మగవారికి గడ్డం ఉంటే అందంగా, హ్యాండ్ సమ్ గా ఉంటారు. ఎక్కువగా మహిళలు కూడా మగవారి గడ్డాన్ని చూసి ఇష్టపడతారు. కొందరి మగాళ్లలో భారీ గడ్డం, మరికొందరిలో పలుచగా గడ్డం ఉంటుంది. ఇంకొందరికి గడ్డం సరిగా పెరగదు. అయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గడ్డం బాగా పెరుగుతుందో తెలుసుకోవాలి. కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా గడ్డం పెరగదు. దీంతో మార్కెట్లో దొరికే ఏవేవో ఆయిల్స్, క్రీమ్స్ రాస్తుంటారు. అలా రాసినా గడ్డం పెరగదు. అలాంటప్పుడు కారణాలు, పరిష్కారాలు తెలుసుకోవాలి.
Yash: రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా
గడ్డం బాగా పెరగడానికి మార్కటెల్లో చాలా ఖరీదైన నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిని కొని వాడడటమే కాకుండా.. కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ కూడా చేయాలి. అవేంటంటే.. పోషకాలు ఎక్కువగా ఉండే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల తల జుట్టే కాదు. గడ్డం కూడా ఊడిపోతుంది. అంతేకాకుండా తగినంత నిద్ర కూడా అవసరం. మంచి నిద్ర అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సిగరెట్ తాగడం కూడా తగ్గించాలి. ఇలా చేస్తే గడ్డం పెరిగేందుకు అవకాశాలున్నాయి.
కొందరికి ఒత్తుగా గడ్డం ఉంటుంది. అలా ఉండటానికి కారణమేంటంటే.. జన్యువులు గడ్డం పెంచడానికి కీ రోల్ పోషిస్తాయి. మీ కుటుంబంలో ఎవరికైనా, తాత, తండ్రులకి మందపాటి గడ్డం ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ శరీరంలోని 5 ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఆండ్రోజెన్ హార్మోన్ టెస్టోస్టెరాన్‌ని డైహైడ్రోటెస్టోస్టెరాన్(DHT) అని పిలిచే మరో హార్మోన్‌గా మారుస్తుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరికి గడ్డం రాకపోతే మీరు కూడా గడ్డం పెంచే అవకాశం లేదు.
Hair Oil: మీ నల్లని జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండిలా..!
బలమైన, మందపాటి గడ్డం పెరుగుదలలో వయస్సు కూడా ముఖ్యమైన అంశం. 30 ఏళ్ళ వయస్సు ఉన్నవారికి మగవారికి ముఖం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 20 నుంచి 30 ఏళ్ళ మధ్య పెరిగే వెంట్రుకల కాస్తా పలుచగా ఉంటాయి. దీని మందం వయస్సుతో పెరుగుతుంది. అంతేకాకుండా తక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు కూడా గడ్డం పెరగకుండా చేస్తాయి. ఏదైనా ఇతర కారణాల వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు వైద్యపరంగా తక్కువగా ఉంటే, అది జుట్టు పెరుగుదలని ఎఫెక్ట్ చేయదు.