వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీడీడీ ఈవో ధర్మారెడ్డి తెలపారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని ఆయన చెప్పారు.