Vaibhav Suryavanshi: ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత్ అండర్-19 జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. తాజాగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగవ వన్డేలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వర్సెస్టర్ లోని న్యూ రోడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 52 బంతుల్లో శతకం చేసి అండర్-19 వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 14 ఏళ్ల వయసులోనే ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. తనలోని అసాధారణమైన ఆత్మవిశ్వాసం, దూకుడు, టైమింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Read Also:IND vs ENG: విజయం ముంగిట భారత్.. లాంఛనమే మిగిలిందా..?
ఈ ఇన్నింగ్స్ లో మొదట కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాత మరో 28 బంతుల్లోనే శతకం పూర్తీ చేసాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ రాల్ఫీ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికే ఈ చరిత్రాత్మక శతకాన్ని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 బౌండరీలు, 7 సిక్సర్లు బాదాడు. ఈ ఘనతతో అతను 2022లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ చేసిన పాకిస్థాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక భారత ఆటగాళ్లలో గతంలో వేగవంతమైన సెంచరీ 69 బంతుల్లో చేసిన రాజ్ అంగద్ బావా పేరిట ఉంది.
బీహార్ లో జన్మించిన వైభవ్ ఈ సిరీస్‌లో ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్ లో అతను తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే రెండో మ్యాచ్‌లో 45(34), మూడవ మ్యాచ్ నార్తాంప్టన్‌లో 31 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేశాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డు బ్రేకింగ్ శతకం ద్వారా వైభవ్ ప్రపంచానికి తన ప్రతిభను చూపాడు. ఈ మ్యాచ్ లో అతను మొత్తంగా 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో భారీ 143 పరుగులను చేశాడు.
Read Also:Auto on Railway Track: రైల్వే ట్రాక్ పై ఆటో పరుగులు.. వేగంగా దూసుకొచ్చిన రైలు.. చివరకు
వర్సెస్టర్ వేదికగా జరిగిన నాలుగో యువ వన్డేలో భారత్ అండర్-19 జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ అండర్-19 జట్టు 45.3 ఓవర్లలో 308 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1⃣4⃣3⃣ runs
7⃣8⃣ deliveries
1⃣3⃣ fours
🔟 Sixes 💥14-year old Vaibhav Suryavanshi registered a century off just 52 deliveries, the fastest 💯 in U19 and Youth ODIs 🔥🔥
Scorecard – https://t.co/1UbUq20eKD#TeamIndia pic.twitter.com/ymXf3Ycmqr
— BCCI (@BCCI) July 5, 2025