Tirumala: టీటీడీ ఈవో కీలక నిర్ణయం.. ఇక వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీడీడీ ఈవో ధర్మారెడ్డి తెలపారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో.. ఫోన్ లైన్లో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
సుప్రభాత సేవ విచక్షణ కోటాను రద్దు చేశామని.. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతారని అన్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని ఈ విషయాన్ని భక్తులు మర్చిపోవద్దని ఈవో విజ్ఞప్తి చేసారు. వేదాల్లోని దాదాపు 190 అంశాలను భావితరాలకు అందించేందుకు శ్రీవేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రాజెక్టు అంశాలను ‘భారతీయ విజ్ఞానదాన’ పేరుతో సోషల్‌మీడియా, ఎస్వీబీసీల ద్వారా పది నిమిషాల వీడియో ప్రసారాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల విలువైన పదెకరాల భూమిని తితిదేకు కేటాయించిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేమండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్లు వెచ్చించనున్నారని తెలిపారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సామాన్లు బయట పడేసిన సిబ్బంది
టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించిందని ఈవో చెప్పారు. ఆభూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈనెల 3 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. 8న జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,434 మంది భక్తులు దర్శించుకోగా.. 39,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చింది.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!