ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి.. సుప్రీంకోర్టులో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 34 కాగా, అందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.