Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాదే శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక వీరి పెళ్లి అయ్యి దాదాపు నాలుగు నెలలు అయ్యింది. ఇక దీంతో సోషల్ మీడియాలో వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతిఅని చెప్పుకొస్తున్నారు. రక్షిత అమెరికాలో టెక్కీగా వర్క్ చేస్తోంది. పెళ్లి తరువాత ఆమె తన వర్క్ కోసం అక్కడికి వెళ్ళింది. సినిమాలు షూటింగ్ ఉండడం వలన శర్వా ఇక్కడే ఉండిపోయాడు.
Satyam Rajesh: పొలిమేర ఎఫెక్ట్.. హీరోగా మరో సినిమా ఓకే చేసిన కమెడియన్
ఇక ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న రక్షిత గర్భిణీ అని, మెడికల్ చెకప్స్‌తో పాటు డెలివరీ కూడా అక్కడే జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భార్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో శర్వా వెంటనే అమెరికాకు పయనమయ్యాడని, వీలైతే రక్షితను ఇండియాకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. ఇక ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ, ఈ వార్త తెలియడంతో అభిమానులు శర్వాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది నిజమైతే.. అధికారికంగా ప్రకటిస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పుకొస్తున్నారు . ఇక శర్వా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రీరామ్ అదిర్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా శర్వాకు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.