Ambati Rambabu: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై "మైడియర్ డాడీ" అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు.. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు.. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు…
GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపే (మార్చి 10వ తేదీ) నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా.. జనసేన, బీజేపీకి ఒక్కో సీటు ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన స్థానాలకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. 8,9 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో అవకాశం లేదు.
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే ఎల్లంపల్లి నుంచి నీరు పొదుపుగా వాడుకొని పెద్ద ఎత్తున వరి పంట పండించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఉంటే ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఆయన సూచించారు.
జలదంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద్ద పెంచలయ్య సారథ్యం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.