వాల్‌నట్‌లను “బ్రెయిన్ ఫుడ్” అని కూడా పిలుస్తారు. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (విటమిన్ E, B6 వంటివి), ఖనిజాలు, మెగ్నీషియం, రాగి, కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే అవి మన శరీరంలోని అనేక భాగాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్ నట్స్ ను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు కలుగుతాయటున్నారు నిపుణులు. నానాబెట్టిన వాల్ నట్స్ ను ఉదయంపూట తింటే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.
Also Read:Boat Capsized : వికారాబాద్‌లో బోటు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి, ఒకరి పరిస్థితి విషమం
మెదడు:
వాల్‌నట్‌లు మెదడు ఆకారంలో ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వాటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, ఏకాగ్రతను పెంచడంలో, నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె:
వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, రక్త ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read:Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
జీర్ణవ్యవస్థ :
వాల్‌నట్స్‌లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మంచి గట్ బాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పేగు మంట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
Also Read:Vaibhav Suryavanshi: గ్రౌండ్ ఏదైనా సరే వీరబాదుడే.. U19లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల డైనమైట్..!
చర్మం, జుట్టు:
వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని తేమగా ఉంచడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.