మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం రేపుతుంది. మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటీ పేరుతో ఉన్న ఆ లేఖలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నయ్య ఆయన అనుచరులు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించినట్లు లేఖలో ఉంది.
Also Read : Sandra venkata verayya: వాళ్ల మాదిరి కులాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేయడంలేదు
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చూపులు, కామా పిశాచి, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఆరోపణలు చేశారు. అర్జన్ డైరీకి సాయంత అందించి రైతులు నష్టపోయేలా ఎమ్మెల్యే చేశారని మావోయిస్టులు ఆరోపించారు. అర్జిన్ డైరీ నిర్వహకులు అమ్మాయిలను సరఫరా చేశారన్నారు. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. పద్దతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. అయితే ఈ లేఖపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఎండాకాలంలో జుట్టు హెల్తీగా ఉండాలంటే ఇలా చేయండి
ఈ లేఖను మావోయిస్టులే రాశారా లేదా వేరే ఎవరైనా మావోయిస్టుల పేరుతో రాశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులతో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిని దుర్గం చిన్నయ్య ఖండించారు. తనపై ఉద్దేశపుర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనపై కావాలనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని విమర్శించారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.