Boat Capsized : వికారాబాద్‌లో బోటు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి, ఒకరి పరిస్థితి విషమం
- వికారాబాద్ సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా
- ఇద్దరు మహిళలు మృతి
- మరో ముగ్గురిని రక్షించిన స్థానికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized : వికారాబాద్ జిల్లాలోని సర్పన్‌పల్లి ప్రాజెక్ట్ వద్ద వీకెండ్ విహారయాత్ర విషాదంగా మారింది. బోటు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించారు. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న బంధువులను కలుసుకునేందుకు వచ్చారు. వారితో పాటు మరో మూడు కుటుంబాలు కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న వెల్డర్ నేస్ రిసార్ట్‌కి విహారయాత్రకు వెళ్లారు.
Today Astrology: ఆదివారం దినఫలాలు.. ఆ పనులకు దూరంగా ఉండండి?
Also Read
సాయంత్రం సమయంలో రిసార్ట్ నిర్వాహకులు బోటింగ్‌కి తీసుకెళ్లగా, తిరుగు ప్రయాణంలో వర్షం ప్రారంభమైంది. అప్రమత్తం కాకుండా హడావుడిగా తిరిగే సమయంలో బోటు తొండం విరిగిపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగింది. ఈ ప్రమాదంలో రీతికా, పూనమ్ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చింతాజనక విషయం ఏమిటంటే, ఈ రిసార్ట్‌కు బోటింగ్ నిర్వహించేందుకు అధికారిక అనుమతులు లేవన్న విషయం వెలుగు చూసింది. గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CM Chandrababu: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!