జుట్టు ఆరోగ్యం వంశపారంపర్యం, పోషణ, బాహ్య సంరక్షణలపై ఆధారపడి
కానీ ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలను ఫేస్ చేస్తున్నారు
ఎండాకాలంలోనే జుట్టు ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది
మీ ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు,ఇతర పోషకాలు ఉండేలా చూసుకోవాలి
తాజా పండ్లు, ముడి సలాడ్లు, మొలకలు, ఆకుకూరలు, చేపలు, మాంసం, గుడ్లు, అమైనో ఆమ్లాలు పుష్కలం
పౌష్టికాహారంతో పాటుగా రోజువారీ వ్యాయామం, విశ్రాంతి, ఒత్తిడి నుంచి విముక్తి, తగినంత నిద్ర
ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి
జిడ్డుగల జుట్టును వారానికి మూడు సార్లు, పొడి జుట్టును వారానికి రెండుసార్లు వాష్ చేస్తే సరిపోతుంది
షాంపూ పెట్టిన తర్వాత టవల్ తో వెంట్రుకలను రుద్దడం మానుకోండి
హెయిర్ డ్రయ్యర్లను ఉపయోగించడం మంచిది కాదు.. జుట్టును సహజంగా ఆరేలా చూసుకోండి
జుట్టుకు నూనె పెట్టి కొద్ది సేపు మసాజ్ చేయాలి.. దీనివల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ పెరుగుతుంది
షాంపూ చేసిన తర్వాత క్రీమీ కండీషనర్ వాడండి. ఇలా చేస్తే మీ జుట్టు పెరుగుతుంది