కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు. దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి…
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీడీడీ ఈవో ధర్మారెడ్డి తెలపారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని ఆయన చెప్పారు.
TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 ఎకరాల స్థలంలో కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విధానంతో దళారీ వ్యవస్థను…
Tirumala: మరో 35 రోజుల్లో నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్‌లైన్‌లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల…
ఇటీవల కాలంలో తిరుమలకు భక్తుల రాక విపరీతంగా పెరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకోని భక్తులు ప్రస్తుతం తిరుమల బాట పడుతున్నారు. తమకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వీకెండ్లలోనే కాకుండా వీక్ డేస్‌లోనూ తిరుమల కొండ రద్దీగా కనిపిస్తోంది. అటు సెప్టెంబర్ నెలలో భక్తులు, ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. గత నెలలో మొత్తం 21.12 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపింది. శ్రీవారి హుండీకి రూ.122.19 కోట్ల…
Tirumala: తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం పలు కార్యాలయాలతో పాటు వసతి గృహాలు, గెస్ట్ హౌస్‌లు, క్యూ క్లాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్‌లు, వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే తిరుమల వెళ్లే భక్తులు వీటికి వెళ్లే మార్గాలు తెలియక తికమక పడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం టీటీడీ తిరుమల మార్గదర్శిని పేరుతో ఓ క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కొండపై ఒకచోటు నుంచి మరోచోటుకు సులభంగా వెళ్లేలా ఈ క్యూఆర్ కోడ్ సహాయం…
Tirumala Tirupati Devastanam: తిరుమలలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే అన్నదానం పేరుతో పలువురు భక్తులు భారీ స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. కానీ కొందరు ప్రైవేట్ సంస్థలకు విరాళాలు అందిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు…
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.…