నాగ చైతన్య సినిమా జోష్ తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితమే నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు అంటూ వచ్చి.. భారీ హిట్ అందుకున్నాడు జొన్నలగడ్డ . ఆ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. కేవలం ఇక్కడమాత్రమే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షల్స్ ను రాబట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ సినిమా వస్తోన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మార్చి29న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది. ఇందులో భాగంగానే ఇదివరకే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
Also read: Election Commission: “రెడ్ లైన్ క్రాస్ చేయొద్దు”.. పొలిటికల్ పార్టీలకు ఈసీ వార్నింగ్..
మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ మాత్రం యూత్ ఫుల్ కంటెంట్ తో అదరకొట్టింది. ట్రైలర్ ను చూస్తే.. మొదటి పార్ట్ కంటే కూడా డబుల్ డోస్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ట్రైలర్ లో ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డల మధ్య జరిగే కెమిస్ట్రీ అదిరిపోయింది. వీటికితోడు అనేక కామెడీ సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి థియేటర్స్ లో సినిమా ఎలా ఆకట్టుకుంటుందో. ఈ సినిమా సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై విడుదల కాబోతుంది.
Also read: Odisha Assembly Polls: ఒడిశాలో 4 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. షెడ్యూల్ ఇదే..
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రాధిక సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మార్చి 18 మరోసారి ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ‘ ఓ మై లిల్లీ ‘ అంటూ సాగే పాటను మార్చి 18 హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించే ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను ప్రముఖ గాయకుడు శ్రీరామ్ చంద్ర పాడినట్లు తెలుస్తోంది. ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే జొన్నలగడ్డకి ఈ పాట ఏ మాత్రం సూట్ అవుతుందో చూడాలిమరి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న భారీగా విడుదలకానుంది. తాజాగా ‘ ఓ మై లిల్లీ ‘ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.