మనం పాములకు భయపడతాము, ఎందుకంటే ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవిగా పరిగణించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు ఉన్నాయి. వాటిలో చాలా రకాల పాములు అత్యంత విషపూరితమైనవి కాగా.. కొన్ని చూసేందుకు భయంకరంగా కనిపించేవి కూడా ఉన్నాయి. కానీ ఒక్క పాము కూడా లేని దేశం గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేశం కూడా ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారు కదా..!
Read Also: Pulses Price Hike: పెరుగుతున్న పప్పుల ధరలు. బ్రేక్ వేయనున్న కేంద్రం..!
ఈ ప్రపంచంలో ఒక్క పాము కూడా లేని దేశం ఒకటి ఉంది. అది ఐర్లాండ్.. అక్కడ చూద్దామంటే కూడా ఒక్క పాము కనబడదు.. ఎంత వెతికినా పాము అన్న మాట వినిపించదు అంటే షాక్ అయ్యారు కదా..? పాము లేని చోటు ఉండదని మీరు అనుకుంటారు. కానీ నిజంగా ఐర్లాండ్‌లో పాములు లేవు..?
Read Also: Nitin Gadkari: ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్..
నిజానికి, ఐర్లాండ్‌లో పాములు ఉండకపోవడానికి ఒక పురాతన కథ ఉంది. ఐర్లాండ్‌లోని క్రైస్తవ మతాన్ని రక్షించడానికి, సెయింట్ పాట్రిక్ దేశం నలుమూలల నుంచి పాములను ద్వీపం నుంచి తీసుకెళ్లి సముద్రంలో విసిరినట్లు చెపుతారు. 40 రోజుల పాటు తినకుండా, తాగకుండా అతడు ఈ పని చేశాడని వినికిడి. ఇక ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే.. ఈ దేశంలో పాములు ఎప్పుడూ లేవని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఐర్లాండ్‌లో ఇప్పటి వరకు పాములు ఉన్న దాఖలాలు లేవని ఫాసిల్ రికార్డ్స్ విభాగం పేర్కొంది. ఐర్లాండ్‌లో పాములు లేకపోవడం గురించి మరొక కథ కూడా ఉంది.
Read Also: Bhagavanth kesari :ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్న బాలయ్య ఫ్యాన్స్..
అయితే, ఇంతకు ముందు ఇక్కడ పాములు ఉండేవి.. కానీ, ఇక్కడ చలి ఎక్కువగా ఉండటంతో అవి చనిపోయాయి. ఐర్లాండ్ లో విపరీతమైన చలి కారణంగా అప్పటి నుంచి పాములు కనిపించడం లేదని అక్కడి ప్రజలు నమ్ముతారు. మరో విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో కూడా పాములు ఉండవు. ఈ ద్వీప దేశం అనేక అడవి జంతువులకు నిలయంగా ఉంది. కానీ ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు అక్కడ ఒక్క పాము కూడా కనిపించలేదు.. ఇక్కడ బల్లులు మాత్రమే కనబడుతాయి.