తాజాగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు ఓసారి చూద్దామా..
also read: Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల ట్రాన్స్‌జెండర్ ఓటర్లు.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే?
ఈ లిస్టులో మొదటగా నర్సీపట్నం సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పూరీ జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమా శంకర్ గణేష్ మరోసారి అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలకి నిర్మాతగా పేరుపొందిన ఎంవీబీ సత్యనారాయణ ఇదివరకు వైజాగ్ ఎంపీగా పనిచేశారు. ఈసారి విశాఖపట్నం ఈస్ట్ నుంచి పోటీలో దిగుతున్నారు. అలాగే సినీ దర్శకుడు కురసాల కళ్యాణ్ కృష్ణ అన్న ఇదివరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోసారి ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. ఒక సినిమాలో హీరోగా నటించిన మర్గాని భరత్ రామ్ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా కొనసాగుతున్నారు. కాకపోతే ఈసారి రాజమండ్రి రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమంలో పలు సినిమాలకు నిర్మాతగా వహించిన కొడాలి నాని ప్రస్తుతం గుడివాడ ప్రాంతానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోసారి మళ్లీ అదే స్థానం నుండి తిరిగి పోటీ చేయనున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలు అనేక సినిమాలకు నిర్మాతగా వహించిన వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న.. మరోసారి అదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు.
Also Read: Tillu Square : మళ్లీ లవ్ లో ఫెయిలైన టిల్లు..?
ఇక ఈ లిస్టులో సినీ రచయిత కోన వెంకట్ బాబాయ్ అయిన కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన మరోసారి అదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన హీరో కమలాకర్ రెడ్డి సోదరుడైన బాచుపల్లి శివప్రసాద్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండగా.. ఈసారి దర్శి నుంచి పోటీ చేయనున్నారు. ఇక వైసిపి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి., హీరోయిన్ ఆర్కే రోజా. ప్రస్తుతం ఈమె నగరి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరోసారి అక్కడే నుంచే పోటీ చేయనున్నారు. ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు.