Yash: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యష్ జీవితాన్ని మార్చేసింది. కెజిఎఫ్ సినిమాతో హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రపంచమంతా యష్ నామజపం చేసేలా చేసింది. ఇక ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఈ హీరో తన తదుపరి సినిమాను ప్రకటించిందే లేదు. సాధారణంగా పాన్ ఇండియా మూవీ హిట్ పడగానే మరో పాన్ ఇండియా మూవీని వెంటనే చేయాలనీ అనుకుంటారు హీరోలు. కానీ, యష్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సమయం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ, కెజిఎఫ్ ను మించి సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సమయాన్ని యష్.. కుటుంబంతో గడపడానికి కేటాయించాడు. తన పిల్లలతో ఆడుతూ నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు.
Pawan Kalyan: అబ్బా.. ఏమున్నాడురా బాబు
ఇక తాజాగా యష్ వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈసారి కుటుంబంతో కాకుండా ఒక్కడే ఫొటోల్లో కనిపించి మెప్పించాడు. విమానంలో ఒక్కడే రాయల్ గా కూర్చున్న లుక్ ఆకట్టుకొంటుంది. అంతేకాకుండా.. బ్లూ కలర్ సూట్ లో యష్ అభిమానులకు హాయ్ చెప్తున్న ఫోటో అయితే అదరగొట్టేసింది. రాఖీ భాయ్ మళ్లీ తిరిగివచ్చినట్లుంది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు సైతం ఈ ఫోటోలపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా అంటూ పొగిడేస్తున్నారు. మరి యాష్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.