగా అభివర్ణించారు విష్ణుకుమార్ రాజు.. పొత్తులు నిర్ణయించే ది కేంద్ర నాయకత్వమని స్పష్టం చేసిన ఆయన.. నా అభిప్రాయం విస్పష్టంగానే చెప్పానని తెలిపారు.
కేసు నుండి తప్పిస్తా.. నాకు రెండు లక్షలివ్వాలి
నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారమ్మగూడెంలో గత 30న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మునగాల పద్మా ఫిర్యాదు మేరకు దుబ్బాకుల రాంరెడ్డి, దుబ్బాకుల కుశలవ రెడ్డి, వేముల సిద్దార్దరెడ్డిలపై నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై 354, 326, 504, 506, R/w 34 IPC సెక్షన్ ల కింద కేసు నమోదు.. A-2,A-3 లు కుశలవ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి లకు,జరిగిన ఘర్షణతో సంబంధం లేదని.. A-1 దుబ్బాకుల రామ్ రెడ్డి కొడుకు పురుషోత్తం రెడ్డి అలియాస్ రెక్కిరెడ్డి(ఇతను అమెరికాలో ఉంటున్నాడు) నిడమనూరు ఎస్ఐ శోభన్ బాబుకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అలుసుగా భావించిన ఎస్సై శోభన్ అలియాస్ రీక్కిరెడ్డితో వాట్సాప్ చాట్ చేశాడు. A-2, A-3 లను తప్పించడానికి రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రెండు లక్షల ఇవ్వలేనని 10 లేదా 20 వేలు ఇస్తానని అన్నాడు. దీంతో ముష్టి వేస్తున్నావా అంటూ వాట్సప్ చాట్ లో రిక్కిరెడ్డితో చాట్ చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అడిగినంత ఇవ్వలేదని నేరం చేయని A-2, A-3 లను కేసులో ఇరికించారని బందువుల ఆరోపిస్తున్నారు. కేసు నుండి తప్పించడానికి నల్గొండ జిల్లా నిడమానూరు ఎస్సై శోభన్ బాబు 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వాట్సప్ చాట్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 20వేలు ఇస్తా అని బాధితుల తరుపున అమెరికాలో ఉన్న పురుషోత్తమ్ రెడ్డి కమిట్మెంట్ ఇచ్చినా ససేమిరా అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షన్నర ఇవ్వాల్సిందే అని ఎస్సై డిమాండ్ చేశాడని వాపోయారు. A-1 దుబ్బాకుల రామ్ రెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి అలియాస్ రిక్కి రెడ్డి తో ఎస్సై వాట్సప్ చాట్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సై తన డిపార్ట్మెంట్ నెంబర్ 87126….. తో USA లో ఉన్న బాధితుడి కొడుకు +1(646)934…. రెక్కిరెడ్డి తో చాట్ చేసినట్లు వాట్సప్ చాట్ బయపటడింది.
ఏడాదిలోగా సిద్ధు ప్రభుత్వం పడిపోతుంది
సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక సీఎం అయ్యారు. ఆయన శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొన్ని గంటల తర్వాత సిద్ధరామయ్య బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం పనికిరాదన్నారు. సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. కర్ణాటకలో ఏడాదిలోగా ప్రభుత్వం పడిపోతుందని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక గ్రాంట్ రూ.5495 కోట్లు ఇంకా విడుదల కాలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికలో ఈ మంజూరుకు సిఫారసు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీపై కూడా విరుచుకుపడ్డారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో సిద్ధరామయ్య తన ఐదు వాగ్దానాలకు ఆమోదముద్ర వేశారు. అధికార పార్టీ ప్రకటనలకు, ఎన్నికల వాగ్దానాలకు మధ్య భారీ అంతరం ఉందని బీజేపీ ఆరోపించింది. మాజీ సీఎం బొమ్మై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలకు, తొలి మంత్రివర్గం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటనలకు చాలా తేడా ఉందన్నారు. ఈ ప్రకటనల నుండి ప్రజలు అత్యవసరమని ఆశించారని ఆయన అన్నారు. కొందరు మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ నేటి ప్రకటనలు ప్రజలను నిరాశకు గురిచేశాయి.
రూ.2వేల నోటు రద్దు..షేర్ మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతుంది ?
సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోటును రద్దు చేసింది. ఈ పింక్ నోటుపై గతేడాది నుంచి పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ పుకార్లకు స్వస్తి పలికింది. 19 మే 2023న, శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా రూ.2000 నోటును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 2000 రూపాయల నోట్ల మార్పిడి మే 23 నుంచి ప్రారంభం కానుంది. పౌరులు మళ్లీ బ్యాంకుల ముందు గుమిగూడారు. పౌరులు ఒకేసారి 2000 రూపాయల 10 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. అయితే ఈ డీమోనిటైజేషన్ షేర్ మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతుంది, పెట్టుబడిదారులను ప్రభావితం చేయవచ్చా? దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.. నిపుణులు ఏమంటున్నారంటే.. నోట్ల రద్దు తర్వాత 2017లో ఆర్‌బీఐ రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ప్రింటింగ్ అథారిటీ లిమిటెడ్ నోట్ల రద్దుకు కొన్ని నెలల ముందు రూ.2000 నోట్లను ముద్రించడం ప్రారంభించింది. ఆ సమయంలో 500 రూపాయల నోటు ఇంకా ముద్రించలేదు. RBI సర్క్యులర్ ప్రకారం..రూ 2000 నోట్లను 23 మే 2023 నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు మార్చుకోవచ్చు. ఈ పరిమితి ఒక రోజులో 20 వేల రూపాయల వరకు ఉంటుంది. అంటే పౌరులు 127 రోజుల్లో 25,40,000 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు.
రూ.2వేల నోటు రద్దుతో సమస్య ఎవరికి ?
మామూలు జనం రూ.2వేల నోటు చూసి చాలా కాలమైంది. అసలు చూద్దామంటే ఒక్క నోటేలేదంటే కట్టలెక్కడుంటాయి. అంటే, సామాన్య జనం దగ్గర ఒక్క నోటూ లేదు. ఏటీఎంలలో రావటం మానేసి చాలా ఏళ్లైంది. యూపీఐ ట్రాన్సాక్షన్లకు జనం అలవాటు పడ్డారు. క్యాష్ అవసరమైతే వంద, ఐదొందలు నోట్లు వాడుతున్నారు. రూ.2వేల నోటు అప్పుడెప్పుడో 2016 తర్వాత కొద్ది రోజులు కనిపించి అలా మెరుపుతీగలా మాయమైంది. రూ.2వేల నోటు మార్కెట్‌లో చలామణిలో కనిపించటం లేదూ అంటే.. అసలు లేదని కాదు.. దేశంలో 3.62లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. అవన్నీ జనం దగ్గరే ఉన్నాయి. కానీ, బయటకు రావటం లేదు. ఎవరో దాచేశారు. ఎక్కడో దాచేశారు. దేనికోసమో దాచేశారు. అదే ఇప్పుడు బ్యాన్ అయింది. ఒకవేళ సామాన్య జనం దగ్గర ఐదు, పది రూ.2వేల నోట్లున్నా వాటిని మార్చుకోవటంలో ఎలాంటి కష్టం లేదు. వాళ్లకు ఎంత ఆదాయం వస్తుంది? ఆస్తులెంత? అప్పులెన్ని అన్నీ పద్ధతిగానే రికార్డయి ఉంటాయి కాబట్టి.. పాన్ కార్డ్, ఆధార్ లాంటి అనేకానేక గుర్తింపు కార్డులతో కెవైసీలు పూర్తయి ఉంటాయి కాబట్టి వాళ్లంతా నోట్లు మార్చుకోవటంలో పెద్ద కష్టం లేదు. బ్యాంకు దగ్గరకు ఒకటి రెండు సార్లు వెళ్లాలనేదొక్కటే కాస్త చిరాకు పెట్టే విషయం. కానీ, అసలు విషయం ఇప్పుడా రూ.2వేల నోట్లు ఎక్కడున్నాయి అనే. నోటు రద్దు ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుంది అనే. దేశంలో నూటికి 90మంది సామాన్యులే. అంటే నెలజీతంపై ఆధారపడి బతికేవాళ్ల నుండి రోజు వారి వేతనం తీసుకునే కార్మికుల వరకు.. వీళ్లెవరి దగ్గరా భారీ ఎత్తున రూ.2వేల నోట్లు పోగై ఉండే ఛాన్సు లేదు. ఐదు పది ఉన్నా చిక్కు లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర రూ.2 వేల కట్టలున్నాయో వాళ్లకే ఇప్పుడు సమస్య. వాళ్లంతా చట్ట ప్రకారం సంపాదించి దాచుకున్న సొమ్మైతే ఏ గొడవా లేదు. తగిన ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. కానీ, లెక్కకు రాని సొమ్మై ఉంటే వాటిని చిత్తు కాగితాల్లో కలుపుకోవటం తప్ప చేయగలిగిందేం ఉండదు.
రూ.2 వేల నోట్లపై కొత్త టెన్షన్.. బ్యాంకులో వేస్తే ఐటీ వాళ్లు పట్టుకుంటారా?
సర్క్యూలేషన్ లో వున్న రెండు వేల నోటును ఉపసంహంచుకుంటున్నట్టు ఆర్బీఐ చేసిన ప్రకటనతో సామాన్యుల్లో గందరగోళం మొదలైంది. 2 వేల నోట్లు బ్యాంకులకు ఇస్తే ఏమవుతుందోనంటూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కానీ, సాధారణ జనం, టెన్షన్ పడాల్సిన అవసరంలేదంటున్నారు నిపుణులు. వాస్తవానికి సామాన్యుల దగ్గర రెండు వేల నోట్లు లేవు. ఉన్నా కూడా ఎన్నొకొన్ని మాత్రమే వుంటాయి. తమ దగ్గర 2 వేల నోట్లున్నవారు అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా మార్చుకోవచ్చు. ఒక బ్రాంచీలో ఒకసారి పది నోట్లు.. అంటే 20 వేల వరకు మార్చుకోవడానికి అవకాశం వుంటుంది. డిపాజిట్లపై ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని నోట్లయినా వేసుకుని, విత్ డ్రా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఈ సదుపాయం వుంది. అంతవరకు లీగల్ టెండర్ గానూ అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఐటీవాళ్లు పట్టుకుంటారన్న భయం అవసరం లేదు. రెండు వేల నోటు ఉపసంహరణతో సామాన్యులకు వచ్చిన ఇబ్బందేమీలేదు. సమస్య ఏమైనా వుంటే, అది బడాబడా బాబులకు, అక్రమార్కులకు మాత్రమే. నల్లధనానికి కేరాఫ్ అడ్రసయిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల నేలమాళిగల్లో గుర్రుమని నిద్రపోతున్నాయి. ట్యాక్స్ ఎగవేత వ్యాపారాల్లోనే మెరుస్తోంది 2 వేల నోటు. భారీగా 2వేల నోట్లను దాచిపెట్టుకున్న కొందరు రాజకీయ, సినీ ప్రముఖులకు ఇబ్బంది తప్పదు. తక్కువ నోట్లతో ఎక్కువ మొత్తం పోగేసుకోవడానికి 2 వేల నోట్లను ఇలాంటి సంపన్నులే వినియోగించారు. ఇలాంటి వారిదగ్గరే పెద్ద నోట్లు బ్లాక్ అయ్యాయి. దీంతో నోట్ల మార్పిడిలో వీరు ప్రతిపైసాకు లెక్క చెప్పాలి. గడువు దాటిన తర్వాత వారిదగ్గరున్న రెండు వేల నోట్లు చిత్తు కాగితాల్లాగే మిగిలిపోతాయంటున్నారు ఆర్థిక నిపుణులు. కాబట్టి, రెండు వేల నోటు పెద్దగాలేని సామాన్యులకు ఈ పరిణామం సమస్య కాబోదని చెబుతున్నారు.
నిలకడగా భట్టి విక్రమార్క ఆరోగ్యం.. సాధారణ స్థితికి బీపీ, షుగర్ లెవెల్స్
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చెర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామంలోని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ పరీక్షించారు. స్వల్ప అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం రుక్కంపేటలో ఈనెల 18న (గురువారం) భట్టి అస్వస్థతకు గురయ్యారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పరదేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ అదే గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లో భట్టి విక్రమార్క ఆరోగ్యాన్ని పరిశీలించారు. తీవ్రమైన ఎండలు, వందల కిలోమీటర్లు పరిగెత్తడంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని వైద్యులు నిర్ధారించారు. వడదెబ్బకు గురైనట్లు నిర్ధారణ అయింది. ఈరోజు ఉదయం కూడా షుగర్ లెవెల్స్, బీపీ, ఫ్లూయిడ్స్ చెక్ చేశారు. సన్‌బర్న్ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది కాబట్టి తగినంత విశ్రాంతి మరియు ద్రవాలు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. డీహైడ్రేషన్ పూర్తిగా తగ్గే వరకు ఎండలో నడవవద్దని వైద్యులు భట్టి విక్రమార్కకు సూచించారు.
లాల్ సినిమా కోసం రంగంలోకి దిగిన సలార్ ప్రొడ్యూసర్స్
మలయాళ సూపర్ స్టార్, టు టైమ్ నేషనల్ అవార్డు విన్నర్ మోహన్ లాల్ అకా లాలెట్టన్ బర్త్ డేని సినీ అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలు గడిచినా, యంగ్ హీరోలు వచ్చి సూపర్ హిట్స్ కొడుతున్నా… ఫేస్ ఆఫ్ మలయాళ సినిమాగా మోహన్ లాల్ స్థానం చెక్కు చెదరకుండా ఉంది. కంప్లీట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితం అయిన నటుడు కాదు. తెలుగు తమిళ భాషల్లో కూడా మోహన్ లాల్ కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రకి అయినా జస్ట్ కాళ్లతోనే ఎమోషన్ ని ప్రెజెంట్ చెయ్యగల మోహన్ లాల్ 62 ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ మూడు సినిమాలని చేస్తున్నాడు. ఇందులో లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘ఎంపురాన్’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది, అందుకే ఎంపురాన్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లూసిఫర్ సినిమాని మలయాళ మార్కెట్ కే పరిమితం చేసిన మేకర్స్, ఎంపురాన్ సినిమాని బౌండరీలు దాటిస్తూ హోంబలే ఫిల్మ్స్ తో కోలాబోరేట్ అయ్యారు. హోంబలే బ్రాండ్ తో ఎంపురాన్ ని పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాలి అనేది పృథ్వీరాజ్ ప్లాన్. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఈరోజు మోహన్ లాల్ పుట్టిన రోజు కావడంతో ఎంపురాన్ నుంచి స్పెషల్ విషెస్ పోస్టర్ బయటకి వచ్చింది. రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ‘జైలర్’ సినిమా నుంచి కూడా మోహన్ లాల్ బర్త్ స్పెషల్ వీడియో బయటకి వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా జైలర్ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీతో ముగ్గురు సూపర్ స్టార్ లని ఒకే ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దొరుకుతుంది.