సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్ మరియు టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.అయితే ఈ సిరీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 .రీసెంట్ గా రిలీజైన టైగర్-3 గ్లింప్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో తన ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి గా ముద్ర వేస్తే..తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరడం, అంతవరకు దేశం కోసం తాను పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం వంటి డైలాగ్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది.. ఈ సారి ఒక్క యాక్షన్ మాత్రమే కాదు.. స్టోరీ కూడా ఎంతో సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
కాగా తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ను ప్రకటించారు.ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.. యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కు సిద్ధం అయింది..ఈ సినిమా హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా ఒకే సారి విడుదల కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాలు హిందీలో భారీ వసూళ్లు రాబడుతున్న వేళ హిందీ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా భారీ వసూళ్ళు రాబట్టేందుకు టైగర్ 3 సినిమాతో సిద్ధం అవుతున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..