టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తన హాట్ గ్లామర్ తో ఇంస్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఎంతో టాలెంట్ వున్న ఈ యంగ్ బ్యూటీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే బాగా రానిస్తుంది.ప్రియ దర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాలో అనన్య హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది..అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. సమంత శాకుంతలం చిత్రంలో కూడా అనన్య చిన్న పాత్రలో నటించి మెప్పించింది.పెర్ఫార్మన్స్ రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఈ భామ భావించింది.అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.అలాగే గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో గ్లామర్ సంకేతాలు ఇస్తుంది.
ఇటీవల అనన్య నాగళ్ళ ఎక్కువగా యూత్ అట్రాక్ట్ చేసే గ్లామర్ ఫొటోలే షేర్ చేస్తోంది. ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ అన్వేషి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అనన్య నాగళ్ళ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. అయితే ఆ ఇంటర్వ్యూ లలో ఆమె గ్లామర్ ఫోటోలపై చర్చ జరిగింది. ఇంత గ్లామరస్ గా తరచుగా ఫోటోలు షేర్ చేయడం ఎందుకు అని ప్రశ్నించగా అనన్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది.వకీల్ సాబ్ సినిమా ముందు వరకు నేను ఎక్కువగా ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసేదాన్ని. శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక గ్లామర్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నాను అని తెలిపింది.. ఇండస్ట్రీ లో మనం కూడా రేసులో ఉండాలి. కాబట్టి అలాంటి గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం తప్పనిసరి. నా గ్లామర్ ఫోటోల వెనుక అసలు కారణం అదే..ఇంకేమి లేదు అని అనన్య బదులు ఇచ్చింది.